WestGodavari

News March 23, 2026

ప.గో జిల్లా వాప్తంగా సోమవారం పీజీఆర్ఎస్

image

భీమవరం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు స్వయంగా వచ్చి అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అధికారులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.

News March 22, 2026

పశ్చిమ గోదావరికి రెడ్ అలర్ట్

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వాతావరణ శాఖ ఆదివారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.

News March 22, 2026

పశ్చిమ గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్

image

కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవతో పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.30 కోట్లతో “మీ ఇంటికి – మీ డాక్టర్” సేవలు ప్రారంభం కానున్నాయి. సోమవారం నాడు నరసాపురం మండలంలోని 18 గ్రామాల్లో ఈ మొబైల్ మెడికల్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఈ వ్యాన్‌లో డాక్టర్లు, నర్సుల బృందం నేరుగా గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. రెడ్ క్రాస్ సేవల విస్తరణలో భాగంగా మన జిల్లా ఈ ప్రాజెక్టుకు ఎంపికైంది.

News March 22, 2026

ప.గో: తినీ తినక కిస్తీలు కడుతున్నాం.. మా ఇళ్లు మాకు ఇవ్వండి!

image

సొంతింటి కల నెరవేరుతుందని ఏళ్లుగా ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు నిరాశే మిగులుతోంది. దసరా, సంక్రాంతి, ఉగాది అంటూ గడువు పొడిగిస్తున్నారే తప్ప ఇళ్లను అప్పగించడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు బ్యాంకులకు ఈఎంఐలు చెల్లిస్తూ, మరోవైపు అద్దె ఇళ్ల భారం మోయలేక తిని తినక కాలం వెళ్లదీస్తున్నామని వాపోతున్నారు. తక్షణమే ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News March 21, 2026

తరిగొప్పుల రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని యువకుడి మృతి

image

కృష్ణా జిల్లా తరిగొప్పుల రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ వద్ద గుర్తుతెలియని యువకుడు(సుమారు 25-30 ఏళ్లు) రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిసిన వారు వెంటనే గుడివాడ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భీమవరం రైల్వే జీఆర్‌పీ సుబ్రహ్మణ్యం కోరారు. మృతుని ఆచూకీ తెలిస్తే 92475 85713, 99890 29379 ఫోన్ నంబర్లను సంప్రదించాలని విన్నవించారు.

News March 21, 2026

ఏళ్లు గడుస్తున్నా అందని టిడ్కో ఇళ్లు.. లబ్ధిదారుల కంటతడి!

image

సొంతింటి కల నెరవేరుతుందని ఏళ్లుగా ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు నిరాశే మిగులుతోంది. దసరా, సంక్రాంతి, ఉగాది అంటూ గడువు పొడిగిస్తున్నారే తప్ప ఇళ్లను అప్పగించడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు బ్యాంకులకు ఈఎంఐలు చెల్లిస్తూ, మరోవైపు అద్దె ఇళ్ల భారం మోయలేక తిని తినక కాలం వెళ్లదీస్తున్నామని వాపోతున్నారు. తక్షణమే ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News March 21, 2026

ప.గో: అలర్ట్.. దరఖాస్తుల ఆహ్వానం

image

ప.గో జిల్లాలో పర్యాటక రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో టూరిజంపై మాట్లాడిన ఆమె, టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగలవారు ceo-apta@ap.gov.in మెయిల్ ఐడీకి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 21, 2026

పశ్చిమలో ఆసక్తికర చర్చ..!

image

2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో మహిళల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ, టీడీపీ పార్టీలు మహిళలకు అవకాశం కల్పించలేదు. మహిళా బిల్లు అమలులోకి వస్తే జిల్లాలో మహిళలకు ఎన్ని సీట్లు దక్కుతాయి, ఏయే స్థానాలను వారికి రిజర్వ్ చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.