India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం సీతంపేటలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీతంపేట ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలు సమర్పించవచ్చని ఆయన చెప్పారు. స్థానిక ప్రజలు గిరిజనులు అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
విజయనగరంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 18 నుంచి 21 వరకు జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, ఎంపిక పోటీలు జరుగుతాయని అసోసియేషన్ ఛైర్మన్ ఇందుకూరి రఘు రాజు తెలిపారు.అసోసియేషన్ సీఈవో పి. శ్రీరాములుతో కలిసి మాట్లాడారు.ఈ నెల 18న అండర్-11,13,19న అండర్-15, 17 బాలబాలికలు,20న అండర్-19, స్త్రీ, పురుషులకు,21న వెటరన్ స్త్రీ, పురుషులకు పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 15 లోపు వివరాలు అందించాలన్నారు.
అగ్నిపథ్‌లో భాగంగా అగ్నివీర్-వాయు సేనలో ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అవివాహిత పురుష,మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ సీఈవో రాంగోపాల్ తెలిపారు.ఇంజినీరింగ్‌లో మూడు సంవత్సరాలు చదివిన వారు,రెండు సంవత్సరాల ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన వారు కూడా అర్హులని చెప్పారు.ఈనెల 28 వరకు అవకాశం ఉందని అన్నారు. https://agni- pathavaya.cdac.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలన్నారు.
పరీక్షల్లో తప్పినా పాస్ చేయించాక ఉద్యోగం ఇప్పిస్తామని ఓ ముఠా రూ. 12 లక్షలు కొల్లగొట్టిన ఘటన బొబ్బిలిలో జరిగింది. విద్యార్థి రాజాంలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివాడు. కొన్ని సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. మే రెండో వారంలో ముఠా అతని తండ్రికి ఫోన్ చేసి పాస్ చేసి, ఉద్యోగం ఇప్పిస్తామని వసూలు చేశారు. ఫలితాలు వెలువడడం ,మళ్లీ ఫెయిలవడంతో మోసపోయానని గ్రహించారు. దీనిపై శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు.
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ జడ్పీటీసీ సభ్యురాలు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ‘మీ పాలన మీ తాతగారిని గుర్తుచేస్తోంది’ అని మంత్రిని ఉద్దేశించి ఆమె అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ప్రజా ప్రతినిధిని ఆయన గౌరవించే వారని గుర్తు చేశారు. మంత్రి స్పందిస్తూ ‘తాతగారి బాటలో మీ అందరి సహకారంతో పనిచేస్తాం’ అని మాట ఇస్తున్నానన్నారు.
కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల దాడులపై పెట్టినంత దృష్టి రాష్ట్ర ప్రజల మాన, ప్రాణాలపై పెట్టకపోవడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నంద్యాలలో బాలికపై ముగ్గురు మైనర్ అబ్బాయిలు అత్యాచారం చేసి హత్య చేస్తే కూటమి సర్కార్ స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇది ప్రజా స్వామ్యమా? రౌడీ రాజ్యమా? అంటూ వ్యాఖ్యానించారు.
NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి జిల్లా పరిషత్ సమావేశానికి ప్రజా ప్రతినిధులు గైర్హాజరయ్యారు. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు, ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన, రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ ఈ సమావేశాలకు హాజరు కాలేదు.
బాడంగి మండలంలోని బొత్సవానివలస గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ గొట్టాపు శంకర్రావు(41) కశ్మీర్‌లోని లద్దాక్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలి గురువారం మృతి చెందిన సంగతి తెలిసిందే. సైనిక లాంఛనాలతో బొత్సవానివలసలో శంకర్రావు అంత్యక్రియలను శనివారం నిర్వహిస్తామని జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్ సత్య ప్రసాద్ తెలిపారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా వరుణుడి కరుణ కోసం అన్నదాతలు ఎదురు చూపులు చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నప్పటికీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో సాగుకు సిద్దమైన అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తోటపల్లి కాలువల్లో నీరు లేకపోవడంతో అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి.
జొన్నాడ టోల్‌గేట్ ఎత్తివేయాలని గత కొద్ది రోజులుగా జిల్లాలో నిరసనలు చేస్తున్న సంగతి తెలిసందే. ఈ తరుణంలో అగనంపూడి టోల్‌గేట్ ఎత్తేసిన విషయాన్ని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ టోల్‌గేట్ ఎత్తేశారు. జొన్నాడ టోల్‌గేట్ వలన ఇటీవల ఆర్టీసీ కూడా టికెట్ రేట్లు పెంచడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.