India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో వారు టీడీపీలో చేరారు. కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు.
పేరుపాలెం బీచ్‌లో ఓ యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. వివరాలు.. భీమవరం పట్టణం మెంటేవారితోటకు చెందిన రాజు, రత్న దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రభు చరణ్ బర్త్‌డే సందర్భంగా తమ్ముడు ప్రవీణ్ కుమార్, స్నేహితులతో కలిసి బీచ్ వెళ్లారు. ఈ క్రమంలో బీచ్‌లో స్నానం చేస్తుండగా ప్రవీణ్ గల్లంతయ్యాడు. అంతకు ముందు గణేశ్ ఉత్సవాల్లోనూ పాల్గొన్నాడని అంతలోనే ఇలా అయిందని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన మేకా శేషుబాబుని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఏ మేరకు పార్టీ అధిష్ఠానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు పార్టీ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఏలూరు రేంజ్ పరిధిలోని వివిధ జిల్లాల ఎస్పీలతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు బుధవారం ఏలూరులో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గంజాయి నిర్మూలనకు 100 రోజులు ప్రణాళిక రూపొందించామన్నారు. గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రజలకు, చిన్న పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. పోలీసుల పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు.
వైసీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ముదునూరి ప్రసాద్ రాజును నియమిస్తూ ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆయన గతంలో నరసాపురం ఎమ్మెల్యేగా, మాజీ చీఫ్ విప్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
తాడేపల్లి పరిధిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించారు. సమావేశంలో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలోని ఓ పాపకు డెంగీ, మలేరియా ఇన్ఫెక్షన్ కవాసకి అనే డిసీస్ వచ్చింది. చికిత్స నిమిత్తం సుమారు రూ.6లక్షలు ఖర్చు అవుతోందని వైద్యులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు ఆర్థిక స్థోమత లేకపోవడంతో పలువురు సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి ధైర్యంగా ఉండమ్మా! పాప ఆరోగ్యం మెరుగుపడేందుకు వైద్య చికిత్సకు సాయం అందిస్తామని లోకేశ్ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారంపై మాట్లాడారు. అదేవిధంగా వివిధ శాఖలకు చెందిన మంత్రులు, అధికారులు, ఈ మంత్రి మండలి సమావేశంలో పాల్గొన్నారు.
చెల్లించకుండా పెండింగ్ లో ఉన్న నీరు చెట్టు బిల్లుల విడుదలకు సంబంధించి మంగళవారం సీఎం చంద్రబాబుతో మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ కలిసి చర్చించారు. చర్చల అనంతరం దశల వారీగా నీరు చెట్టు బిల్లులను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలోని ఎన్‌ఎల్‌ఎస్ ఏరియా పరిధిలోని పొగాకు ధర రికార్డు బద్దలు కొట్టింది. మంగళవారం జంగారెడ్డిగూడెం-1, జంగారెడ్డిగూడెం-2, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో అత్యధికంగా రూ.408 నమోదయ్యింది. దేవరపల్లి వేలం కేంద్రంలో రూ.400, గోపాలపురంలో రూ.399 ధర పలికింది. మొత్తం ఐదు వేలం కేంద్రాల్లో 6,669 బేళ్లు రైతులు అమ్మకానికి తీసుకురాగా, వీటిలో 4,444 బేళ్లు అమ్ముడైనట్లు రైతులు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.