Visakhapatnam

News January 15, 2026

గాజువాక: లారీ ఢీకొట్టి వ్యక్తి మృతి

image

గాజువాక వడ్లపూడి జంక్షన్ ఆటోనగర్ వెళ్లే రహదారిలో లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నిన్న రాత్రి జరిగింది. వడ్లపూడిలో నివాసం ఉంటున్న చింత సంతోష్ కుమార్ ఇంటికి వెళ్ళటానికి రోడ్డు దాటుతుండగా కూర్మన్నపాలెం నుంచి గాజువాక వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంతోష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 13, 2026

కేజీహెచ్‌లో నాలుగు నెలల్లో 100 క్యాన్సర్ ఆపరేషన్లు

image

కేజీహెచ్‌లో వివిధ రకాల క్యాన్సర్లకు అత్యాధునిక ట్రీట్మెంట్ జరుగుతోందని విభాగాధిపతి ఎమ్మెస్ శ్రీనివాస్ తెలిపారు. 4 నెలల క్రితం ఆరోగ్య శాఖ మంత్రి కేజీహెచ్‌లో సిటీ ఇమ్యులేటర్, ఎక్సలేటర్ క్యాన్సర్ గడ్డలు కనుగొనే పరికరాన్ని ప్రారంభించారు. ఈ పరికరంతో ఏడు జిల్లాల నుంచి వస్తున్న రోగులు, ఒరిస్సా నుంచి వచ్చిన దాదాపు 100 మందికి ఆపరేషన్లు చేశామని కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణీ పేర్కొన్నారు.

News January 13, 2026

కేజీహెచ్‌లో నాలుగు నెలల్లో 100 క్యాన్సర్ ఆపరేషన్లు

image

కేజీహెచ్‌లో వివిధ రకాల క్యాన్సర్లకు అత్యాధునిక ట్రీట్మెంట్ జరుగుతోందని విభాగాధిపతి ఎమ్మెస్ శ్రీనివాస్ తెలిపారు. 4 నెలల క్రితం ఆరోగ్య శాఖ మంత్రి కేజీహెచ్‌లో సిటీ ఇమ్యులేటర్, ఎక్సలేటర్ క్యాన్సర్ గడ్డలు కనుగొనే పరికరాన్ని ప్రారంభించారు. ఈ పరికరంతో ఏడు జిల్లాల నుంచి వస్తున్న రోగులు, ఒరిస్సా నుంచి వచ్చిన దాదాపు 100 మందికి ఆపరేషన్లు చేశామని కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణీ పేర్కొన్నారు.

News January 13, 2026

విశాఖలో వాహనదారులకు అలర్ట్

image

విశాఖలో వాయు కాలుష్యాన్ని తగ్గించే సదుద్దేశంతో ‘నో పొల్యూషన్ సర్టిఫికేట్ – నో ఫ్యూయల్‌’పై టైకూన్ జంక్షన్ నుంచి మద్దిలపాలెం వరకు ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నెలాఖరు వరకు వాహనదారులకు దీనిపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత పెట్రోల్ బంకుల్లో ఇబ్బందులు రాకుండా.. జరిమానాలు పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలని త్రీ టౌన్ సీఐ అమ్మి నాయుడు తెలిపారు.

News January 13, 2026

వారసత్వ వ్యవసాయ భూములకు స్థిర స్టాంప్ డ్యూటీ: విశాఖ కలెక్టర్

image

పార్టిషన్ డీడ్ రిజిస్ట్రేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత సౌలభ్యం కల్పిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. వీలునామా లేకుండా వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములపై పార్టిషన్ డీడ్ నమోదు సందర్భంలో మొత్తం మార్కెట్ విలువ రూ.10 లక్షలు మించకపోతే రూ.100 స్థిర స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తామన్నారు. రూ.10 లక్షలు మించితే రూ.1000 స్థిర స్టాంప్ డ్యూటీ.

News January 13, 2026

విశాఖ: స్వపక్షంలోనే విపక్షమా..!

image

కూటమిలో కీలకంగా ఉన్నా.. తనదైన వ్యాఖ్యలతో తరచూ చర్చకు కేంద్రంగా నిలుస్తున్నారు MLA విష్ణుకుమార్ రాజు. డేటా సెంటర్ల ఉద్యోగాల అంశం, రుషికొండ భవనాల, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ విషయంలో ప్రభుత్వానికి అసౌకర్యం కలిగేలా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. కూటమిలో తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావన.. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఆయనకు సంబంధించిన బకాయిలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో అసహనానికి గురవుతున్నారనే వాదన ఉంది.

News January 13, 2026

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం.. 10 మందికి మెమోలు

image

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన 10 మంది అధికారులకు కలెక్టర్‌‌ హరేంధిర ప్రసాద్ మెమోలు జారీ చేశారు. సోమవారం PGRSలో అర్జీలపై సమీక్షించారు. టౌన్‌ప్లానింగ్‌, హౌసింగ్‌ విభాగాల్లో తూతూమంత్రంగా ఎండార్స్‌మెంట్లు ఇస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2, 4, 5, 6, 8వ జోన్‌లలో సంబంధిత కమిషనర్‌లకు, టౌన్‌ప్లానింగ్‌, DE, ASOలకు మెమోలు జారీశారు. దీనిపై వివరణ ఇవ్వాలని నోడల్‌ అధికారి శేషశైలజను ఆదేశించారు.

News January 13, 2026

విశాఖ: 9 ట్రావెట్ బస్సులపై కేసు నమోదు

image

ఉప రవాణా కమిషనర్ ఆర్‌సీ‌హెచ్.శ్రీనివాస్ ఆదేశాల మేరకు సోమవారం కుర్మాన్నపాలెం వద్ద మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ బుచ్చిరాజు, రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 9 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయకూడదని ఆదేశించారు.

News January 13, 2026

విశాఖ: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు సహకరిస్తున్న ఇద్దరి అరెస్ట్

image

క్రికెట్ బెట్టింగ్‌కు సహకరిస్తున్న ఇద్దరు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా ప్రచారం చేస్తూ ప్రధాన నిందితులకు బ్యాంక్ అకౌంట్లు, మ్యూల్ అకౌంట్లు సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలకు ఎక్కువ డబ్బులు ఆశ చూపి మోసాలకు పాల్పడ్డారు. రంగారెడ్డికి చెందిన కనుకుట్ల సంతోష్ రెడ్డి, ఖమ్మంకు చెందిన అబ్బూరి గోపిలను అరెస్ట్ చేశారు.

News January 12, 2026

గ్రేటర్ విశాఖ బడ్జెట్‌ ఎంతంటే?

image

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌కు స్థాయి సంఘం ఆమోదం తెలిపింది. మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.4047.12 కోట్లుగా నిర్ణయించారు. ప్రారంభ నిల్వగా రూ.365.96 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం జమలు రూ.4180.37 కోట్లు కాగా, వ్యయం రూ.4047.12 కోట్లుగా అంచనా వేశారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ బడ్జెట్‌ను స్థాయి సంఘం ఆమోదించింది.