India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన అమరావతిలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబును కలిసిన MLA నియోజకవర్గ సమస్యలను వివరించారు. గ్రోత్ సెంటర్లో నూతన పరిశ్రమలను ఏర్పాటు చేసి పారిశ్రామిక అభివృద్ధి చేయాలని కోరారు. తాగునీరు, సాగునీటి సమస్యలు పరిష్కరించాలని, రోడ్లు నిర్మాణానికి నిధులు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అభివృద్ధిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.
నెల్లిమర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాధికారి ప్రశాంత్ తెలిపారు. పది, ఇంటర్, M ఫార్మసీ, B ఫార్మసీ, D ఫార్మసీ, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువతీ, యువకులు అర్హులన్నారు. వీల్స్ మార్ట్, అపోలో ఫార్మసీ, టీవీఎస్, తదితర కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయని చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆరోజు ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు.
ఉమ్మడి విజయనగరం YCPలో కీలక నేతగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) VZM జడ్పీ ఛైర్మన్‌గా, జిల్లా వైసీపీ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. బొత్స రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండడంతో 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP క్లీన్ స్వీప్ చేయడంలో శ్రీనివాసే ‘కీ’రోల్ పోషించారు. అయితే ఇప్పుడు అవంతి రాజీనామా తర్వాత భీమిలి ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు. మరి అక్కడ పార్టీని ఎలా నడిపిస్తారో చూడాలి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌తో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. విశాఖ పర్యటనకు నారా లోకేష్ విచ్చేసిన సందర్బంగా విమానాశ్రయంలో మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. లోకేశ్‌ను కలిసిన వారిలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఉన్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబెడ్కర్ తన క్యాంపు కార్యాలయంలో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పలువురు క్రీడాకారులను జిల్లా కలెక్టర్ డా.అంబెడ్కర్, ఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు సత్కరించారు.కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, జిల్లా జడ్జి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి తదితరులు ఉన్నారు.
ఈనెల 27,28,29 తేదీల్లో జరిగే పార్వతీపురం జిల్లాలో జరిగే శంబర జాతరకు 130 ప్రత్యేక బస్సులు ఏర్పాటు విజయనగరం ప్రజారావాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం, ఎస్.కోట, సాలూరు డిపోలకు సంబంధించిన బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ బస్సులు గజపతినగరం, రామభద్రపురం, రాజాం, బొబ్బిలి, పార్వతీపురం రూట్లలో సర్వీస్ అందిస్తాయని పేర్కొన్నారు.
గజపతినగరం మండలం మరుపల్లి సమీపంలో హైవేపై శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న 19 పశువులను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు గజపతినగరం ఎస్ఐ కే.లక్ష్మణరావు తెలిపారు. రెండు లారీల్లో ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. చిత్ర హింసలకు గురిచేస్తూ పశువులను తరలించడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ డాక్టర్.బీఆర్ అంబేడ్కర్ విజయవాడలో శనివారం అవార్డు స్వీకరించారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా కలెక్టర్ అవార్డు స్వీకరించారు.
15వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు విజయనగరం కలెక్టరేట్‌లో శనివారం జరగనున్నాయి. ఉదయం 10-30 గంటలకు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఘనంగా జరుగుతాయని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారన్నారు.
విజయనగరం జిల్లా యువకుడు గంభీరం డ్యామ్‌లో మృతి చెందాడు. గరివిడి మండలం కందిపేటకు చెందిన మీసాల నాని విశాఖలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం ఆనందపురం మండలం గంభీరం డ్యామ్‌లో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.