India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో. జిల్లాలోని వివిధ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ నుంచి నేడు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. జీలుగుమిల్లి- బుట్టాయిగూడెం, ఎల్‌ఎన్‌డీ పేట- పట్టిసీమ రహదారి విస్తరణ (రూ.369 కోట్లు), గుడివాడ- భీమవరం- నరసాపురం రైల్వే లైన్, భీమవరం- నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ పనులు (రూ.4612 కోట్లు) ప్రారంభిస్తారు.
ఆచంటకు చెందిన ఉత్తమ రైతు, అనేక అవార్డులు పొందిన నెక్కంటి సుబ్బారావును రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ రావాలని మంగళవారం ఆహ్వానం అందింది. ఈ నెల 26న ఢిల్లీలో జరుగునున్న రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి ఆహ్వాన పత్రిక అందుకున్నట్లు నెక్కంటి సుబ్బారావు తెలిపారు. ఈయన హైబ్రిడ్ కొత్త వరి వంగడాలను తీసుకొచ్చి రైతులు అధిక దిగుబడులు సాధించేలా కృషి చేస్తారు.
నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలోని ప్రగతి నగర్‌కు చెందిన సాయి లక్ష్మి కుమారి(19) ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఐ తెలిసిన వివరాలు ప్రకారం.. ఈ కేసులో గీతా చరణ్‌ను మంగళవారం యర్రంశెట్టివారిపాలెం పంచాయతీ పీతాని మెరకలో అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం నరసాపురం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు SI సురేష్ తెలిపారు.
జల, వాయు, భూ కాలుష్య నియంత్రణ మార్గాలను ఆలోచించి అమలు చేయడంలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. మంగళవారం భీమవరంలో కలెక్టర్ పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వివిధ మార్గాల ద్వారా పోగవుతున్న చెత్తను నియంత్రించేలా చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్, ఇరిగేషన్, డ్వామా, ఫిషరీస్, డిఆర్ డి ఏ, టూరిజం శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో గోపాలపురం మండలంలోని గోపవరంలో మంగళవారం వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. పొట్రా లక్ష్మణరావు (45) తన భుజంపై మొక్కజొన్నలు ఆడే మెషిన్ మోసుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. మిషన్ లక్ష్మణరావుపై పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య మల్లీశ్వరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
టీ.నర్సాపురం ప్రధాన సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ప్రేమ జంట పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. టి.నర్సాపురం(M) బొర్రంపాలెంకి చెందిన ఇమ్మడిశెట్టి నాగేశ్వరి, కే.జగ్గవరానికి చెందిన బాలు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుని ఇవాళ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇరు వర్గాల కుటుంబ సభ్యులను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పెద్దల సమక్షంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దండలు మార్చుకున్నారు.
ఉండి నియోజకవర్గంలో సోమవారం మంత్రి నారా లోకేశ్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద అమిరంలో చిన్నారులతో లోకేశ్ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన చిన్నారులను ఎత్తుకుని గుండెలపై ఆడించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతకుముందు డిప్యూటీ స్పీకర్ రఘురామ, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ నివాసంలో మూడు పార్టీల కేడర్‌తో భేటీ అయ్యారు.
HMPV కేసుల నమోదుతో ప్రజలు కాస్త భయాందోళనకు గురవుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు ఉన్నవారు ఆసుపత్రులకు వస్తున్నారు. ప.గో.జిల్లా ప్రజలు ఈ వైరస్ పట్ల ఆందోళన వద్దని, జాగ్రత్తలు పాటిస్తే మంచిదని జిల్లా ఇన్‌ఛార్జ్ DMHO బి.నాయక్ సూచించారు. జిల్లాలోని 54 ప్రాథమిక కేంద్రాల్లో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండేలా అవసరమైన మందులు సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకున్నామన్నారు.
ప.గో.జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. వారి వివరాలివే.. మొగల్తూరు(M) ముత్యాలపల్లికి చెందిన ఆదిలక్షి రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని చనిపోయింది. యండగండిలో లారీ రివర్సులో వెనక్కి ఉన్న వ్యక్తిని ఢీకొట్టడంతో అప్పారావు చనిపోయారు. దలపర్రులో బైక్ అదుపుతప్పి యువకుడు మృతి చెందాడు. మొగల్తూరులో నడిచి వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు.
కాళ్ల మండలం పెదఅమిరంలో ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు నివాసం వద్ద సోమవారం మంత్రి నారా లోకేశ్ భరత్ అనే బాలుడిని ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆచంటకు చెందిన ఈ బాలుడు సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. అంతేకాదు చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో ఒకరోజు 12 గంటలు పచ్చి మంచినీరు ముట్టకుండా ఉపవాసం చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
Sorry, no posts matched your criteria.