Vizianagaram

News July 4, 2024

VZM: రేపు పలు రైళ్లు రద్దు చేసిన రైల్వే అధికారులు

image

పలాస-విజయనగరం డివిజన్ పరిధిలో భర్త భద్రతాపరమైన పనులు కారణంగా రేపు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డిసిఎం కే సందీప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 07471 పలాస-విశాఖ, 07470 విశాఖ -పలాస, 08522 విశాఖ – గునుపూర్, 08521 గునుపూర్ – విశాఖ, 08504 విశాఖ – భవానీపట్నం, 08532 విశాఖ – బ్రహ్మపుర ప్యాసింజర్ ట్రైన్ లు, 22820 విశాఖ – భువనేశ్వర్ ఇంటర్ సిటీ రైలు రద్దు చేసినట్లు తెలిపారు.

News July 4, 2024

నేడు మంత్రుల సబ్ కమిటీ సమావేశం

image

రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు మంత్రుల సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోంమంత్రి అనిత అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన ఈ సబ్ కమిటీలో రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంధ్ర, సత్యకుమార్ యాదవ్, గుమ్మిడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు. ఈ సబ్ కమిటీ తొలి సమావేశం 4వ తేదీ గురువారం రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో ఉదయం 11.00 గంటల నుంచి జరుగనుంది.

News July 4, 2024

VZM: నేడు కలెక్టరేట్‌లో అల్లూరి జయంతి

image

నేడు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు అల్లూరి సీతారామ రాజు జయంతిని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ తెలిపారు. జిల్లా అధికారులు, సిబ్బంది ఈ వేడుకలకు హాజరు కావాలని ఆదేశించారు. అన్ని జిల్లా, డివిజినల్, మండల, గ్రామ స్థాయి కార్యాలయాల్లో అల్లూరి జయంతి వేడుకలను నిర్వహించాలని సర్కులర్ జారీ చేశారు.

News July 3, 2024

VZM: పోక్సో కేసులో నిందితులకు జైలు శిక్ష

image

బాలికను అపహరించి.. అసభ్యంగా ప్రవర్తించినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో స్థానిక దిశ పోలీస్ స్టేషన్‌లో 2021లో పోక్సో కేసు నమోదయ్యింది. ఈ కేసులోని నిందితులకు కోర్టు జైలు శిక్ష విధించిందని దిశ సీఐ నాగేశ్వరరావు తెలిపారు. నిందితులుగా ఉన్న పూసపాటిరేగ మం. తిప్పలవలసకు చెందిన రాగితి.సత్తయ్య(A1)కు రూ.2,500 జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష, వాసుపల్లి కన్నయ్య(A2)కు రూ.500 జరిమానా, ఏడాది శిక్ష ఖరారైందని చెప్పారు.

News July 3, 2024

ఈనెల 6న శ్రీకాకుళం జిల్లాకు విజయనగరం ఎంపీ

image

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈనెల 6న శనివారం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు. ఇటీవల ఢిల్లీలో కలిశెట్టి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శ్రీకాకుళం మొదటిసారి వెళ్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యకర్త నుంచి కలిశెట్టి ఎంపీగా అత్యధిక మెజారిటితో గెలిచిన విషయం తెలిసిందే.

News July 3, 2024

ఏయూ పరిధిలో గురువారం జరగాల్సిన పరీక్షలు వాయిదా: టీ. చిట్టిబాబు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 4వ తేదీన జరగాల్సిన రెండో, నాల్గో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ టీ. చిట్టిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ విద్యార్థి సంఘాలు 4వ తేదీన బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. గురువారం జరగాల్సిన పరీక్షలు మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

News July 3, 2024

VZM: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఆహ్వానం

image

జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2024 సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారి ప్రేమ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో కనీసం 10 సంవత్సరముల సేవ పూర్తిచేసిన వారు అర్హులు. ఈ నెల 15వ తేదీలోగా వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలను teacher.education.gov.in వెబ్ సైట్‌‌ ద్వారా పొందవచ్చు

News July 3, 2024

పూరి రథయాత్రకు ప్రత్యేక రైళ్లు

image

పూరి జగన్నాధుడి రథయాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యానికి అన్‌రిజర్వుడ్ ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే సందీప్ తెలిపారు. విశాఖ-పూరి(08347) ప్రత్యేక రైలు ఈనెల 6,14,16 తేదీల్లో మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖలో బయలుదేరి అదే రోజు రాత్రికి పూరి చేరుకుంటుందని పేర్కొన్నారు. తిరిగి పూరి-విశాఖ(08348) రైలు 8,16,18 తేదీల్లో తెల్లవారుజామున 1.45 గంటలకు పూరిలో బయలుదేరుతుందని తెలిపారు.

News July 3, 2024

VZM: ఓపెన్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

image

సార్వత్రిక విద్యాపీఠం పదోతరగతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో విజయనగరం జిల్లా రాష్ట్రంలో వరుసగా 15, 16వ స్థానాల్లో నిలిచింది. పదో తరగతిలో 543 మందికి 369, ఇంటర్‌లో 658కి 411 మంది పాసైనట్లు డీఈవో ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసేందుకు సబ్జెక్టుకు రూ.200, రీవెరిఫికేషన్‌కు రూ.1000 (సబ్జెక్టుకు) చొప్పున ఈనెల 13వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

News July 3, 2024

VZM: బాలుడి ముక్కు కొరికేసిన కుక్కలు

image

బాడంగి మండలం గొల్లాదిలో వీధి కుక్కలు దాడిలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.లోకేశ్ ఇంటి నుంచి మంగళవారం బయటకు వెళ్లగా కుక్కలు దాడి చేసి ముక్కు కొరికేశాయి. చెంప, చేతి భాగంలో కూడా గాయాలయ్యాయి. సాయంత్రం చింతాడ లక్ష్మిపై కూడా దాడి చేశాయి. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు స్పందించి కుక్కలు బెడద నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.