India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ నెల 19న జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయా మండలాల తహశీల్దార్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నుంచే జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. దీంతో రైతులు తమ పంటకు నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వాతావరణ కేంద్రం జిల్లాకు వచ్చే మూడు రోజుల్లో భారీవర్షాల హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మండల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులను క్షేత్ర స్థాయి సిబ్బంది అప్రమత్తం చేశారు. వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే గ్రామాల్లో ఇప్పటికే వరి పంట కోతలు పూర్తిచేసి కుప్పలుగా వేసిన ధాన్యం నూర్చవద్దని సూచిస్తున్నారు.
మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా ప్రజలకు మరింత చేరువ చేసేందుకుగాను ప్రత్యేకంగా రూపొందించిన ‘సంకల్పం’ గీతాన్ని, పోస్టర్లును జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తన కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. పట్టణానికి చెందిన కాకర్ల గాంధీ మాష్టర్ రచన, స్వర కల్పన, గానం చేసి, సంగీతాన్ని అందించి, ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని ఇకపై సంకల్పం ప్రచార కార్యక్రమంలో ఉపయోగిస్తామన్నారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ నెల 19న జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయా మండలాల తహశీల్దార్లను ఆదేశించారు. రైతులకు తమ వరి పంటకు నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. షెడ్యూల్డ్ కులాల వారీగా వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాస్థితిగతులపై ఆరా తీశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఎస్‌సీల్లో ఉప కులాల వారీగా వెంటనే వివరాలను అందజేయాలని కోరారు.
భార్య గర్భవతి అని తెలిసి ఆర్మీ జవాన్ అయిన భర్త ఎంతో సంతోషించాడు. సెలవుల నిమిత్తం ఇంటికొచ్చిన ఈశ్వరరావు భార్యను టెస్ట్‌ల కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. భార్య కళ్ల ఎదుటే జవాన్ మృతి చెందాడు. భార్య వినూత్నకు తీవ్ర గాయాలయ్యాయి. మెరకముడిదాం మండలం భీమవరం దంపతులు (ఈశ్వరరావు& వినూత్న) గరివిడి మండలం కాపు శంబాం జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
బొబ్బిలి కూరగాయాల బజారులో క్యాబేజీ ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. 60 కేజీల క్యాబేజీ బస్తా కేవలం రూ.300 పలికింది. 10 నుంచి 12 పువ్వులు ఉన్న బాస్కెట్ రూ.60 మాత్రమే పలకడంతో విస్తుపోవడం రైతులు వంతైంది. గతేడాది ఒక క్యాబేజీ కనీసం రూ.10 నుంచి రూ.15 ధర లభించింది. ప్రస్తుత ధరలతో ఎకరాకు రూ.40 నుంచి రూ.60 వేల వరకు నష్టం వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని 2020లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విశాఖ జిల్లా పద్మనాభం మండలం పొట్నూరుకి చెందిన అప్పలనాయుడుకు 20ఏళ్ల కఠిన కారాగార శిక్షను కోర్టు విధించిందని SP వకుల్ జిందాల్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మెంటాడకు చెందిన బాలికను ప్రేమ పేరిట శారీరకంగా అనుభవించి మోసం చేశాడనే ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైందన్నారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడిందని చెప్పారు.
సౌత్ సెంట్రల్ రైల్వే కేంద్రం విజయవాడ డివిజన్‌లో భద్రత కారణాల దృష్ట్యా రైలు నంబర్ 13351 దన్‌బాద్- అలెప్పీ బొకోరో ఎక్స్‌ప్రెస్ దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజనల్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ తెలిపారు. ఈ నెల 16,17,20,21,23,24 తేదీల వరకు ఈ మళ్లింపు ఉంటుందని ప్రయాణికులు గమనించాలని కోరారు.
వచ్చే ఏడాది మార్చి 17 వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతి నాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పరీక్షలు ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు టైం టేబుల్‌ను విద్యార్థులకు తెలియజేయాలని కోరారు. విద్యార్థులకు ఇప్పటి నుంచే పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.