Vizianagaram

News July 3, 2024

విజయనగరం: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

AU పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ నెల 4,6 తేదీలలో డా.వీఎస్ కృష్ణ కళాశాలలో స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 10 వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని.. 11 తేదీ నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 19న సీట్ల కేటాయించి..22 లోపు క్లాసులు ప్రారంభిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. AU పరిధిలో మొత్తం 163 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.

News July 3, 2024

జిల్లాలో కాన్సర్ బాధితుల కోసం కలెక్టర్‌కు వినతి

image

జిల్లాలో కాన్సర్ బాధితులకు ఎటువంటి వైద్య సహాయం అందించట్లేదని కాన్సర్ ఆసుపత్రి సాధన కమిటీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అంబేడ్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మన్యం జిల్లాకు కూడా కలిపి విజయనగరంలో కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసే ఏర్పాట్లు చేయాలని కోరారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కీమోథెరపీ లాంటి చికిత్సలు అందించేలా కృషి చేయాలన్నారు.

News July 2, 2024

BREAKING: పార్వతీపురం జిల్లాకు కొత్త కలెక్టర్ నియామకం

image

పార్వతీపురం మన్యం జిల్లాకు నూతన కలెక్టర్‌గా ఏ.శ్యామ్ ప్రసాద్‌ను నియమించారు. ఈయన పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. రాష్ట్రంలో పలువురు కలెక్టర్ల బదిలీల్లో భాగంగా మన్యం జిల్లాకు ఈయన రానున్నారు. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేస్తున్న నిశాంత్ కుమార్ బదిలీపై వెళ్లారు.

News July 2, 2024

తాటిపూడి సాగు నీటిని విడుదల చేసిన మంత్రి

image

రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సేర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాటిపూడి రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు. మూడు మండలాల్లోని 11 కాలువల ద్వారా 15,365 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. రిజర్వాయర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసి, శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

News July 2, 2024

విజయనగరం సంగీత కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

image

విజయనగరం మహరాజా సంగీత, నృత్య కళాశాలలో నాలుగేళ్ల సర్టిఫికెట్ కోర్సు, రెండేళ్ల డిప్లమో కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ K.A.V.L.N శాస్త్రి తెలిపారు. 01.07.2023 నాటికి 10 సంవత్సరాల వయసు నిండిన వారు అర్హులని, 60 ఏళ్ల లోపు వారూ చేరవచ్చన్నారు. ఈ రెండు కోర్సులకు ప్రవేశ రుసుములుగా రూ.1600, రూ.2100 చొప్పున నిర్ణయించామన్నారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు.

News July 2, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో టెట్‌కు పెరగనున్న పోటీ

image

ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు పోటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ మేరకు జిల్లాకు 583 పోస్టులు మంజూరయ్యాయి. డీఎస్సీ‌కు టెట్‌లో వచ్చే మార్కులు వెయిటేజీ ఉండడంతో ఒక్క మార్క్ అయినా కలుస్తుందనే ఆశతో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2022 డీఎస్సీ ప్రకటనలో 16,079 మంది టెట్ పరీక్ష రాయగా, 2024 ఫిబ్రవరి ప్రకటనలో 10,429 మంది పరీక్షలు రాశారు.

News July 2, 2024

విజయనగరం జిల్లాలో 36 మందికి మెమోలు జారీ

image

సమయపాలన పాటించని అధికారులపై కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్క‌ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సంబంధిత అధికారులు ఉదయం 9:45 గం.కే రావాలని ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో చాలా మంది 10 గంటల తరువాత రావడంతో కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేస్తూ 10:05 గంటలకు ఆడిటోరియం తలుపులు మూయించారు. 36 మందికి మెమోలు జారీ చేసినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి.

News July 2, 2024

ప్రజలు ఛీ కొట్టినా జ్ఞానోదయం కలగలేదు: గంటా

image

వైసీపీ ప్రభుత్వ పాలన వద్దని ప్రజలు ఛీకొట్టినా ఆ పార్టీ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగకపోవడం విచారకరమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై గంటా స్పందించారు. వైసీపీకి చెందిన వారిని వీసీలుగా నియమించుకుని జగన్ రెడ్డి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే ఆరోపించారు.

News July 2, 2024

విజయనగరం డీసీసీబీ సీఈఓగా బాధ్యతలు

image

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన సీఈఓగా సీ.హెచ్. ఉమా మహేశ్వరరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును ఆయన ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ప్రజలకు సెంట్రల్‌ బ్యాంక్‌ ద్వారా మెరుగైన సేవలు అందించాలని జెడ్పీ ఛైర్మన్ ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

News July 2, 2024

పార్వతీపురం: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలకు దరఖాస్తులు

image

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జి.పగడాలమ్మ అన్నారు. జిల్లాలో ఆసక్తిగల ఉపాధ్యాయులు http://nationalawardstoteacher.education.gov.in లింకులో నామినేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ నెల 27 నుంచి ఆగస్టు 15వరకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత గల ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.