India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మల్కాపురంలో ఓ యువకుడు తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. వానపల్లి సాయి గణేశ్ (23) మల్కాపురం హరిజన వీధిలో ఉంటున్నాడు. తనకు బైక్ కొనివ్వాలని వారం రోజులుగా తల్లిదండ్రులతో గొడవపడేవాడు. మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. తండ్రి అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

విశాఖలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. టూటౌన్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్య బస్సు కోసం సహోద్యోగి ద్విచక్రవాహనంపై జైలురోడ్డు నుంచి జగదాంబ జంక్షన్‌కి వెళ్తున్నారు. ఆ సమయంలో ఆటు నుంచి వస్తున్న జీవీఎంసీ గార్బేజ్ లారీ వారిని వెనుక నుంచి ఢీకొట్టింది. ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న లావణ్య కుడివైపు పడిపోవడంతో ఆమె తలపై నుంచి లారీ వెళ్లింది.

కైలాసపట్నం బాణసంచా కేంద్రంలో క్రాకర్స్ తయారీకి కెమికల్స్‌ను గ్రైండర్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. కోటవురట్ల పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. రెండో నంబర్ షెడ్లలో పేలుడు జరిగి వ్యాపించిన మంటలు దగ్గరలో ఉన్న ఒకటో నంబర్ షెడ్‌కు వ్యాప్తి చెందినట్లు తెలిపారు. పక్క పక్కనే షెడ్‌లు ఉండటంవల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందన్నారు.

దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం విశాఖ రానున్నారు. ఈరోజు రాత్రి 10:45కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని ఓ హోటల్‌లో బస చేస్తారు. బుధవారం సింహాచలం దేవాలయానికి వెళ్లి చందనోత్సవ పనులపై అధికారులతో కలిసి సమీక్ష చేస్తారు. సాయంత్రం సింహాచలం నుంచి విశాఖ ఎయిర్పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.

చర్లపల్లి నుంచి కిసాన్ గంజ్ (07046) రైల్లులో ప్రయాణిస్తున్న మహిళ ఆదివారం అర్ధరాత్రి 12:30కు దువ్వాడ సమీపంలో ప్రసవించింది. రైలులో ఉన్న జైనాబ్‌కు పురిటి నొప్పులు రావడంతో రైల్వే సిబ్బంది గమనించి సత్వర చర్యలు చేపట్టారు. ఆమె రైలులోనే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తక్షణమే తర్వాత స్టేషన్లో హాస్పిటల్‌కి తరలించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు.

పెళ్లికి ముందు ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడిని’ అంటూ నేచురల్ స్టార్ నాని తన పర్సనల్ సీక్రెట్ బయటపెట్టారు. ఆయన లీడ్ రోల్లో దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ‘హిట్- 3’ సినిమా ట్రైలర్ సోమవారం రిలీజైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ విశాఖ నగరంలో సంగం థియేటర్లో సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాని మరిన్ని విషయాలు పంచుకున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న వైవాహిక జీవితంలో అనుమానం పెరిగి భార్యను హత్య చేశాడు. అడ్డరోడ్డుకు చెందిన అనూష, దువ్వాడకు చెందిన జ్ఞానేశ్వర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ మధురవాడలో నివాసం ఉంటున్నారు. జ్ఞానేశ్వర్ మరొక అమ్మాయితో సంబంధం ఉన్నదని ఇద్దరి మధ్య గొడవ అయింది. దీంతో భర్త ఎనిమిది నెలల గర్భిణీ గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడంతో మృతి చెందింది. మృతురాలిని కెజిహెచ్ హాస్పిటల్‌కి తరలించారు.

నేటితరం యువత అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని విశాఖ సీపీ శంఖబ్రాత బాగ్చి అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీపీ కార్యాలయంలో సోమవారం వేడుకలు నిర్వహించారు. అంబేడ్కర్ చిత్ర పటానికి సీపీ పూల మాలల వేసి నివాళులు అర్పించారు. దళితుల, గిరిజనులు, బహుజనుల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల రక్షణ కోసం రాజ్యాంగంలో అనేక ప్రతిపాదనలు రూపొందించారన్నారు.

నగరంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. రెడ్డి కంచరపాలెంకు చెందిన నిహారిక ఉమెన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎగ్జామ్స్ రాసింది. జువాలజీ సబ్జెక్టు పోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. తల్లి గమనించి కిందకు దించేసరికే ఆమె మరణించింది. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆరిలోవ చిన్నగదిలి జేమ్స్ ఆసుపత్రి సమీపంలో బీఆర్టీఎస్ రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వ్యక్తి మృతి చెందారు. మృతుడు ఒడిశాకు చెందిన బిజయ్‌ముండా(60)గా గుర్తించారు. అతడు కోడలిని తీసుకొని హెల్త్ సిటీలోని ఓ హస్పిటల్‌కు ఆదివారం తీసుకొచ్చారు. ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
Sorry, no posts matched your criteria.