India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖలో టీడీపీ నాయకుడు కోరాడ నాగభూషణం గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిలి మార్కెటింగ్ మాజీ ఛైర్మన్ కోరాడ నాగభూషణం ఆరిలోవ హెల్త్ సిటీలోని ఓ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం చేరారు. ఈ రోజు ఉదయం ఆస్పత్రి 4వ అంతస్తు నుంచి దూకి చనిపోయినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

విశాఖలో మరో ప్రేమోన్మాది బాలిక తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఫోర్త్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాకకు చెందిన ఇంటర్ విద్యార్థి, అక్కయ్యపాలెంకు చెందిన బాలిక ప్రేమించుకున్నారు. బాలికకు పెళ్లి సంబందాలు చూస్తున్నారని యువకుడు 7వ తేదీన ఆమె ఇంటికి వెళ్లి తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఆమె గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం రాత్రి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

మహావీర్ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు, జంతు వధ నిషేధమని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మహావీర్ జయంతి నాడు మాంసం దుకాణాలు తెరచినా, జంతు వధ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ కలెక్టర్ ఆదేశాలను లెక్కచేయకుండా మురళి నగర్‌లో యథావిధిగా మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవైందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖలో షిప్ యార్డ్‌లో సొసైటీ కార్మికుడిగా పనిచేస్తున్న అప్పారావు విద్యుత్ షాక్‌కు గురై పైనుంచి కింద పడి మృతి చెందారు. నక్కవానిపాలెం ప్రాంతానికి చెందిన పిలక అప్పారావు బుధవారం హాల్ షాప్ విభాగంలో పనిచేస్తూండగా ఈ ప్రమాదం జరిగింది. పైనుంచి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మల్కాపురం సీఐ విద్యాసాగర్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.

విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/58502) ఈనెల 14 నుంచి 22 వరకు అరకు-విశాఖ మధ్య నడుస్తుందని వాల్తేర్ DCM సందీప్ తెలిపారు. విశాఖ నుంచి బయలుదేరే కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్(18515/18516) ఈనెల 15 నుంచి 22 వరకు దంతెవాడకు తిరిగి 16 నుంచి 23 మధ్యలో విశాఖకు బయలుదేరుతుందన్నారు. డార్లిపుట్-పాడువా స్టేషన్ల పునర్నిర్మాణం, భద్రతా సంబంధిత ఆధునీకరణ పనుల కారణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో బుధవారం రెవెన్యూ వర్క్ షాప్ నిర్వహించారు. రెవెన్యూ పరమైన అన్ని అంశాలపై, ప్రభుత్వ జీవోలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆక్రమణల క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్‌లో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు.

మహావీర్ జయంతి సందర్భంగా జీవీఎంసీ పరిధిలో గురువారం మాంసం దుకాణాలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ నగర పశు నియంత్రణాధికారి డాక్టర్ ఎన్.కిషోర్ బుధవారం తెలిపారు. కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు రేపు జంతువధ, మాంస విక్రయాలు నిషేధం అన్నారు. ఈ నింబదనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/58502) ఈనెల 14 నుంచి 22 వరకు అరకు-విశాఖ మధ్య నడుస్తుందని వాల్తేర్ DCM సందీప్ తెలిపారు. విశాఖ నుంచి బయలుదేరే కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్(18515/18516) ఈనెల 15 నుంచి 22 వరకు దంతెవాడకు తిరిగి 16 నుంచి 23 మధ్యలో విశాఖకు బయలుదేరుతుందన్నారు. డార్లిపుట్-పాడువా స్టేషన్ల పునర్నిర్మాణం, భద్రతా సంబంధిత ఆధునీకరణ పనుల కారణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు.

కేజీహెచ్‌లో విశాఖ కలెక్టర్ హరేంద్రప్రసాద్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు వార్డులను సందర్శించారు. అనంతరం ఓపీ గేటు వద్ద రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రోగులకు, సహాయకులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూపరింటెండెంట్ శివానంద్‌ను ఆదేశించారు.

విశాఖలోని 13 రైతు బజార్లలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు బుధవారం నాటి కాయగూరల ధరలను విడుదల చేశారు. టమాట రూ.17, ఉల్లిపాయలు రూ.22, బంగాళదుంపలు రూ.17, వంకాయలు రూ.22/26, మిర్చి రూ.28, ఆనప రూ.12, కాలీఫ్లవర్ రూ.16, క్యాబేజీ రూ.14, దొండ రూ.22, మునగ రూ.26, అల్లం రూ.44, బరబాటి రూ.28, గోరుచిక్కుడు రూ.36, దోసకాయ రూ.22, పెన్సిల్ బీన్స్ రూ.52, పోటల్స్ రూ.58, క్యాప్సికం రూ.44 గా ధరలు నిర్ణయించారు.
Sorry, no posts matched your criteria.