India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పందేలు జరగకుండా చూసేందుకు మండల స్థాయి సంయుక్త తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తూ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. తహశీల్దార్, ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, జంతు సంక్షేమ కమిటీ సభ్యులతో కూడిన ఈ బృందాలు ఆయా మండలంలో కోడి పందేలు జరగకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టవలసి ఉంటుంది. ఆయా మండలంలో ప్రజలకు ఈ బృందాలు కోడి పందేలు జరగకుండా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
నెల్లిమర్ల మండలం టెక్కలిలో ఉన్న ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో శనివారం డ్రోన్ తయారీ యూనిట్‌ను కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రోన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులను సాంకేతికంగా అభివృద్ధి చేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
సంక్రాంతి కోసం సొంత ఊర్లకు పట్టణాల నుంచి ప్రజలు బయలుదేరి వెళ్తున్నారు. ఈ మేరకు ప్రెవేట్ బస్ ఛార్జీలు విమాన ధరలతో పోటీ పడుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. శని, ఆదివారాలు వీకెండ్, వరుసగా సంక్రాంతి సెలవులు కావడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో విజయనగరం, బొబ్బిలి, రాజాం, గజపతినగరం పట్టణాలకు వచ్చేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి టికెట్ ధరలు రూ.4 వేల నుంచి 5 వేల వరకు ఉన్నాయన్నారు.
వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులకు పెంచడమే తప్పు అన్నట్లు చంద్రబాబు మాట్లాడటం ఆయన చేతకానితనానికి నిదర్శనమని బొత్స మండిపడ్డారు. ‘గతంలో రెండు రోజులే వైకుంఠ దర్శనం ఉండేది. మా ప్రభుత్వంలో 10 రోజులకు పెంచాం. అప్పటి మా సీఎం జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. గాయపడిన వారిని పరామర్శించడానికి జగన్ వెళ్తే అడ్డుకోవడం ఏంటి. ఇంత కన్నా దారుణం ఎక్కడుంటుంది’ అని బొత్స ప్రశ్నించారు.
విజయనగరం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే జరుగుతున్న విషయం తెలిసిందే. పండగ నేపథ్యంలో ఈనెల 13న(సోమవారం) జరగాల్సిన గ్రీవెన్స్ డేను రద్దు చేశామని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి ఆ రోజు ఎవరూ విజయనగరానికి రావద్దని సూచించారు.
విజయనగరం జిల్లాలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం పర్యటించనున్నారు. జిల్లాలో ఉన్న ఓ యూనివర్శిటీలో డ్రోన్ల తయారీ యూనిట్‌ను శనివారం ఉదయం 11 గంటలకు రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు.
జిల్లాలో మంజూరైన ఉపాధి హామీ పనులకు రూ.23 కోట్ల బిల్లులను అధికారులు ఇప్పటివరకు అప్‌లోడ్ చేశారు. రూ.45 కోట్ల విలువైన 866 పనులు జిల్లాలో ఇప్పటివరకు పూర్తి అయ్యాయి. కేవలం రూ. 23 కోట్ల బిల్లులను మాత్రమే అప్లోడ్ చేయడంతో పూర్తి అయిన పనులకు కూడా వెంటనే బిల్లులు అప్‌లోడ్ చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై MLC బొత్స సత్యనారాయణ విశాఖలో శుక్రవారం మాట్లాడారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కేసు విచారణ చేపట్టాలని కోరారు. భక్తులు చనిపోవడం దైవ నిర్ణయం అంటూ TTD ఛైర్మన్ బీఆర్.నాయుడు స్పందించిన తీరు తనను బాధించిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగిరావని, ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలన్నారు.
యూట్యూబర్ <<15118839>>భార్గవ్<<>> (ఫన్ బకెట్ ఫేమ్)కు 20ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈయనది విజయనగరం జిల్లా కొత్తవలస. చెల్లి అంటూనే విశాఖకు చెందిన 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు 2021లో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దిశ చట్టం కింద భార్గవ్‌ను అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణలో నేరం రుజువు కావడంతో విశాఖ పోక్సో కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఉత్తరాంధ్ర ప్రేక్షకులకు స్పెషల్ అనుభూతిని పంచింది. రామ్ చరణ్ విశాఖ కలెక్టర్‌గా.. బ్రహ్మానందం విజయనగరం కలెక్టర్‌గా పనిచేశారు. విశాఖ యూనివర్సిటీ పేరుతో ఉన్న భవనంలో పలు ఫైట్ సీన్లు ఉన్నాయి. షూటింగ్ టైంలో పబ్లిక్ మీటింగ్ కోసం R.K బీచ్‌లో పెద్ద సెట్ వేశారు. బీచ్ రోడ్డు NTR బొమ్మ దగ్గర సాంగ్ షూట్ చేశారు. కొన్ని క్యారెక్టర్ల పేర్లు కూడా మన ఉత్తరాంధ్ర యాసలోనే ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.