India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడల్ కోడ్‌ను రాజకీయ పార్టీలు తప్పక పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు కోరారు. భీమవరం కలెక్టరేట్‌లో డిఆర్ఓ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై తూర్పు, ప. గో.జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్, మోడల్ కోడ్ గురించి వివరించారు. జిల్లాలో 69,884 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుగా ఉన్నారన్నారు.
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనను ప.గో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీకి పూల మొక్క అందజేశారు. అనంతరం జిల్లాలోని లా అండ్ ఆర్డర్ గురించి డీజీపీకి వివరించారు.
భీమవరం పట్టణంలోని పలు షాపులలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ షాపుల యజమానులకు ప్లాస్టిక్ వాడకంపై కలిగే నష్టాలను వివరించారు. పేపర్ కవర్లను, గుడ్డ సంచులను వాడే విధంగా అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
పర్యావరణానికి హితము చేకూర్చే సముద్ర జీవులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్ లో మత్స్యశాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. చనిపోయిన తాబేళ్లు చినమైనివారిలంక, పెద్దమైనివారిలంక తీర ప్రాంతానికి కొట్టుకు రావడానికి గల కారణాలపై సమీక్షించారు. వాటికి పోస్టుమార్టం చేయాలని ఆదేశించారు.
వేటాడేందుకు వెళ్లిన మత్స్యకారుడు కాలువలో పడి మృతి చెందిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు.. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామం ముస్కెపాలెంకు చెందిన కొపనాతి లక్ష్మణ్(57) శుక్రవారం వేటాడేందుకు కాలువలోకి వెళ్లాడు. ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల గాలించినా లక్ష్మణ్ జాడ తెలియలేదు. శనివారం వేములదీవి కాలువలో శవమై కనిపించాడు.
తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న తణుకు రూరల్ ఎస్సై ఏ.జి.ఎస్ మూర్తి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. శుక్రవారం సాయంత్రం మృతదేహాన్ని ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా గంగవరం గ్రామానికి తరలించారు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
పిల్లలు బడి బయట కాకుండా బడిలో ఉండి చదువుకునేందుకు అవకాశాలు మెరుగుపరిచేలా పాఠశాలలు పునర్వ్యవస్థీకరణ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, అత్తిలి, ఇరగవరం మండలాల పరిధిలోని విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ శుక్రవారం తణుకులో సమీక్ష సమావేశం నిర్వహించారు. పిల్లలు విద్యావంతులైతేనే దేశం ప్రగతి వైపు పయనిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తణుకు రూరల్ ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఇవాళ పెనుగొండకు రానున్నారు. ఈ పర్యటనలో మూర్తి బందోబస్తు విధులు నిర్వహించాల్సి ఉంది. ఏదో విషయమై మదనపడుతూ నిన్న రాత్రంతా ఆయన నిద్రపోకుండా కుటుంబ సభ్యులతో గడిపారని తెలుస్తోంది. ఉదయాన్నే పెనుగొండకు వెళ్లాల్సిన ఎస్ఐ తణుకు స్టేషన్ దగ్గరకు వచ్చి తనతో తెచ్చుకున్న తుపాకీతో కాల్చుకున్నారు.
పా.గో జిల్లాలో 93 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లాలో మొత్తం 69,884 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారని, వారిలో 39,780 మంది పురుషులు, 30,103 మంది మహిళా ఓటర్లు, 1 ట్రాన్స్ జెండర్ ఉన్నారని తెలిపారు. ఫారం-18లో గ్రాడ్యుయేట్ల పేర్లను చేర్చడానికి దరఖాస్తులను ఫిబ్రవరి 10, 2025 వరకు, అంటే నామినేషన్లు స్వీకరించడానికి చివరి తేదీ వరకు స్వీకరించవచ్చునని తెలిపారు.
పురపాలక సంఘ పరిధిలోని 9,088 మంది పింఛన్ దారులు ఫిబ్రవరి 1న వారి వారి ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు సూచించారు. గురువారం సాయంత్రం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పింఛన్లకు సంబంధించి రూ.3.97 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. 35 వార్డు సచివాలయాల పరిధిలో 239 మంది సచివాలయ కార్యదర్శులు పింఛన్లు పంపిణీ చేస్తారన్నారు. లబ్ధిదారులు ఇంటి వద్దనే ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.