Vizianagaram

News January 4, 2026

VZM: ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై మంత్రి సమీక్ష

image

విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువల నిర్మాణం, భూసేకరణ తదితర అంశాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆయకట్టు, కాలువల భూసేకరణ, సాంకేతిక అలైన్‌మెంట్, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విడతలవారీగా భూసేకరణ చేపట్టడం వంటి అంశాలను సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

News January 3, 2026

రేపే భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్

image

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గగన విహార ముహూర్తం ఖరారైంది. ఆదివారం ట్రయల్ రన్‌గా ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా తొలి విమానం భోగాపురంలో ల్యాండ్ కానుంది. ఆ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రానున్నారు. ట్రయల్ రన్ విజయవంతమైతే మే నెల నుంచే సాధారణ విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టనున్నారు.

News January 3, 2026

బొండపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

image

బొండపల్లి మండలం, మరువాడ గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం పాల్గొన్నారు. రైతుల భూ హక్కులు స్పష్టంగా నమోదై, భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఉండేలా ఈ విధానం రూపకల్పన చేశామన్నారు. క్యూ ఆర్ కోడ్ కలిగిన ఆధునిక పాస్ పుస్తకాలు ప్రభుత్వ రాజముద్రతో అందిస్తున్నామని చెప్పారు.కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.

News January 3, 2026

VZM: కేజీబీవీ నోటిఫికేషన్.. జిల్లాలో ఖాళీల వివరాలు

image

AP KGBV ఔట్‌సోర్సింగ్‌లో 1095 పోస్టులకు <>నోటిఫికేషన్‌<<>> విడుదల చేసింది. ఇందులో విజయనగరం (D)కు టైప్-3లో వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్-10, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్-12, ANM-7, అటెండెర్-3, హెడ్ కుక్-1, ASST కుక్-2, వాచ్ ఉమెన్-1 ఉండగా.. టైప్-4లో వార్డెన్-4, పార్ట్ టైమ్ టీచర్-7, చౌకిదార్-5, హెడ్ కుక్-3 ASST కుక్-8 ఉన్నాయి. 18 ఏళ్లు పైబడిన మహిళలు మాత్రమే అర్హులు. ఈనెల 11లోపు APC ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి.

News January 3, 2026

బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష: VZM SP

image

బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి కోర్టు కఠిన కారాగార శిక్షను విధించినట్లు SP దామోదర్ శుక్రవారం తెలిపారు. బాడంగి (M)కి చెందిన V.వెంకటరమణ అదే ప్రాంతానికి చెందిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో 2024 డిసెంబర్‌లో పోక్సో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

News January 3, 2026

గరుడుబిల్లిలో పాఠశాలలను తనిఖీ చేసిన : DEO

image

బొండపల్లి మండలం గరుడబిల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదోవ తరగతి విద్యార్థులకు అమలు పరుస్తున్న 100 రోజుల ప్రణాళిక నిర్వహణ, విద్యార్థి ప్రతిభ పరిశీలన చేసి ప్రతి విద్యార్థి సైనింగ్ స్టార్‌గా మార్చేందుకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.