India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పదో తరగతి పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయనగరం జిల్లాలో మొత్తం 23,765 మంది విద్యార్థులు 119 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. 1150 మంది ఇన్విజిలేటర్లు, 9మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 36 మంది కస్టోడియన్లు, 238 మంది డిపార్టమెంట్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష జరగనుండగా.. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవచ్చు.
ALL THE BEST
APSSDC ఆధ్వర్యంలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక మహారాజ అటానమస్ కాలేజీలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందన్నారు. మిరాకిల్ సాప్ట్‌వేర్ సిస్టంలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, బీకాం, BBA, MBA, MCA, MSC, BCA చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. >Share It
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై పర్యవేక్షణ చేసే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నియమించిన ప్రత్యేక అధికారి అహ్మద్ బాబు శనివారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు జిల్లాకు చేరుకొని స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. 10.30 గంటలకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారని చెప్పారు.
విజయనగరం జిల్లాలో నూతనంగా ఏర్పడిన శక్తి టీమ్స్ పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, ముఖ్య కూడళ్లు, కళాశాలలను శుక్రవారం సందర్శించారు. మహిళలు, విద్యార్థినులకు శక్తి మొబైల్ యాప్ పట్ల విస్తృతంగా అవగాహన కల్పించారు. మఫ్టీలో వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, యాప్ పనితీరు పట్ల అవగాహన కల్పించారు. మహిళలతో యాప్ డౌన్‌లోడ్ చేయించారు.
మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి మొబైల్ యాప్‌ను ప్రతి మహిళ తన మొబైల్ ఫోనులో డౌన్‌లోడ్ చేసుకోవాలని విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఫోనులో శక్తి యాప్ నిక్షిప్తమై ఉంటే ఆపద సమయాల్లో పోలీసులు సహాయాన్ని సులువుగా పొందవచ్చునన్నారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయాల్లో శక్తి యాప్ రక్షణగా నిలుస్తుందన్నారు.
విజయనగరం జిల్లాలో అర్హులైన రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం రూ.2.5కోట్లు సబ్సిడీ ఇవ్వనుందని జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు చెప్పారు. గురువారం తెర్లాం వచ్చిన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. స్ప్రింక్లర్లు, పవర్ స్ప్రింక్లర్లు, రోటోవీటర్లు, ట్రాక్టర్ పరికరాలు 50 శాతం రాయితీపై అందజేయనున్నారు. రైతులు వ్యవసాయ అధికారులు ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.
విజయనగరం డిపో నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు 5వ తేదీ సాయంత్రం 4:30 కి బయలుదేరి 6వ తేదీ ఉదయం 5 గంటలకు భద్రాచలం చేరుకుని, అదే రోజు సాయంత్రం 5 గంటలకు భద్రాచలంలో బయలుదేరి 7వ తేదీన ఉదయం 5:30 గంటలకి విజయనగరం చేరుతాయన్నారు.
విజయనగరం డిపో నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు 5వ తేదీ సాయంత్రం 4:30 కి బయలుదేరి 6వ తేదీ ఉదయం 5 గంటలకు భద్రాచలం చేరుకుని, అదే రోజు సాయంత్రం 5 గంటలకు భద్రాచలంలో బయలుదేరి 7వ తేదీన ఉదయం 5:30 గంటలకి విజయనగరం చేరుతాయన్నారు.
నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రకటించిన అదనపు ఆర్ధిక సహాయంతో జిల్లాలో 15,226 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. 12,240 మంది బీసీలకు, 2,231 మంది ఎస్సీలకు ఒక్కో ఇంటికి రూ.50 వేలు, 565 మంది షెడ్యూల్డు తెగల వారికి రూ.75 వేలు, 190 మంది ఆదిమ తెగలకు రూ.లక్ష చొప్పున సహాయం అందనుంది.
జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి పరిధిలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని డీసీహెచ్ఎస్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తులను జిల్లా సర్వజన ఆసుపత్రిలోని కార్యాలయానికి అందజేయాలన్నారు. పూర్తి వివరాలు https://www.ap.gov.in వెబ్‌సైట్‌లో కలవు.
Sorry, no posts matched your criteria.