India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పురపాలక సంఘ పరిధిలోని 9,088 మంది పింఛన్ దారులు ఫిబ్రవరి 1న వారి వారి ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు సూచించారు. గురువారం సాయంత్రం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పింఛన్లకు సంబంధించి రూ.3.97 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. 35 వార్డు సచివాలయాల పరిధిలో 239 మంది సచివాలయ కార్యదర్శులు పింఛన్లు పంపిణీ చేస్తారన్నారు. లబ్ధిదారులు ఇంటి వద్దనే ఉండాలన్నారు.
భీమవరంలో చోరీకి పాల్పడిన వ్యక్తికి 105 రోజుల జైలు శిక్ష పడింది. ఎస్సై తెలిపిన వివరాలు.. భీమవరానికి చెందిన సతీశ్ కుమార్ కిళ్లీ షాపులో దొంగతనం చేశాడు. పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా.. సెకండ్ ఏజేఎఫ్ సీఎం న్యాయవాది 105 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పినట్లు తెలిపారు.
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు, 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ, 27న ఉదయం 8.నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవులు, పేరును ఇప్పటికే ప్రకటించారు.
ఇంటర్ ప్రాక్టికల్, పబ్లిక్ పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టరేట్ డిఆర్ఓ ఛాంబర్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, పబ్లిక్ పరీక్షలు నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్, మార్చి1 నుంచి మార్చి 20 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫేక్ ఆర్డర్లతో డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ద్వారకా తిరుమల ఎస్సై టి. సుధీర్ వివరాలు.. రామన్నగూడెం వాసులు నాగమల్లేశ్వరరావు, నాగార్జునలను జి. కొత్తపల్లి వాసి బజారయ్య సివిల్ సప్లైలో ఉద్యాగాలు ఇప్పిస్తానని మోసం చేశాడు. 2023లో జరిగిన ఈ ఘటనలో ఒక్కొరి వద్ద రూ. 2.50 లక్షలు తీసుకున్నాడు. దీంతో 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించామన్నారు.
తాడేపల్లిగూడెం పట్టణం 17వ వార్డుకు చెందిన అంగన్వాడీ టీచర్ గౌరీ పార్వతి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డును కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఐదుగురు ఎంపిక కాగా వారిలో గౌరీ పార్వతి ఒకరు కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమెను మంగళవారం ఐసీడీఎస్ సీడీపీవో టీఎల్. సరస్వతి, సెక్టార్ సూపర్వైజర్ సీహెచ్ దుర్గ భవాని సిబ్బంది అభినందించారు.
భీమవరం కలెక్టరేట్లో స్థాయి గర్భస్థపూర్వక, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష కమిటీ, జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం డీఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు ఆధర్వంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో గర్భిణులకు స్కానింగ్ చేసే సమయంలో పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ చేయడం, పరీక్ల చట్టం 1994, రూల్స్ 1996 ప్రకారం జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
ఈనెల 31న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుగొండలో పర్యటించనున్నారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జెసి రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. పెనుగొండ నగరేశ్వర, మహిషాసురమర్దిని శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి అమ్మ వారి దేవస్థానంలో జరిగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు.
ప.గో జిల్లా వాసికి అరుదైన అవకాశం లభించింది. భీమవరానికి చెందిన చల్లా ధనంజయ ఏపీ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్‌గా సెలక్టయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఆర్డర్స్ ఇచ్చింది. 1983 నుంచి ఆయన లాయర్‌గా పనిచేస్తున్నారు. 1987 వరకు రాజమండ్రిలో వర్క్ చేసిన ఆయన.. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లారు. 2022లో సీనియర్ లాయర్ గుర్తింపు దక్కింది. తాజా పదవి ప్రకారం ఆయన.. ఏపీ హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తారు.
ఈ నెల 31వ తేదీ శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుగొండలో పర్యటించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది నుంచి కూటమి ప్రభుత్వం పెనుగొండలో కొలువైన శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుఅమ్మవారిని దర్శించుకుని ఆత్మార్పణ దినోత్సవంలో పాల్గొంటారని సమాచారం.
Sorry, no posts matched your criteria.