Vizianagaram

News March 1, 2026

VZM: ఉదయాన్నే ప్రమాదం.. వ్యక్తి మృతి

image

రామభద్రపురం మండలం బూసాయవలస(ముచర్ల వలస) గ్రామ సమీపంలో సాయి కృష్ణ ఆగ్రో కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఆదివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఇతని వయసు సుమారు 65 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు.

News March 1, 2026

43 మందికి రూ.4.30 లక్షల జరిమానా: VZM SP

image

మద్యం తాగి వాహనాలు నడిపిన 43 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.4.30 లక్షల జరిమానా విధించినట్లు SP దామోదర్ శనివారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జరిమానా విధించబడిందన్నారు. గడిచిన 3 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు శిక్ష పడిందని విజయనగరం ఎస్పీ వెల్లడించారు.

News February 28, 2026

జిల్లాలో 15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో 15% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. రావివలసలో నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. 3,280 ఎకరాల్లో ఉద్యాన సాగు విస్తరణ జరిగిందని, రబీ-ఖరీఫ్‌లలో మరింత సాగు పెంపు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో భాగంగా ఫుడ్ పార్కులు, ఐటీ పార్కులు, ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం భూములు గుర్తించినట్లు వివరించారు.

News February 28, 2026

సీఎం పర్యటన విజయవంతం: VZM కలెక్టర్

image

సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఘనంగా.. విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, జేసీ సేధు మాధవన్, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, వివిధ శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ సమయంలో సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎటువంటి అసౌకర్యం లేకుండా పర్యటనను నిర్వహించామని పేర్కొన్నారు.

News February 28, 2026

రౌడీల్లారా.. రాష్ట్రాన్ని విడిచి పలాయనం చేయండి: సీఎం

image

అలర్లు, దౌర్జన్యాలు, రౌడీయిజంతో బతికేద్దామనుకున్నవారు తక్షణమే రాష్ట్రాన్ని విడిచి పారిపోవాలని సీఎం చంద్రబాబు శనివారం జరిగిన రావివలస సభలో హెచ్చరించారు. మత్తులో తప్పు చేసే గంజాయి మూకలను చిత్తు చేస్తామన్నారు. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్ అని చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. చెడు దారిలో వెళుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించి దారిలో పెడతామని స్పష్టం చేశారు.

News February 28, 2026

కాకినాడలో భారీ పేలుడు.. హుటాహుటిన బయలుదేరిన హోంమంత్రి అనిత

image

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి సుమారు 20 మంది సజీవ దహనం ఆయన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విజయనగరం జిల్లా చీపురుపల్లి పర్యటనలో ఉన్న హోంమంత్రి అనిత హుటాహుటిన ఘటనా స్థలికి పయనమయ్యారు. ఇప్పటికే అక్కడ అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు.

News February 28, 2026

వచ్చే మూడేళ్లలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాజెక్టులు పూర్తి: సీఎం

image

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని పెండింగ్‌లో ఉన్న తాగునీటి ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రావివలస ప్రజా వేదికలో ఆయన మాట్లాడారు. పోలవరం నుంచి సుజల స్రవంతి ద్వారా విశాఖకి త్వరలోనే నీరు అందిస్తామన్నారు. వంశధార, నాగావళి, చంపావతి నదులను గోదావరితో అనుసంధానం చేస్తామన్నారు.

News February 28, 2026

విజయనగరం జిల్లాను ఉద్యాన వనంగా తీర్చి దిద్దుతాం: సీఎం

image

విజయనగరం జిల్లాలో వచ్చే రెండేళ్లలో పండ్ల తోటల పెంపకానికి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మరో రెండేళ్లలో ఇది కార్యరూపం దాలుస్తుందన్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న మొక్కజొన్న వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నారు. ఇకపై భవిష్యత్తులో పండ్లతోటలకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచించారు. దీనికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందన్నారు.

News February 27, 2026

VZM: జిల్లాలో 2.69 లక్షల మందికి రూ.114.83 కోట్ల పంపిణీ

image

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద శనివారం 2,69,748 మందికి రూ.114.83 కోట్లు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని రావివలస గ్రామ సచివాలయ పరిధిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 36,903 మందికి రూ.15.80 కోట్లు, చీపురుపల్లి మండలంలో 8,431 మందికి రూ.3.56 కోట్లు, రావివలస గ్రామంలో 387 మందికి రూ.16 లక్షలు అందజేయనున్నారు.

News February 27, 2026

చీపురుపల్లి: సీఎం వస్తున్నారు.. కీలక ప్రకటన ఉంటుందా..!

image

చీపురుపల్లి(M) రావివలసలో శనివారం CM చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. దీంతో నియోజకవర్గంలో పలు సమస్యలపై సీఎం ప్రకటన చేస్తారని ప్రజలు నిరీక్షిస్తున్నారు. సుమారు 80 వేల మంది కోరుకుంటున్న RECS పునరుద్ధరణ, తోటపల్లి పిల్ల కాలువల నిర్మాణం, చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి, గరివిడి పశుసంవర్ధక కళాశాలకు అదనపు భవనాలు మంజూరు, చీపురుపల్లిలో ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తిపై హామీ కోసం ఎదురుచూస్తున్నారు.

↑