Vizianagaram

News March 7, 2026

బొండపల్లి: 24గంటల్లో బాలుడికి కొత్త ఆధార్ కార్డు

image

బొండపల్లి మండలం కిండాం అగ్రహారంకి చెందిన బుంగ జోసిత్ అనే ఏడాది బాలుడు అనారోగ్యంతో విజయనగరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య ప్రయోజనాలకు ఆధార్ కార్డు ఉండాలని ఆసుపత్రి తెలపగా..తండ్రి అప్పలనాయుడు పోస్టల్ శాఖ‌ను సంప్రదించాడు. గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర తమ సిబ్బందిని ఆసుపత్రికి పంపించి 24 గంటల్లో జోసిత్‌కు కొత్త ఆధార్ కార్డును ఎన్రోల్మెంట్ చేయించారు.

News March 7, 2026

జాతీయ స్థాయి బ్యాట్మింటన్ పోటీలకు బొబ్బిలి వాసులు

image

విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాట్మింటన్ పోటీల్లో బొబ్బిలి పట్టణానికి చెందిన రమేష్ , వాసు 35
ఏళ్ల కేటగిరిలో పాల్గొని విజేతలుగా నిలిచారు. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు హాజరుకానున్నారు. వీరిని బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీనాయన శుక్రవారం సత్కరించి, అభినందించారు. బొబ్బిలికి మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు.

News March 6, 2026

చీపురుపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో డెడ్ బాడీ కలకలం

image

చీపురుపల్లి రైల్వేస్టేషన్ శివారున రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు శ్రీకాకుళం రైల్వే జీఆర్పీ మధు సూదనరావు శుక్రవారం తెలిపారు. డెడ్ బాడీ నుంచి దుర్వాసన వస్తోందని, కుళ్లే స్థితికి చేరుకుండడంతో మూడు రోజుల క్రితం ప్రమాదం జరగవచ్చన్నారు. మృతుడు గల్ల చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడని, చేతిపై ఓ పచ్చబొట్టు ఉందన్నారు. గుర్తించిన వారు జీఆర్పీ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.

News March 6, 2026

VZM: ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీ ఆవిష్కరణ

image

ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరీను విడుదల చేసి అధికారులకు అందజేశారు. ప్రభుత్వ పరిపాలనలో రోజువారీ కార్యక్రమాలు, పరిపాలన సంబంధిత అంశాలను నమోదు చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, డీఆర్‌ఓ మురళీ, తదితరులున్నారు.

News March 5, 2026

VZM: మిషన్ హార్టీ విజన్‌తో ఉద్యాన సాగు విస్తరణ

image

జిల్లాలో మిషన్ హార్టీ విజన్ అమలు ద్వారా ఉద్యాన పంటల సాగును విస్తరించి రైతులకు నిరంతర ఆదాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయాన్ని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో అదనంగా 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

News March 5, 2026

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి: VZM DMHO

image

వేసవి నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జీవన రాణి సూచించారు. విజయనగరంలోని తన కార్యాలయం ఆమె మాట్లాడారు. ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత అధికమై ప్రాణాపాయం కలగొచ్చని హెచ్చరించారు. చెమట పట్టకపోవడం, మగత, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఎండలో తిరగకూడదని, తగినంత నీరు తాగాలన్నారు.

News March 4, 2026

VZM: ‘రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి’

image

జిల్లాలో జరుగుతున్న రీ సర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సిసిఎల్ఏ జి.జయలక్ష్మితో అమరావతి నుంచి బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. రీసర్వే ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకూడదని, గడువులోగా రీసర్వేతో పాటు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

News March 4, 2026

ఈ నెల 8న ఘనంగా మహిళ దినోత్సవం: విజయనగరం కలెక్టర్

image

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్యాం సుందర్ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఆదివారం పోలీస్ బ్యారెక్స్‌లో జరిగే జిల్లా స్థాయి కార్యక్రమానికి సుమారు 3 వేల మంది మహిళలు హాజరవుతారని చెప్పారు. మహిళ పారిశ్రామిక వేత్తల సన్మానం, పథకాల స్టాల్స్, అసెట్స్ పంపిణీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

News March 4, 2026

VZM: ‘లక్ష్యం మేరకు ఉద్యాన సాగు విస్తీర్ణం సాధించాలి’

image

జిల్లాలో ఉద్యాన పంటల సాగును లక్ష్యానికి అనుగుణంగా విస్తరించాలని జిల్లా కలెక్టర్ శ్యాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. రబీ సీజన్‌లో 4,500 ఎకరాలు సాధించామని, ఖరీఫ్‌లో 6,000 ఎకరాల లక్ష్యాన్ని మించి సాధించాలని సూచించారు. రైతు సేవా కేంద్రాల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేసి, బోరు బావులు, బిందు సేద్యం సదుపాయాలు కల్పించాలని తెలిపారు.

News March 3, 2026

డెంకాడ: జనగణన-2027 తొలి దశ శిక్షణ ప్రారంభం

image

జనగణన-2027 తొలి దశ ‘గృహాల జాబితా’ శిక్షణను జిల్లా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ డెంకాడలోని చింతలవలస MVGR కాలేజీలో మంగళవారం ప్రారంభించారు. అధికారులు డిజిటల్ యాప్ ద్వారా ఖచ్చితమైన డేటా సేకరణ చేసి, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు జనగణన డేటా సేకరణపై పూర్తి అవగాహన పెంచుకొని ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు.

↑