India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరదలు, భారీ వర్షాల దృష్ట్యా ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామంలోని గుబ్బల మంగమ్మ ఆలయాన్ని ఆదివారం మూసివేస్తున్నట్లు ఆర్డీవో కె.అద్దయ్యయ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా భక్తులెవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులోని ప్రభుత్వ డీఎల్‌టీసీ, ITI కళాశాలలో ఈనెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి సుధాకర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 165 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు వారు అర్హులని, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జాబ్ మేళా ఉంటుందని అన్నారు.
ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా సాయంత్రం భారీ వర్షం పడింది. కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో జీలుగుమిల్లి మండలం నుంచి బర్రింకలపాడు వెళ్లే రహదారిలో కాలువ పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలువలు, వాగులు ఉద్ధృతంగా ఉన్నప్పుడు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు కోరుతున్నారు.
ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెంలో అశ్లీల నృత్య ప్రదర్శన పట్ల గ్రామస్థులు మండిపడుతున్నారు. శనివారం వినాయక చవితి సందర్భంగా గ్రామంలో అశ్లీల నృత్యాల ప్రదర్శన నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై హిజ్రాలతో అశ్లీల ప్రదర్శనలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
కొల్లేరులో వరద ఉద్ధృతి, ఉప్పుటేరు ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ముఖ్యమంత్రి కొల్లేరు, ఉప్పుటేరు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసే అవకాశం ఉందని సమాచారం అందడంతో పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఉప్పుటేరులో ప్రవాహానికి అడ్డంకులను తొలగించే పనులు ముమ్మరం చేయించారు.
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం ఊటుకూరులో శనివారం పట్టపగలే దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన పోసిన బాల కోటయ్య (55)ను మారణాయుధాలతో దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ముదినేపల్లి పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
భార్య చేపల కూర వండలేదని అలిగి ఉరేసుకున్న వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు మొగల్తూరు ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు. వివరాలు.. మండలంలోని ముత్యాలపల్లి చెందిన మైల సుబ్బరాజు (38) గత నెల 22న తన భార్యను చేపలకూర వండమని చెప్పారు. ఆమె వండకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబీకులు కాకినాడ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
నరసాపురానికి చెందిన ఓ యువతి సైబర్ మోసానికి గురైంది. టౌన్ SI జయలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన చింతపల్లి హాసిని డిగ్రీ పూర్తి చేసి జాబ్ సెర్చింగ్‌లో ఉంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రాంలో పాటిల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఉద్యోగం ఇస్తానని చెప్పి యువతిని నమ్మించాడు. కాగా రూ.10.15 లక్షలు కావాలని అడగ్గా ఫోన్‌పేలో పంపించింది. మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదైంది.
పెనుమంట్ర మండలం మార్టేరులో శుక్రవారం రాత్రి ఓ ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీలోకి జెర్రిపోతు జాతికి చెందిన పెద్దపాము చొరబడింది. వివరాలు.. గ్రామానికి చెందిన మహమ్మద్ బాషాకి చెందిన స్కూటీలోకి పాము ప్రవేశించినట్లు ఆయన కుమారుడు యూసుఫ్ గమనించాడు. దీంతో స్కూటీ ముందుభాగాన్ని తొలగించగా పాము వెళ్లిపోయింది. వర్షాకాలం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.
భీమవరం పట్టణంలోని త్యాగరాజ భవనంలో వినాయక చవితి ఉత్సవ కమిటీలకు అవగాహన కార్యక్రమాన్ని భీమవరం డీఎస్పీ జైసూర్య నిర్వహించారు. పట్టణంలోని వన్ టౌన్, టూ టౌన్ సీఐలు, ఎస్సైలను కలిసి ఉత్సవ నిర్వాహ కమిటీలు అనుమతులు ఎలా పొందాలి..? ఉత్సవాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఊరేగింపుల్లో డీజే సౌండ్స్ వాడకూడదని అన్నారు.
Sorry, no posts matched your criteria.