India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రభుత్వ సేవల్లో ప్రజల నుంచి శతశాతం సానుకూల స్పందన రావాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ సేవలు, ప్రజా స్పందనపై గురువారం చర్చించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. వసతిగృహాల్లో సేవలపై ప్రజా స్పందన తక్కువగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ వార్డెన్లకు మెమోలు జారీ చేయాలని సూచించారు.

పూర్వోదయ పథకం ద్వారా జిల్లాలో నాలుగు కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులను రూ.1300 కోట్లతో పూర్తి చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. తోటపల్లి ద్వారా ప్రస్తుతం 58వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా, మిగిలిన భూములకు కూడా నీరు అందేలా పనులు పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించిదన్నారు.

ఉపాధి హామీ పథకం విషయంలో బొత్స సత్యనారాయణ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని బొత్స చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రస్తుతం వేతనదారులకు డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని, ఆరోపణలు చేయడమే తప్ప జిల్లాకు మీ వల్ల జరిగిన మేలేమిటో చెప్పాలన్నారు.

విజయనగరంలో బుధవారం జరిగిన వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం విమానాశ్రయం పూర్తి క్రెడిట్ జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. జగన్ హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయని, మెజారిటీ భూ నిర్వాసితులు వైసీపి సానుభూతిపరులేనని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు ఈ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర తేదీలు ఖరారయ్యాయి. జాతర వివరాలు..
➱ఫిబ్రవరి 22న (ఆదివారం) జాతర ప్రారంభం
➱23న (సోమవారం) పసుపు, కుంకుమ ముర్రాటలతో మొక్కుబడులు చెల్లింపులు
➱24న మంగళవారం రాత్రి గుడిలోకి ఘటాలు రావడంతో జాతర ముగుస్తుంది.
వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆపదలో ఉన్నామని చెప్పి ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసే కొత్త తరహా మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ప్రయాణంలో బ్యాగులు పోయాయని, మహిళలు, పిల్లల పేరుతో సహాయం కోరుతూ ఫోన్‌పే, గూగుల్‌పే స్కానర్లు పంపి మోసం చేస్తున్నారని ఆయన బుధవారం తెలిపారు. ఇలాంటి కాల్స్ వస్తే డబ్బులు పంపేముందు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని, అనుమానం ఉంటే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని జిల్లా ప్రజలకు సూచించారు.

రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని, కానీ ప్రజలకు అవసరమైనది విదేశీ దావోస్ సమావేశాలు కాదని, సామాన్యుల కష్టాలు తీరే పాలన కావాలని YCP నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద ఆర్గనైజ్డ్‌గా దొంగ మస్టర్లు వేసి రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా నాశనమవుతోందని, ప్రజల మీద, ప్రజా ప్రతినిధుల మీద పోలీసుల అరాచకమా అని ప్రశ్నించారు.

రాజాం పోలిపల్లి అమ్మవారి జాతర ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది.
➱ఫిబ్రవరి 20న (శుక్రవారం) అమ్మవారి నేత్రోత్సవం
➱22న (ఆదివారం) జాతర ప్రారంభం
➱23న (సోమవారం) పసుపు, కుంకుమ, ముర్రాటలతో మొక్కులు చెల్లిస్తారు
➱24న (మంగళవారం) రాత్రి గుడిలోకి ఘటాలు రావడంతో జాతర ముగుస్తుంది.
చివరి రోజున వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ కమిటీ అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.

జిల్లాలో రబీ సీజన్‌లో ఉద్యాన సాగు లక్ష్యాన్ని మించి పెరిగిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. లక్ష్యంగా పెట్టుకున్న 4,000 ఎకరాలకు బదులుగా 4,800 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని చెప్పారు. ఖరీఫ్‌లో మరో 6,000 ఎకరాల్లో ఉద్యాన సాగుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

చీపురుపల్లి, రాజాం నియోజకవర్గాల్లో కొత్తగా రెండు MSME పార్కుల ఏర్పాటుకు వెంటనే స్థలాలు గుర్తించి భూసేకరణ ప్రారంభించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. భోగాపురం విమానాశ్రయం, జాతీయ రహదారి, రైల్వే విస్తరణ, ఫుడ్ పార్కులు, పరిశ్రమల విస్తరణపై సమీక్షించారు.
Sorry, no posts matched your criteria.