Vizianagaram

News July 30, 2024

‘జొన్నాడ టోల్ గేట్ వద్ద నేడు మహా ధర్నా’

image

విజయనగరం-విశాఖ మార్గంలో జొన్నాడ వద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మహా ధర్నా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా పౌర వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి తలపెట్టారు. గ్రామీణ ప్రాంతంలో టోల్ ప్లాజా ఏర్పాటు వలన వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారని, వేరే చోటుకి తరలించాలానే డిమాండ్ తో ధర్నా చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

News July 30, 2024

గుర్ల: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

image

భార్య అనారోగ్యానికి గురవడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుర్ల మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై భాస్కరరావు వివరాల ప్రకారం.. కెల్ల గ్రామానికి చెందిన అప్పలనాయుడు(31) భార్య లక్ష్మి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితిని చూసి తట్టుకోలేక సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

News July 30, 2024

VZM: తాగునీటి సమస్యకు టోల్ ఫ్రీ నెంబర్

image

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలను వెనువెంటనే పరిష్కరించే లక్ష్యంతో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు జేసీ కె.కార్తీక్ చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టర్ను సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆవిష్కరించారు. పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో 95023 49267 టోల్ ఫ్రీ నెంబరుతో కంట్రోల్ రూం పనిచేస్తుందని జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రాజా తెలిపారు.

News July 29, 2024

విజయనగరంలో ఆగస్టు 1న జాబ్‌మేళా

image

విజ‌య‌న‌గ‌రం ప్రభుత్వ ఐటీఐలో వివిధ కంపెనీల్లో ఉద్యోగాల భ‌ర్తీకి ఆగస్టు 1న జాబ్‌మేళా నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా ఉపాధి క‌ల్ప‌నాధికారి డి.అరుణ తెలిపారు. అమర్ రాజా బ్యాటరీస్‌లో మిషన్ ఆపరేటర్ (250), అప్రంటీస్ ట్రైనీ(250), ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకులో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ (60) ఉద్యోగాల భ‌ర్తీ జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, ఉత్తీర్ణులైన‌వారు హాజరు కావాలని కోరారు.

News July 29, 2024

పార్వతీపురం: తలలేని దూడ జననం

image

పార్వతీపురం మండలం పులిగుమ్మిలో తలలేని లేగదూడ జన్మించినట్లు పశు వైద్యాధికారి డాక్టర్ భోగి చక్రధర్ తెలిపారు. పాడి రైతు లక్ష్మనాయుడుకు చెందిన వాడి పశువుకు ఈ దూడ జన్మించినట్లు వెల్లడించారు. పుట్టిన వెంటనే చనిపోయినట్లు పేర్కొన్నారు. ఫలదీకరణ జరిగినప్పుడు జన్యుపరమైన రుగ్మతల కారణంగా ఇటువంటి జననాలకు సంభవిస్తాయన్నారు.

News July 29, 2024

పార్వతీపురం: మైనార్టీలకు టెట్, డీఎస్సీకి ఉచిత శిక్షణ

image

మైనార్టీ అభ్యర్థులకు టెట్, డీఎస్సీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందజేయడానికి చర్యలు చేపట్టామని మైనారిటీ సంక్షేమ శాఖ డీడీ సత్యనారాయణ రాజు తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్ అభ్యర్థులకు ఈ శిక్షణ అందజేసేలా ప్రభుత్వం ఆదేశించిందన్నారు. విశాఖలోని ఆర్.సి.ఈ.డి.ఎం. సిరిపురంలో శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టమన్నారు. మరిన్ని వివరాలకు 90523 42344 సంప్రదించాలన్నారు.

News July 29, 2024

బొత్సకు మంత్రి కొండపల్లి కౌంటర్

image

నెల్లిమర్లలో ఇటీవల మాజీ సైనికుడి ఇంటి గోడను అధికారులు కూల్చివేయడంపై మాజీ మంత్రి బొత్స విమర్శించారు. రాజకీయ కక్షతోనే కూల్చారని ఆరోపించారు. దీనికి స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి బొత్సకు సిగ్గులేదా అంటూ మంత్రి కొండపల్లి అన్నారు.ఈ ఆక్రమణకు సంబంధించి గత ప్రభుత్వంలోనే నోటీసులిచ్చారని గుర్తు చేశారు. ప్రజా వేదికలను కూల్చినప్పుడు మాట్లాడని వారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

News July 29, 2024

విజయనగరం: గంజాయిపై ఉక్కుపాదం

image

విజయనరగం జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపనున్నట్లు అధికారులు వెల్లడించారు. గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముఠాలను అదుపులోకి తీసుకుంటున్నామని తెలిపారు. దీనిపై ఎలాంటి సమాచారం ఉన్నా టాస్క్ ఫోర్స్ సీఐ 9121109416 నంబరును సంప్రదించాలని తెలిపారు.

News July 29, 2024

విజయనగరం: అతిథులొచ్చేశాయ్..!

image

విజయనగరం అయ్యకోనేరు చెరువులో సైబీరియన్‌ పక్షులు కనువిందు చేశాయి. వీటిని నగర వాసులు అతిథులుగా భావిస్తారు. ఏటా వర్షాకాలంలో ఈ పక్షులు తమ ప్రాంతానికి వస్తూ సందడి చేస్తాయని స్థానికులు చెబుతున్నారు. వీటి సంరక్షణ కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అతిథులు మనుగడ కోల్పోకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

News July 29, 2024

ఒలింపిక్స్ క్రీడాకారులకు అశోక్ గజపతిరాజు శుభాకాంక్షలు

image

ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇండియా క్రీడాకారులకు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒలింపిక్‌ క్రీడాకారులకు మద్దతుగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తీసుకొచ్చిన చీర్‌ ఫర్‌ భారత్‌ సెల్ఫీపాయింట్‌ను ఆదివారం స్థానిక అశోక్‌ బంగ్లా కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్‌లో భారత్‌ క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.