India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYD మొయినాబాద్‌లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో శనివారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంలో పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో పార్టీలోని ఒకరు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్న 9 మందిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ఉన్నారు. ఆయనకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. రోహిత్ సహా ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది.

భార్య గొంతును బ్లేడుతో కోసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శనివారం తణుకులో చోటుచేసుకుంది. కరగాని దిల్లేశ్వరి భర్త గోవిందు మధ్య మనస్పర్ధల కారణంగా కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఆమె పని చేస్తున్న డ్రై ఫ్రూట్స్ షాపు వద్దకు వచ్చి తనను బండిపై ఇంటికి తీసుకు వెళ్లాలని కోరాడు. ఆమె బండి నడుపుతుండగా వెనక కూర్చున్న గోవిందు తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో పీక కోసి పరారయ్యాడు.

ఎండల తీవ్రత దృష్ట్యా పశ్చిమగోదావరి జిల్లాలో మార్చి 16 సోమవారం నుంచి ఒంటిపూట బళ్లు నిర్వహించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తాయని తెలిపారు. ఎండల నుంచి విద్యార్థులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల ధరల మోతతో పాటు సర్వర్ల మొరాయింపుతో ఇబ్బందులు పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బుకింగ్ కోసం అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సి వస్తోందని, ఓటీపీ వస్తేనే ఏజెన్సీలు సిలిండర్లు ఇస్తున్నాయని వాపోతున్నారు. ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్ లో రూ.1400 నుంచి రూ.1800 వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. అధికారులు స్పందించి అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు వైసీపీ పరిశీలకులను నియమించింది. శుక్రవారం రాత్రి ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నియామక ఉత్తర్వులను జారీ చేసింది. యడ్ల తాతాజీ (ఆచంట), పేరిచర్ల విజయ నరసింహారాజు (పాలకొల్లు), ముప్పిడి సంపత్ కుమార్ (నర్సాపురం) ఫొటో, కొట్టు నాగేంద్ర (తణుకు) ఫొటో, వేండ్ర వెంకటస్వామి (తాడేపల్లిగూడెం), ఏఎస్. రాజు (ఉండి) నియమితులయ్యారు.

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 3 జనరల్ కేటగిరి బార్ లైసెన్స్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈనెల 25 ఉదయం 8 గంటలకు భీమవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో లక్కీ డ్రా తీయనున్నట్లు వివరించారు.

సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం జరిగిన రెండో రోజు కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ సి.నాగరాణి పాల్గొన్నారు. పర్యాటకాభివృద్ధిపై చర్చ సందర్భంగా.. జిల్లాలో ప్రభుత్వ భూముల కొరతను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. హోటళ్ల నిర్మాణానికి అనువుగా రెండు చోట్ల ఆర్‌అండ్‌బీ స్థలాలను గుర్తించి, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు ఆమె ఈ సమావేశంలో వివరించారు.

కలెక్టర్ల సమావేశంలో ప.గో కలెక్టర్ నాగరాణి పనితీరుపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. జిల్లాలో 45 డ్రోన్లను వ్యవసాయ సాగుతో పాటు, విద్యుత్తు లైన్ల నిర్మాణంలో పోల్ టు పోల్ వైర్లను అమర్చేందుకు ఉపయోగిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. దీనివల్ల తక్కువ సమయంలో పనులు పూర్తవుతున్నాయని తెలిపారు. ఈ వినూత్న ప్రయోగాన్ని గతంలో ఎన్నడూ వినలేదని పేర్కొంటూ సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ నెల 16 నుంచి 28 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో విద్యార్థులు హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారి గిరిధర్ కుమార్ తెలిపారు. ఇంటి నుంచి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఈ సదుపాయం ఎంతో దోహదపడనుంది.

అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప.గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సర తృతీయ త్రైమాసికానికి సంబంధించి IVRS ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా 74.1 శాతం సానుకూలతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా యంత్రాంగం సమిష్ఠిగా కృషి చేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.