Visakhapatnam

News February 27, 2025

విశాఖ పోలీసుల పర్యవేక్షణలో పుణ్యస్నానాలు

image

శివరాత్రి జాగరణ అనంతరం విశాఖ నగరవాసులు గురువారం సముద్రంలో పుణ్యస్నానాలు చేశారు. వీరి కోసం అటు అధికారులు ఇటు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీస్ బలగాలను మోహరించినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. అలాగే జన సందోహంలో చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు అధునాతన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ వ్యవస్థను ఉపయోగించారు.

News February 27, 2025

విశాఖలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

image

విశాఖలో గురువారం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరిగాయి. జిల్లాలోని 13 కేంద్రాల్లో 87.30 శాతం ఓటింగ్ నమోదైనట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు ఎన్నికల విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు.

News February 27, 2025

విశాఖ మెడికల్ స్టోర్ ముందే కుప్పకూలిపోయాడు

image

విశాఖలోని డాబా గార్డెన్ వద్ద గల నీలమ్మ వేప చెట్టు సమీపంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు మెడికల్ స్టోర్ వద్దకు వచ్చి మందులు తీసుకునే సమయంలో కుప్పకూలి పడిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న టూ టౌన్ పోలీసులు మృతుని వివరాలపై ఆరా తీశారు. అతని వద్ద కేవలం మందుల చీటీ తప్ప మరే ఆధారం లేకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 27, 2025

KGHలో శిశువుల మార్పిడి.. ప్రత్యేక విచారణ కమిటీ

image

విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)లో శిశువుల మార్పిడి ఘటన కలకలం రేపింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శివానంద్ దీనిపై స్పందించారు. ఈ మార్పిడి ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఏడుగురు అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే సీసీ ఫుటేజీ ఆధారంగా అసలు విషయం వెలుగులోకి వస్తుందన్నారు.

News February 27, 2025

తల్లి మందలించిందని బాలుడి సూసైడ్

image

కంచరపాలెం సమీపంలోని కేవీ స్కూల్లో 9వ తరగతిచదువుతున్న దాసరి ఎర్రినిబాబు తన ఇంట్లో మేడపై బాత్రూంలో నైలాన్ తాడుతూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూల్ సెలవు కావడంతో ఉదయం నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లి ఎర్రినిబాబును మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు సాయంత్రం మేడ మీదకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

News February 27, 2025

విశాఖ మహా కుంభాభిషేకంలో పాల్గొన్న బ్రహ్మానందం

image

విశాఖ ఆర్కే బీచ్‌లో మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు బ్రహ్మానందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ హైందవ ధర్మంను కాపాడుకోవడాన్ని తమ భాద్యతగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

News February 27, 2025

విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లు రీ షెడ్యూల్

image

విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లను నేడు రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి 22:45 గంటలకు బయలుదేరాల్సిన హౌరా – SMV బెంగుళూరు SF ఎక్స్‌ప్రెస్ గురువారం తెల్లవారుజామున 2 గంటలకు హౌరాలో బయలుదేరనుంది. సికింద్రాబాద్ – విశాఖ గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ ఈరోజు రాత్రి గంట ఆలస్యంగా 9.30 గంటలకు విశాఖలో బయలుదేరనుంది. ప్రయాణీకులు గమనించాలని కోరారు.

News February 26, 2025

విశాఖ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ విశాఖ జిల్లా వ్యాప్తంగా మార్మోగిన శివనామస్మరణ
➤ రేపు 13 కేంద్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
➤ జిల్లా వ్యాప్తంగా రేపు అన్ని పాఠశాలలకు సెలవు
➤ త్వరలో విశాఖ మెట్రో పనులు ప్రారంభం?
➤ మల్కాపురానికి చెందిన 22 ఏళ్ల యువకుడు మృతి
➤ ఆర్.కే, అప్పికొండ, భీమిలి బీచ్‌లలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు చేసిన అధికారులు

News February 26, 2025

విశాఖ జూలో అబ్బుర పరుస్తున్న సెల్ఫీ పాయింట్స్

image

విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తెల్లటైగర్ ఎన్ క్లోజర్, జిరాఫీ ఎన్ క్లోజర్, బటర్ ఫ్లై పార్కుతో పాటు వివిధ ముఖ్యమైన ప్రదేశాల్లో వీటిని ఏర్పాట చేశారు. కలర్ ఫుల్‌గా వివిధ హంగులతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ల వద్ద సందర్శకులు, చిన్నపిల్లలు ఉత్సాహంగా సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. పాయింట్లు మరిన్ని పెంచాలని కోరుతున్నారు.

News February 26, 2025

విశాఖలో రేపు పాఠశాలలకు సెలవు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విశాఖలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచనల మేరకు సెలవు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు విధిగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.