WestGodavari

News March 10, 2026

ప.గో: అదనపు కట్నం వేధింపులు.. భర్తతో సహా నలుగురిపై కేసు

image

అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న భర్త, అత్త, మరిది, మరదలుపై నరసాపురం టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం.. లుటుకుర్తి రాజేశ్‌కు స్వరూపతో 2020లో వివాహమైంది. అప్పటి నుంచి రాజేశ్ అదనపు కట్నం తేవాలని, అనారోగ్యంతో ఉన్న పిల్లాడి వైద్యానికి కూడా డబ్బులు పంపకుండా, గల్ఫ్‌లో ఉంటూ భర్త వేధిస్తున్నాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్ఐ ముత్యాలరావు కేసు నమోదు చేశారు.

News March 10, 2026

ప.గో: మహిళల పట్ల అసభ్య ప్రవర్తన.. చివరకు..

image

మొగల్తూరు మండలం వారతిప్ప గ్రామంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, బూతు మాటలతో దూషిస్తున్న మల్లవరపు యేసుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం గ్రామంలోని మహిళలు పంట బోదే వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్లారు. ఆ సమయంలో యేసు అక్కడకి చేరుకొని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలు మొగల్తూరు పోలీసులకు పిర్యాదు చేయగా ఎస్సై జి.వాసు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

News March 10, 2026

ప.గో: నెల రోజుల పాటు రక్తదాన మహోత్సవం

image

ప.గో. జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ సేవలను విస్తరించేందుకు నిధుల సేకరణ చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ఈ మేరకు జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సోమవారం రక్తదాన మహోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాలో మానవతా సేవలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యమని జేసీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

News March 9, 2026

భీమవరం: ఆ 10 ఫిర్యాదులపై తక్షణ చర్యలు

image

భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో SP అద్నాన్ నయీం అస్మి 10 అర్జీలను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలపై ఫిర్యాదులు అందాయి. అందిన అర్జీలపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను SP ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

News March 9, 2026

ప.గో: పుట్టినరోజు వేడుకలు జరగాల్సిన చోట.. విషాద ఛాయలు!

image

తణుకు మండలం వీరభద్రపురానికి చెందిన ఆకుల ఐశ్వర్య (13) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తణుకు ఎస్సీ హాస్టల్‌లో చదువుకుంటున్న ఐశ్వర్యను తన పుట్టినరోజైన ఆదివారం తల్లి శాంతి నిడదవోలు తీసుకెళ్లింది. అక్కడ బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. తల్లిదండ్రులు శాంతి, ప్రసాద్ మనస్పర్ధలతో విడివిడిగా ఉంటున్నారు. బాలిక మరణంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 9, 2026

ఉమ్మడి జిల్లా సర్వోదయ మండలి ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీలక్ష్మి

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సర్వోదయ మండలి ఉపాధ్యక్షురాలిగా రిటైర్డ్ లెక్చరర్ చేకూరి ఝాన్సీలక్ష్మి నియమితులయ్యారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నియామకం చేసినట్లు కార్యదర్శి G.V.S.D ప్రసాద్ తెలిపారు. DNR కాలేజీలో పనిచేసిన ఆమె సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ఝాన్సీలక్ష్మికి అభినందనలు తెలుపుతూ సర్వోదయ ఆశయాల పట్ల ఆకాంక్షించారు.

News March 9, 2026

ప.గో: నేడు జిల్లాకు షర్మిల రెడ్డి

image

నేడు పశ్చిమగోదావరి జిల్లాకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కాళ్ల మండలం సంత మార్కెట్లో ఉపాధి హామీ కూలీలతో చర్చిస్తారని, అనంతరం 3 గంటలకు భీమవరం ప్రకాశం చౌక్‌లో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారని జిల్లా అధ్యక్షుడు సీతారామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉపాధి హామీ కూలీలు పాల్గొంటారని అన్నారు.

News March 9, 2026

భీమవరం వన్‌టౌన్‌లో ‘పీజీఆర్‌ఎస్‌’: ఎస్పీ

image

భీమవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరుగుతుందన్నారు. అర్జీదారులు ఈ మార్పును గమనించి, తమ విన్నపాలతో నేరుగా వన్‌టౌన్ స్టేషన్‌కు వచ్చి అధికారులను సంప్రదించాలని ఎస్పీ కోరారు.

News March 8, 2026

పగో:జిల్లాలో.. జోరుగా బెట్టింగ్..

image

ఉమ్మడి జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియా అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతోంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరును ఆసరాగా చేసుకుని బుకీలు పడగ విప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నెట్‌వర్క్ విస్తరించి, యాప్‌ల ద్వారా యువతకు వల వేస్తున్నారు. రూపాయికి పది వస్తాయని ఆశచూపుతూ బంతి బంతికీ పందాలు కాస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చనే వ్యామోహంతో మధ్యతరగతి యువత, విద్యార్థులు ఈ ఉచ్చులో పడి అప్పులపాలవుతున్నారు.

News March 8, 2026

భీమవరంలో 2కె రన్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భీమవరంలో ఆదివారం 2కె రన్ నిర్వహించారు. స్థానిక ప్రకాశం చౌక్ నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు సాగిన ఈ పరుగును కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శారీరక దృఢత్వమే ఆరోగ్యానికి పునాదని, మహిళలందరూ ప్రతిరోజూ వ్యాయామానికి సమయం కేటాయించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.