India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో జిల్లాలోనే గణపవరం మండలం కొనసాగుతుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ఆదివారం గణపవరం మండలానికి చెందిన వివిధ వ్యాపార సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు భీమవరంలోని కేంద్రమంత్రి నివాసం వద్ద వర్మను కలిసి మాట్లాడారు. ఈ మేరకు వారందరికీ ఆయన హామీ ఇచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మండలాన్ని వేరే జిల్లాలోకి మారుస్తారనే ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు.
భీమవరం కలెక్టరేట్‌లో ఆదివారం కలెక్టర్, పీస్ కమిటీ చైర్మన్ అధ్యక్షతన శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాకు ప్రశాంతమైన జిల్లాగా పేరు ఉందని, ఇకముందు కూడా ఇదే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. పండుగ పర్వదినాలను కుల, మతాలకు అతీతంగా స్నేహభావంతో అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని కోరారు.
లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన మల్టీమెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లను మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు.
రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో శనివారం వివిధ శాఖాల అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రీ సర్వే, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, పిజిఆర్ఎస్ ఫిర్యాదులు, రైస్ కార్డులు, క్యాస్ట్ వెరిఫికేషన్, కోర్టు కేసులు అంశాలపై జిల్లాలోని ఆర్డీవోలు, తహశీల్దారులు మండల సర్వేలతో సమీక్షించారు.
తల్లి మరణిస్తే ఆ కుటుంబం అంతా ఎంతో ఇబ్బందులకు గురవుతుందని, జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా వైద్యులు అత్యంత అప్రమత్తతో చికిత్సలను అందజేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో వైద్య సిబ్బందితో జరిగిన సమీక్షలో మాట్లాడారు. కాగా.. జిల్లాలో ఈ ఏడాది జూలై నెలాఖరు వరకు ఆసుపత్రులలో రెండు మాతృ మరణాలు, నాలుగు శిశుమరణాలు నమోదయ్యాయి.
భీమవరం: కలెక్టరేట్లో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో “పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ వెర్షన్ 2.0 పై ఒక్కరోజు వర్క్ షాప్ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. జిల్లా సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనకు సంబంధిత శాఖలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. సుస్థిర అభివృద్ధి అనేది మానవ, సామాజిక, ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉందన్నారు.
ప్రముఖ సినీ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, మెగాస్టార్ చిరంజీవి అత్తగారు అల్లు కనకరత్నం (94) శనివారం ఉదయం వయోభారంతో కన్నుమూశారు. ఈ వార్త పాలకొల్లులో విషాద ఛాయలు నింపింది. అల్లు రామలింగయ్య స్వగ్రామం పాలకొల్లు కావడంతో ఇక్కడ ఉన్న బంధువులు, అభిమానులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
జిల్లాలోని ఇసుక నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక, వాటి విలువ వివరాలను కలెక్టర్ తెలిపారు. ఆచంటలో 20,020 మెట్రిక్ టన్నులు, టన్ను ఇసుక ధర రూ.444, భీమవరంలో 6,193 ఇసుక ఉండగా, రూ.581, నరసాపురంలో 2,403 ఇసుక ఉండగా రూ.581, పాలకొల్లులో 19,505 ఇసుక ఉండగా, రూ.556, తాడేపల్లిగూడెంలో 35,180 ఇసుక ఉండగా రూ.456, తణుకులో 7,878 ఇసుక ఉండగా, రూ.306, ఉండిలో 28,923 ఇసుక ఉండగా, రూ.550 చొప్పున అందుబాటులో ఉన్నాయి.
జిల్లాలో ఏర్పాటు చేసిన 7 ఇసుక నిల్వ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ఇసుకను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని వర్చువల్ గా నిర్వహించి, జిల్లాలో ఇసుక నిలువలపై సమీక్షించారు. జిల్లాలో ఇసుక కొరత లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయం చేసుకుని నిల్వలను అందుబాటులో ఉంచాలన్నారు.
రోడ్డు భద్రతకు అధికారులు ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు చేపట్టి, ప్రమాదాలు నివారణకు గట్టిగా కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జనవరి నుంచి జులై వరకు 124 ఘోర ప్రమాదాలు (స్పాట్ డెడ్), 106 తీవ్ర క్షతగాత్రుల ప్రమాదాలు జరగగా మొత్తం 129 మరణాలు సంభవించాయన్నారు. గత ఏడాది 130 ఘోర ప్రమాదాలు జరిగాయన్నారు.
Sorry, no posts matched your criteria.