Vizianagaram

News September 1, 2024

VZM: చెరువులో పడి.. వృద్ధురాలి మృతి

image

ప్రమాదవశాత్తు వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బొండపల్లి SI మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎం.కొత్తవలస గ్రామానికి చెందిన కంది అప్పలనరసమ్మ (75) ఆగస్టు 30 రాత్రి నుంచి కనిపించలేదని, 31వ తేదీన పెన్షన్ కూడా అందుకోలేదని అన్నారు. గ్రామ పరిధిలో గల బాడి చెరువులో అప్పలనరసమ్మ మృతదేహం తేలింది, మనవడు శ్రీనివాసరావు తెలపడంతో పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేశారు.

News September 1, 2024

పలు ముఖ్యమైన రైళ్లను రద్దు చేసిన అధికారులు

image

వర్షాల వల్ల పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. ఆదివారం బయలుదేరాల్సిన విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ సికింద్రాబాద్ గరీబ్ రథ్, విశాఖ లోకమాన్య తిలక్, విశాఖ మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్, మహబూబ్ నగర్ విశాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్ కోస్ట్, సికింద్రాబాద్-హౌరా ఫలక్ నామాను రద్దు చేశారు.

News September 1, 2024

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రద్దు

image

విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ఆదివారం రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్ పరిధిలో రాయనపాడు రైల్వే స్టేషన్‌లో వరద నీరు ప్రవహిస్తున్న కారణంగా ఈ ట్రైన్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News September 1, 2024

అంత కురిసినా.. జిల్లాలో సాధారణ వర్షపాతమే..!

image

విజయనగరం కన్నా పార్వతీపురం జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదైంది. మన్యంలో ఆగస్టు 29న 25.4 మి.మీ. కురవగా, 30న 6.8 మి.మీ వాన కురిసింది. విజయనగరం జిల్లాలో 29న 33.7 మి.మీ నమోదు కాగా, 30న 13.6 మి.మీ వాన కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా ఎల్.కోట మండ 37.2 మి.మీ వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లాలో ఆగస్టు 30 వరకు సాధారణ వర్షపాతం 181 మి.మీ కాగా, శనివారం 157 మి.మీ వర్షపాతం నమోదయింది.

News September 1, 2024

సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుకు అవకాశం

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం నుంచి ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో విద్యను అభ్యసించేందుకు ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు కేంద్రం డైరెక్టర్ ఆచార్య ఎస్ విజయమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News September 1, 2024

VZM: తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..

image

జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌న్న వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు మేర‌కు జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ఈ నేప‌థ్యంలో కంట్రోల్ రూమ్‌ల‌ను ఏర్పాటు చేశారు. క‌లెక్ట‌రేట్ కంట్రోల్ రూమ్ 08922 236947, విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ కంట్రోల్ రూమ్ 08922 276888, బొబ్బిలి డివిజ‌న్ కంట్రోల్ రూమ్ 9390440932, చీపురుప‌ల్లి కంట్రోల్ రూమ్ 7382286268 నంబర్లను కేటాయించామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.

News September 1, 2024

‘భోగాపురం ఎయిర్‌పోర్టుకు మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌ వేగ‌వంతం’

image

భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి మౌలిక వ‌స‌తులను క‌ల్పించే ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ ఆదేశించారు. విమానాశ్ర‌యానికి వ‌స‌తుల క‌ల్ప‌న‌, భూ సేకరణ తదితర అంశాలపై తన ఛాంబర్‌లో శనివారం సమీక్షించారు. ఎయిర్‌పోర్టుకు నీటిని అందించేందుకు సుమారు రూ.20కోట్ల‌తో చేప‌ట్టిన ప‌నుల‌పై ఆరా తీశారు. ఈ ప‌నుల‌ను వీలైనంత వేగంగా పూర్తి చేయాల‌న్నారు.

News August 31, 2024

VZM: విద్యుత్ ప్రమాదాల పట్ల కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ ఉపకరణాలు పట్ల జాగ్రత్తగా ఉండాలని, తడిసిన విద్యుత్ స్తంభాలు, తెగి పడిన విద్యుత్ తీగలను నేరుగా తాకరాదని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు గుర్తిస్తే కంట్రోల్ రూమ్ నంబర్‌ 949061012 అందుబాటులో ఉంటుందన్నారు.

News August 31, 2024

పార్వతీపురం: జిల్లాలోని స్కూళ్లకు సోమవారం సెలవు

image

ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా సోమవారం పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు పనిచేస్తాయని ఆయన చెప్పారు. వర్షాల కారణంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టామని కలెక్టర్ పేర్కొన్నారు.

News August 31, 2024

VZM:భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ నంబర్‌

image

జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈక్రమంలో ఈ జాగ్రత్తలు పాటిద్దాం
➤ ఫోన్లకు ఛార్జింగ్ ఫుల్ గా పెట్టుకోండి
➤ కూలిపోయే స్థితిలో ఉండే గోడలు, స్తంభాల దగ్గర ఉండకండి
➤ వర్షం పడే సమయంలో చెట్ల దగ్గరకు వెళ్లకండి
➤ తడిగా ఉండే స్తంభాలను పట్టుకోకండి
➤ నదులు, కాలువలు ఎట్టి పరిస్థితుల్లో దాటకండి
➤ విజయనగరం కంట్రోల్ రూమ్ నెం.08922 236947, మన్యం జిల్లా 08963 293046