Vizianagaram

News June 30, 2024

నా మొదటి నెల జీతం దానికే: విజయనగరం ఎంపీ

image

అన్ని అలవెన్సులతో తనకు వచ్చే మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు అందజేస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ఆయన.. స్వామి సన్నిధిలో ప్రకటించారు. ఆంధ్రుడిగా బాధ్యతతో రాష్ట్ర రాజధాని అభివృద్ధికి తన వంతుగా మొదటి జీతాన్ని అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

News June 30, 2024

ఐటీ రంగం విస్తరణకు కృషి: ఎమ్మెల్యే లోకం మాధవి

image

ఉత్తరాంధ్రలో ఐటీ రంగం విస్తరించడానికి కృషి చేస్తానని, తద్వారా ఐటీ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు అందే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. విశాఖపట్నంలో శనివారం రాత్రి జరిగిన ITAAP (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఐటీ రంగం విస్తరణకు అవసరమైన వనరులపై ఈ సందర్భంగా చర్చించారు.

News June 30, 2024

VZM: జిల్లాలో 295 మందికి చలానాలు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను ఆదివారం వెల్లడించారు. ఎంవీ నిబంధనలు అతిక్రమించిన 295 మందిపై రూ.57,065 ఈ-చలానాలు విధించామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 11 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 22 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయన్నారు.

News June 30, 2024

VZM: పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామానికి చెందిన నక్కెళ్ల గోపి(40) పురుగుమందు తాగి చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతను వేడుకలకు వంటలు చేస్తూ జీవించేవాడు. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. శరీరంపై పలుచోట్ల ఉన్న గాయాలు ఇంకా బాధిస్తుండడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గోపి పురుగుమందు తాగాడు. మృతుడికి భార్య శ్రీదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News June 30, 2024

విశాఖ: రైల్వే స్టేషన్‌లో 21 కిలోల గంజాయి స్వాధీనం

image

విశాఖ రైల్వే స్టేషన్‌లో జీఆర్‌పీ పోలీసులు శనివారం 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం కొరాపుట్ ప్రాంతానికి చెందిన శివ పాత్రో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అతని వద్ద తనిఖీ చేయగా 21 కిలోల గంజాయి లభించింది. దీనిని విశాఖ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు నిందితుడు వెల్లడించినట్లు జీఆర్‌పీ ఏఎస్ఐ మనోహర్ తెలిపారు.

News June 30, 2024

మౌలిక వసతుల కల్పన కు ప్రతిపాదనలివ్వండి: నిశాంత్ కుమార్

image

ప్రజలకు అత్యంత ప్రాధాన్యతైలైన మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన సమగ్ర ప్రతిపాదనలను అందజేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వానికి సామాజిక బాధ్యతగా సహకారం అందించేందుకు ఎన్‌పీసీఐఎల్ భాగస్వామ్యంతో ప్రజలకు అత్యంత మేలు జరిగే మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ముందుకు వచ్చిందన్నారు. జిల్లా పరిధిలోని ఆయా ప్రాధాన్యతలను గుర్తించి వెంటనే ప్రతిపాదనలను పంపించాలన్నారు.

News June 29, 2024

VZM: ఉమ్మడి జిల్లాలో 1863 కేసుల పరిష్కారం

image

రాజీయే రాజమార్గం అనే నినాదంతో ఉమ్మడి జిల్లాలో వివిధ కోర్టుల పరిధిలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 1863 కేసులకు పరిష్కారం లభించింది. విజయనగరం(1136), పార్వతీపురం(138), బొబ్బిలి(160), సాలూరు(151), ఎస్ కోట(65), గజపతినగరం(91), చీపురుపల్లి(50), కొత్తవలస(53), కురుపాం(19ల)లో కేసుల చొప్పున పరిష్కరించారు. ఈ ఒక్క రోజే సుమారు రూ.15 కోట్ల మొత్తాన్ని కక్షిదారులకు చెల్లించారు.

News June 29, 2024

విశాఖపట్నంలో బొబ్బిలి వాసి దుర్మరణం

image

బొబ్బిలి పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ బాబు కుమారుడు హేమంత్ విశాఖలో జరిగిన ఓ ప్రమాదంలో శనివారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. విశాఖలోని పీఎం పాలెంలో నాలుగు అంతస్తుల భవనం పై ఏసీ బిగిస్తుండగా.. ప్రమాదవశాత్తు జారిపడి హేమంత్ మృతిచెందాడు. దీంతో బొబ్బిలిలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

News June 29, 2024

VZM: పదవీ విరమణ పొందిన సిబ్బందికి ఎస్పీ సన్మానం

image

జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పని చేసి పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ దీపిక పాటిల్ శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో వారు చేసిన సేవలను కొనియాడారు. విధిలో చేసిన సేవలే అందరికి గుర్తింపునిస్తాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సేవలందించారని, ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని అన్నారు.

News June 29, 2024

VZM: పదవీ విరమణ పొందిన సిబ్బందికి ఎస్పీ సన్మానం

image

జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పని చేసి పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ దీపిక పాటిల్ శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో వారు చేసిన సేవలను కొనియాడారు. విధిలో చేసిన సేవలే అందరికి గుర్తింపునిస్తాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సేవలందించారని, ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని అన్నారు.