India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ పోస్టుకు న్యూఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావన్కోర్ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.శక్తిమణి ఎంపికయ్యారు. ఈ పోస్ట్‌కు దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఈడీ దీప్తెండు కూడా ఇంటర్వ్యూకి హాజరు కాగా అర్హతులను బట్టి శక్తిమణిని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు ఎంపిక చేసింది. కాగా ప్రస్తుత సీఎండీ అతుల్‌భట్ నవంబర్‌లో రిటైర్ అవుతున్నారు.
వరదల కారణంగా ఈనెల 4వ తేదీన పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. నాందేడ్‌లో బయలుదేరే నాందేడ్-విశాఖ స్పెషల్, పాండిచ్చేరిలో బయలుదేరే పాండిచ్చేరి హౌరా స్పెషల్, సికింద్రాబాద్‌లో బయలుదేరే సికింద్రాబాద్-విశాఖ వందే భారత్, విశాఖలో బయలుదేరే విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
ఏయూ దూరవిద్యా కేంద్రం పరిధిలో ఈనెల 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు ఈనెల 5, 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య కృష్ణమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఈనెల రెండో తేదీన జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసామన్నారు అదేవిధంగా మూడో తేదీన జరగాల్సిన పరీక్ష కూడా వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రెండు పరీక్షలు 5, 6 తేదీల్లో నిర్వహిస్తామన్నారు.
ఆర్బీఐ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు ఈ నెల 19న ఆన్‌లైన్‌లో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్‌లో గోడపత్రికను లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్‌తో కలిసి ఆవిష్కరించారు. విద్యార్థులు కనీసం ఇద్దరూ చొప్పున గ్రూప్‌గా ఏర్పడి 17లోగా వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారని అన్నారు.
వరదల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు కావడంతో విశాఖ రైల్వే స్టేషన్ నిర్మాణుష్యంగా దర్శనమిస్తోంది. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే రైల్వే స్టేషన్ ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. ప్లాట్ఫారాలు సైతం ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. విశాఖ నుంచి బయలుదేరే ప్రధాన రైలు అన్నింటిని అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడక్కడ ప్రయాణికులు చేసేదిలేక ప్లాట్ఫారాలపైనే ఆశ్రయం పొందుతున్నారు.
నర్సీపట్నంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ రెండు వర్గాల మధ్య కొట్లాటకు దారి తీసిందని టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఒక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు అవతల వర్గం వారిపై చేసిన వ్యాఖ్యల వల్ల జోగినాథునిపాలెం, బీసీ కాలనీ ప్రాంతాలలో ఇరు వర్గాలు కొట్టుకున్నాయని తెలిపారు. కొట్లాటలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. ఇరు వర్గాలకు చెందిన 11 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
రాబోయే పండగల సీజన్ లో విశాఖ-సికింద్రాబాద్-విశాఖ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. ఈనెల 8 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు సికింద్రాబాద్-విశాఖ స్పెషల్ ట్రైన్ ప్రతి ఆదివారం సికింద్రాబాద్‌లో సాయంత్రం బయలుదేరుతుందని మరుసటి రోజు విశాఖ వస్తుందని తెలిపారు. అలాగే విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు ఈ నెల 9 నుంచి డిసెంబర్ రెండో తేదీ వరకు ప్రతి సోమవారం నడుస్తుందన్నారు.
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు క్యాబినెట్ హోదా దక్కింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకునిగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇకపై క్యాబినెట్ హోదాలో ఎమ్మెల్సీ బొత్సకు అవసరమైన ప్రొటోకాల్, మర్యాదలు ఇవ్వాలని ప్రభుత్వ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అల్లూరి జిల్లా జీ.మాడుగుల మండలం బంధవీధి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పిఓ అభిషేక్ తనిఖీ చేశారు. విద్యార్థుల అదృశ్యం పట్టించుకోకపోవడంపై ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్, కుక్‌లకు పీఓ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజులుగా విద్యార్థులు బయట ఉంటే ఏమి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లోపంపై డీడీ కొండలరావు, ఏటీడబ్ల్యూఓ తిరుపాల్‌లను మందలించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింహరావు తెలిపారు. విశాఖ సీఐటీయూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేయలేదన్నారు. ఫలితంగా ఉత్పత్తి 73 లక్షల నుంచి 45 లక్షలకు పడిపోయిందన్నారు. వీఆర్ఎస్ పేరుతో కార్మికులను బయటకు పంపిస్తున్నారన్నారు.
Sorry, no posts matched your criteria.