India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య ఎంపిక ప్రక్రియ మంగళవారం సజావుగా జరిగింది. మొత్తం 652 మంది అభ్యర్థులు PMT, PET పరీక్షలకు హాజరయ్యారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వీరిలో 448 మంది తుది రాత పరీక్షకు ఎంపికయ్యారన్నారు. గడిచిన 15 రోజులుగా జరుగుతున్న ఎంపిక ప్రక్రియలో ఇప్పటి వరకు 3,745 మంది పురుష అభ్యర్థులు, 479 మంది మహిళ అభ్యర్థినులు రాత పరీక్షకు ఎంపికయ్యారన్నారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆమె స్థానిక పోలీస్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఆరు మాసాల పసిబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడికి ఐదు నెలల్లో శిక్ష పడేలా చర్యలు చేపట్టినందుకు ఎస్పీని అభినందించారు. గంజాయి నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.
గుంతలు లేని రహదారుల కార్యక్రమం కింద జిల్లాలో 80 శాతం రహదారులను పూర్తి చేసామని జిల్లా ఇన్‌ఛార్జ్ మినిస్టర్ అనిత అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈ నెలాఖరికి 100% రహదారులు పూర్తి చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత NREGS కింద రాష్ట్రంలో వందల కోట్లతో పనులు చేపట్టామన్నారు. రెవెన్యూ సిబ్బంది ఎవరికీ కొమ్ము కాయకుండా పనిచేయాలన్నారు.
శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనిత<<15209881>> కౌంటర్<<>> ఇచ్చారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రామతీర్థం ఘటనలో నిందితుడికి, సాక్షులకు తేడా మాజీ మంత్రికి తెలియడం లేదన్నారు. ఘటనలో సాక్షిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామని స్పష్టం చేశారు. తప్పు చేయని వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు.
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, రెవెన్యూ, డ్వామా కార్యక్రమాలపై ఆమె సమీక్ష జరిపారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, MP కలిశెట్టి అప్పలనాయుడు, MLA లు కిమిడి కళా వెంకట్రావు, కొండ్రు మురళీ మోహన్, కోళ్ల లలితకుమారి, లోకం నాగమాధవి, తదితరులు పాల్గొన్నారు.
పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో కెమ్ కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శృంగవరపుకోట మండలం సన్యాసయ్య పాలెం గ్రామానికి చెందిన బర్ల సత్యవతమ్మ (85) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిందని ఎస్.కోట సీఐ సూర్యనారాయణ తెలిపారు. ఈ నెల 16వ తేదీన గుడికి వెళ్లి పూజ చేస్తున్న సమయంలో దీపం తగిలి చీరకు నిప్పు అంటుకొని తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
రామతీర్థం బోడికొండపై కోదండ రాముని విగ్రహ ధ్వంసం కేసులో A2 నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 5లక్షలు ఎలా ఇస్తారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఆ ఘటనలో నష్టం జరిగిందని బాధితుడికి ప్రజల సొమ్ము ఇవ్వడమేమిటన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఘటనపై దర్యాప్తు చేయాలన్నారు.
విజయనగరం జిల్లా ఇన్ ఛార్జి మంత్రి వంగలపూడి అనిత నేడు జిల్లాకు వస్తున్నట్టు కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహిస్తారన్నారు. గుంతలు లేని రహదారుల కార్యక్రమం ప్రగతి, ఉపాధిహామీ, పంచాయతీరాజ్, రెవిన్యూ సదస్సులు తదితర అంశాలపై మంత్రి సమీక్షిస్తారని పేర్కొన్నారు.
బొండపల్లి మండలం బిల్లలవలస డయేరియా కేసుల నమోదు ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరా తీశారు. కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. జిల్లా వైద్యాధికారులను వెంటనే అప్రమత్తం చెయ్యాలని సూచించారు. గ్రామాన్ని సందర్శించి, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. డయేరియా ప్రబలడానికి కారణాలు తెలుసుకొని, గ్రామంలో ఇకపై వ్యాధి విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.