India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరద ముప్పు ముగిసే వరకు అధికారులందరూ కలిసికట్టుగా పని చేయాలని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. ఆదివారం ఆమె అధికారులతో మాట్లాడుతూ.. పునరావాస కేంద్రాలలో ఆహారం పూర్తి నాణ్యతతో ఉండాలన్నారు. అలాగే వరద ప్రమాదం తగ్గేవరకూ మండల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
ప.గో, ఏలూరు జిల్లాల్లో వర్షాలు, వరదల కారణంగా సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ‘మీకోసం’ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్లు నాగరాణి, వెట్రిసెల్వి ఓ ప్రకటనలో తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో జరగాల్సిన ‘మీ కోసం’ ప్రోగ్రాములను కూడా రద్దు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు.
ఉమ్మడి ప.గో జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమవారం పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు నాగమణి, అబ్రహం తెలియజేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప.గో, ఏలూరు జిల్లాల్లోని అన్ని పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా పాఠశాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. SHARE IT..
భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తనయుడు పులపర్తి ప్రశాంత్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ప్రశాంత్‌ని నియోజకవర్గంలో పలువురు అభినందించారు.
ఉండి మండలం పెదపులేరులో గత నెల 15న వారాల పండగను పురస్కరించుకొని కొంతమంది వ్యక్తులు స్థానిక శ్మశానవాటిక సమీపంలో అశ్లీల నృత్యాలు చేసినట్లు వీఆర్వో పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఉండి ఎస్ఐ మహమ్మద్ నజీరుల్లా తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వరదల నేపథ్యంలో అధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు శనివారం సమావేశమయ్యారు. కాగా బుడమేరు గండ్లు పూడిక పనుల్లో పాల్గొన్న ఇరిగేషన్ అధికారులకు, మంత్రి నిమ్మలను ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం గట్టు ఎంత ఎత్తు పెంచారని అడిగి తెలుసుకుని, బుడమేరు గట్టును పూర్తిస్థాయిలో ఎత్తు పెంచి, బలోపేతం చేయాలని సూచించారు. పులివాగు పొంగుతుండటంతో మరింత వరద వచ్చే అవకాశం ఉందని, మరో రెండు రోజులు అలర్టుగా ఉండాలన్నారు.
కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో ‘108 పాదరసాల శివలింగం’ భక్తుల పూజలందుకుంటోంది. శివకుమార్ అనే మహర్షి రాష్ట్రాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చిన సందర్భంలో లింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ లింగాన్ని పూజిస్తే కోటి లింగాలకు పూజ చేసిన ఫలితం కలుగుతందని భక్తుల నమ్మకం. ఏటా శివరాత్రికి ముందు రోజు అన్నపూర్ణకు, శివునికి వివాహం జరుపుతారని, పాదరసాలతోనే అభిషేకాలు చేస్తారు. మీరు ఎపుడైనా వెళ్లారా..?
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో భీమడోలు శ్రీ వెంకటేశ్వర కళాశాల (స్కిల్ హబ్)లో ఈ నెల 10వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి సుధాకర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 180 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 30ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపారు.
ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ రేపటి పర్యటన రద్దు అయినట్లు ఎంపీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పర్యటన రద్దయిందని, తిరిగి కొత్త షెడ్యూల్‌ను మళ్లీ వెల్లడిస్తామని తెలియజేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు సైతం వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు.
వరదలు, భారీ వర్షాల దృష్ట్యా ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామంలోని గుబ్బల మంగమ్మ ఆలయాన్ని ఆదివారం మూసివేస్తున్నట్లు ఆర్డీవో కె.అద్దయ్యయ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా భక్తులెవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.