India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈఓ నారాయణ తెలిపారు. బుధవారం నిర్వహించిన హిందీ పరీక్షకు మొత్తం 22,858 మంది విద్యార్థులకు గాను 22,505 మంది హాజరుకాగా, 353 మంది గైర్హాజరయ్యారని వివరించారు. అలాగే ఓపెన్ స్కూల్ ఆంగ్ల పరీక్షకు 253 మందికి 215 మంది హాజరయ్యారని, 38 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

భీమవరం ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారు ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని వారు వివరించారు. దివ్యాంగులకు సముచిత స్థానం కల్పించాలనే సదుద్దేశంతోనే ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వారు పేర్కొన్నారు.

నరసాపురం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై బుధవారం గుర్తు తెలియని ఓ వ్యక్తి (45) మృతి చెందారు. రైలు ఎక్కేందుకు వచ్చిన ఆయన అస్వస్థతతో అక్కడికక్కడే కన్నుమూశారు. మృతుని వివరాలు తెలియరాలేదు. ఆచూకీ తెలిసిన వారు భీమవరం జీఆర్‌పీ ఎస్సై సుబ్రహ్మణ్యంను 9908448729 నంబరులో సంప్రదించాలని పోలీసులు కోరారు. ప్రస్తుతం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

పాలకొల్లుకు చెందిన ముత్యాల అశ్విని (33) తన కుమారుడు విజయ్‌తో కలిసి పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. 2001లో ఆరో తరగతితోనే చదువు ఆపేసి చిన్న వయసులో వివాహం చేసుకున్న ఆమె.. ఇన్నాళ్లకు కుమారుల చొరవతో మళ్లీ పుస్తకం పట్టారు. చదువు విలువ తెలుసుకొని ప్రైవేటుగా పరీక్షలు రాస్తున్న ఈ తల్లి పట్టుదలను స్థానికులు అభినందిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చదువుకోవాలనే వారి ఆశయం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.

నరసాపురం రుస్తుంబాదకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు కొప్పినీడి విజయ మోహన్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. మంగళవారం ఈ ప్రకటన వెలువడగా, ఆయన ప్రస్తుతం పాలకొల్లు మండలం గవరపేట సచివాలయంలో విలేజ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా సేవలు అందిస్తూనే, చిత్రకళలో విజయాలు సాధిస్తున్న ఆయనను తోటి ఉద్యోగులు, స్థానికులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యలపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ లు ఉత్తమ ఫలితాలు నిస్తున్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ..29 డిసెంబర్, 2025న రెవెన్యూ క్లినిక్‌లు ప్రారంభం నాటి నుంచి మార్చి 16, 2026 వరకు 10 విడతలుగా రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొత్తం 461 దరఖాస్తులు అందగా 148 పరిష్కరించామన్నారు.

Sorry, no posts matched your criteria.