India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ ఉపకులపతిగా ఈసీఈ విభాగం సీనియర్ ఆచార్యులు జి.శశిభూషణరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆచార్య శశిభూషణరావు ఏయూ పాలకమండలి సభ్యునిగా పనిచేశారు. రక్షణ రంగ సంబంధ పరిశోధనలో శశిభూషణ్ రావు నిష్ణాతులు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ శ్రేణులపై దాడులు పెరిగిపోయాయని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. పాలన చేయమని మంచి మెజార్టీ ఇస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వినుకొండలో జరిగిన హత్యతోపాటు, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీపై దాడులకు తెగబడడం సరికాదన్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహచలం గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20,21 తేదీలలో జరుగుతున్న గిరిప్రదక్షిణకు హాజరవుతున్న ప్రయాణికులకు APSRTC విజయనగరం డిపో నుంచి సింహచలం వరకు 40 ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి సీట్‌ల కేటాయింపు మొదలైంది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు జిల్లాల్లో సింహభాగం ప్రైవేటు, అన్ఎయిడెడ్ విద్యాలయాల్లో కనిష్ఠంగా రూ.40 వేలు ఖరారు చేశారు. గతేడాదిలో ఈ మొత్తం రూ.43వేలు ఉండేది. ఈ ఏడాది రూ.3 వేల వరకు తగ్గింది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో టమాటా ధర జనాలను ఠారెత్తిస్తోంది. ప్రస్తుత బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా రూ.80 వరకు పలుకుతోంది. వారం రోజుల వరకు రూ.40 ధర ఉండేది. స్థానికంగా టమాటా పంట లేకపోవడంతో ఇతర ప్రదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు రవాణా ఛార్జీల భారం పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ధరల నియంత్రణ పై చర్య చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకొని ఈనెల 20,21 తేదీల్లో సింహాచలంలో జరిగే సుప్రభాత సేవ, ఆరాధన, నిత్య కళ్యాణం, అష్టోత్తరం, సహస్రనామార్చన వంటి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు. ఈ తేదీలలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి తరలి రానున్న నేపథ్యంలో నీలాద్రి ద్వారం నుంచి మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పట్టణ, పల్లె ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వసతిగృహాల నుంచి బాధితులు అధికంగా ఆసుపత్రుల బాటపడుతున్నారు. పాచిపెంట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, సీతంపేట, పార్వతీపురం, మక్కువ, తదితర ప్రాంతాలలో జ్వర వ్యాప్తి ఎక్కువగా ఉంది. పార్వతీపురం జిల్లాలో 20 మంది చిన్నారులు మలేరియా, వైరల్ టైఫాయిడ్‌తో ఆసుపత్రిలో చేరారు.
విజయనగరం జిల్లాలోని సీడీపీవో విభాగంలో 23 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయింది. ఆ ఉద్యోగాలు ఇప్పిస్తామని రాజ్ కుమార్ అనే వ్యక్తి మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులను డబ్బులు అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఐసీడీఎస్ పీఓ బి.శాంత కుమారి తెలిపారు. అటువంటి వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
గుర్ల మండలం పున్నపురెడ్డిపేటకి చెందిన పున్నపురెడ్డి కనక నాయుడు అనే వ్యక్తి తేలు కాటుకు గురై మృతి చెందాడు. పొలంలో పని చేస్తుండగా తేలు కరిచిందని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు గంటల తరువాత చికిత్స పొందుతూ చనిపోయాడని గ్రామస్థులు తెలిపారు. ఇదిలా ఉంటే సంవత్సరం క్రితం అదే పొలంలో మృతుడి చిన్న కూతురు ఏదో విషపురుగు కరిచి చనిపోయింది. ఇప్పుడు మరొకరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఏయూ పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును జులై 25వ తేదీ వరకు పొడిగించారు. స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై 23 నుంచి 25 వరకు జరుగుతాయి. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్ నమోదు జులై 26 నుంచి 29 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ మార్చుకోవడానికి జులై 30న అవకాశం ఇచ్చారు. ఆగష్టు 3న సీట్ల కేటాయింపు ఉంటుంది.
Sorry, no posts matched your criteria.