India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు శనివారం విశాఖలో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లు, రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 2 ట్రావెల్ బస్సులను సీజ్ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన మరో 5 బస్సులపై కేసుల నమోదు చేసి రూ.60,000 జరిమానాలు విధించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేజీహెచ్‌లోని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వార్డులో పర్యటించారు. వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడగా రోగి సిబ్బందికి డబ్బులు ఇచ్చినట్లుగా చెప్పడంతో విచారణకు ఆదేశించారు. అక్కడే ఉన్న సూపర్డెంట్ ఈ విషయంపై విచారణ చేయాలని వైద్యం కోసం ఏ ఒక్కరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్నిచోట్ల ఉచితంగా వైద్య సేవలు అనే బోర్డులు పెట్టాలని సూచించారు

KGHలో వైద్యం కోసం వచ్చే రోగులను ఎవరైనా డబ్బులు అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. శనివారం KGHలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ట్రీట్‌మెంట్‌కు డబ్బులు అడిగినట్టు రోగి బంధువులు తనకు తెలిపారని, ఈ విషయంపై విచారణ చేపట్టాలని సూపరిండెంటెంట్‌ను ఆదేశించారు.

ఇకపై KGHలో గంటల తరబడి ఓపీ, ఇతర వైద్య పరీక్షల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలకు చెక్ పెట్టే దిశగా ఈ-పాలన విధానాన్ని KGH అమలు చేయనుంది. రోగులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వైద్య సేవలను ఆన్‌లైన్ విధానంలో అందించడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు KGH అధికారులు తెలిపారు.

విశాఖ MLA విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వీటి వెనుక రాజకీయాలకన్నా టిడ్కో ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బకాయిల అంశమే ప్రధాన కారణమన్న చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బిల్లుల రూపంలో విష్ణు కుటుంబానికి సుమారు రూ.120 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం టిడ్కో బకాయిల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.

సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు 2 రోజులుగా విశాఖలో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లు,ర వాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 26 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.52,000 జరిమానాలు విధించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలు కొనసాగుతాయన్నారు.

ఆర్టీసీ కాంప్లెక్స్, ఎల్ఐసీ బిల్డింగ్ మధ్యలో ఉన్న బస్టాప్ వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయసు 75 సంవత్సరాలు దాటి ఉంటుందని ట్రాఫిక్ ఎస్ఐ సింహాచలం తెలిపారు. వైట్ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని.. సీసీ ఫుటేజ్‌లు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

విశాఖలో పండగ పూట విషాదం నెలకొంది. MVP పోలీసుల వివరాల ప్రకారం.. పాత వెంకోజీ పాలెంలో ఉంటున్న బాలిక పల్లవి పండగ సందర్భంగా చీర కట్టుకుంటానని తల్లి లక్ష్మిని కోరింది. చీర వద్దు హాఫ్‌శారీ కట్టుకోమని తల్లి చెప్పడంతో గురువారం సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన పల్లవి MVP కాలనీలో తన తాతయ్య వాచ్మెన్‌గా ఉంటున్న రెసిడెన్సి వద్ద ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో నగరంలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ కార్యాలయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ విశాఖలో నిరంతర నిఘా కొనసాగించారు. గంజాయి వంటి మత్తుపదార్థాలు రవాణా కాకుండా ప్రజల భద్రత, యువత భవిష్యత్తు, రక్షణే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి తెప్పోత్సవం ఈ నెల 18న (ఆదివారం) వరాహ పుష్కరిణిలో వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొండపై నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది. ఉత్సవం కారణంగా ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుందని ఆలయ అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.