India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలో ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షల నిర్వహణను జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ సోమవారం తనిఖీ చేశారు. విశాఖ ఉమెన్స్ జూనియర్ కాలేజీ, ఎసెంట్ జూనియర్ కాలేజీలలో పరీక్షా కేంద్రాలను ఆయన సందర్శించి పరీక్షల నిర్వహణ పరిశీలించారు. మొత్తం 38,879 మంది విద్యార్థులకు 38,478 మంది హాజరు కాగా 401 మంది గైర్హాజరయ్యారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులు ఎలిమినేట్ అవుతున్నారు. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదుగురు అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఇంకా ఐదుగురు అభ్యర్థులు మిగిలి ఉన్నారు. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులలో పి.శివ ప్రసాద్, ఎస్ఎస్.పద్మావతి, డాక్టర్ కే.రాధాకృష్ణ, ఆర్.సత్యనారాయణ, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు ఉన్నారు. కాగా ‘గాదె’ ముందంజలో కొనసాగుతున్నారు.
రుషికొండ బీచ్ బ్లూఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేయడంపై భీమిలి MLA గంటా శ్రీనివాసురావు అసెంబ్లీలో ప్రస్తావించారు. విశాఖకు ముఖ్యమైన IT, టూరిజంని అభివృద్ధి చేయాలని కోరారు. ఒకసారి బ్యాడ్ రిమార్క్ వస్తే ఇంటర్నేషనల్ టూరిస్టులు వెనుకడుగు వేస్తారని అన్నారు. ఈ నాలుగైదు రోజుల్లో బ్లూఫ్లాగ్ కమిటీ వస్తుందని ఆ టైంకి పునరుద్ధరించాలన్నారు. రద్దుకు కారణం ఎవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నేటి నుంచి ఈనెల 13వ తేది వరకు పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గంట ముందు మండల విద్యాశాఖ కార్యాలయం నుంచి ప్రశ్న పత్రాలు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:45 వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులకు పరీక్షలపై భయం పోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని అన్నారు.
జీవీఎంసీ మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు కూటమి కసరస్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మార్చి 18కి జీవీఎంసీ మేయర్ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీవీఎంసీ బడ్జెట్ సమావేశం నిర్వహించకపోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
➤ పీజీటీ విభాగం: హిందీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ పోస్టులు
➤ టీజీటీ విభాగం: ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్, స్పోర్ట్ కోచ్, క్రాఫ్ట్, యోగా, నర్స్ పోస్టు
➤ ఇంటర్వ్యూ తేదీ: మార్చి 4న ఉ.8.30 నుంచి ప్రారంభం
➤ లొకేషన్: స్టీల్ ప్లాంట్ కేవీ
NOTE: పూర్తి వివరాలకు స్కూల్ వెబ్ సైట్‌ను సంప్రదించగలరు >Share it
విశాఖ ముడసర్లోవ పార్కు వద్ద రోడ్డు పక్కన ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి(48) మృతి చెంది పడి ఉన్నట్లు ఆరిలోవ ఎస్ఐ రామదాసు పేర్కొన్నారు. మృతదేహంపై ఏవిధమైన గాయాలు లేకపోవడతో అనారోగ్యంతో మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేసి సీఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నేటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలు కానున్నాయి. అయితే ఈరోజు నుంచి మార్చి 15వ తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. విశాఖ జిల్లాలో మొత్తం 87 పరీక్ష కేంద్రాలలో 40,744 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరిలో బాలురు 21,464 ఉండగా బాలికలు 19,280 మంది ఉన్నారు. 15 నిమిషాలు ముందుగా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలన్నారు.
సాగర్ నగర్‌లోని ఇస్కాన్ మందిరంలో ఆదివారం రాత్రి నిర్వహించిన వామన దేవుని అవతారం అంతర్జాతీయ నాటకంలో కళాకారుల ప్రదర్శన అబ్బురపరిచింది. విదేశాలకు చెందిన కళాకారులు భారతీయ సాంప్రదాయాన్ని, ఇతిహాసాలను అద్భుతంగా ప్రదర్శించిన ఈ నాటకం ప్రేక్షకులను ఆద్యంతం అలరించింది. దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా నుంచి వచ్చిన కళాకారుల బృందం కెనడాకు చెందిన స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.
టీచర్స్ MLC ఎన్నికల ఓట్ల లెక్కింపు AUలో ఈరోజు ఉ.8 గంటలకు ప్రారంభం కానుందని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. లెక్కింపు సందర్భంగా ఏయూ పరిసర ప్రాంతాలలో ఉ.6 నుంచి కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుంపుగా తిరుగుట నిషేధమన్నారు. మొత్తం 20,783 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు మద్యం షాపులు బంద్ కాగా.. గెలిచిన అభ్యర్థులకు విజయోత్సవ ర్యాలీలు అనుమతి లేదన్నారు.
Sorry, no posts matched your criteria.