India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డెంగ్యూ జ్వరంతో గూన నిత్యశ్రీ పద్మ(6) శుక్రవారం రాత్రి మృతి చెందింది. అత్తిలిలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న చిన్నారికి మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో తణుకులో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. డెంగ్యూ జ్వరంగా నిర్ధారించిన వైద్యులు శుక్రవారం పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆగష్టు నెల 31న పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వటం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతకు నిదర్శనమని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. 31న అందుబాటులో లేని లబ్ధిదారులకు సెప్టెంబర్ 2న పెన్షన్లు అందచేస్తారన్నారు. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే అందిస్తున్నారని తెలిపారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సమావేశం శుక్రవారం ఏలూరు జడ్పీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు విషయాలపై చర్చించారు.
తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం హార్టీసెట్-2024 ఫలితాలను ఉపకులపతి గోపాల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హార్టీసెట్ పరీక్షకు 26 మంది విద్యార్థులు హాజరు కాగా, 255 మంది ఉత్తీర్ణులైనట్టు వివరించారు. అనుముల విజయలక్ష్మి (మడకశిర), కుంపాటి పావని (కోయలకుంట్ల ), గోసల సతీష్ (పొదిలి) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారన్నారు.
భీమవరం మున్సిపాలిటీ ఉద్యోగి ఉదయ్ తనను ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మాధవి అనే యువతి ఆరోపించింది. ఆమె వివరాల ప్రకారం.. భీమవరంలోని గునుపూడికి చెందిన ఉదయ్, తాను 10ఏళ్లు ప్రేమించుకున్నామని, మున్సిపాలిటీలో జాబ్ రావడంతో ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని వాపోయింది. పంచాయితీ పెట్టగా పెద్దలు కూడా హేళనగా మాట్లాడారని, అందుకే శుక్రవారం కలెక్టర్‌ను కలవనున్నట్లు తెలిపింది.
ప.గో జిల్లా పాలకొల్లు పట్టణంలో శుక్రవారం విషాదం నెలకొంది. పాలకొల్లు-నరసాపురం వెళ్లే రైలు మార్గంలో ఓ ప్రేమ జంట శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువకుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రైన్ వచ్చే సమయంలో ప్రియుడు రాజేశ్ ప్రియురాలిని పక్కకు నెట్టేసి రైలు కింద దూకేశాడు. యువతిని చికిత్స నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉండి MLA రఘురామకృష్ణరాజు కేసుపై గుంటూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నిందితులుగా పేర్కొన్న మాజీ CM జగన్, CID పూర్వపు GD సునీల్‌కుమార్, అప్పటి నిఘా బాస్ ఆంజనేయులు తదితరులకు నోటీసులు పంపి విచారణకు పిలిచేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. తనపై హత్యాయత్నం చేసిన వారితో పాటు అందుకు ప్రోత్సహించిన వారిని, ఘటనను కప్పిపుచ్చేందుకు సహకరించిన వారిని బాధ్యులుగా చేయాలని RRR పోలీసులను కోరారు.
ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువకుడిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మేడిచర్లపాలానికి చెందిన రవికుమార్ తనను మోసం చేశాడని ప.గో జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద్‌కు చెందిన యువతి ఫిర్యాదు చేసినట్లు నరసాపురం రూరల్ SI సురేశ్ తెలిపారు. దీంతో రవికుమార్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖలో గుమస్తాగా పనిచేస్తున్న కాజా కిరణ్ కొద్ది రోజుల కింద ఏలూరుకు చెందిన గెడ్డం శ్రీవంశీ వద్ద కొంత సొమ్ము అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించే క్రమంలో శ్రీవంశీకి బ్యాంక్ చెక్కు ఇచ్చాడు. ఆ చెక్కు బ్యాంకులో వేస్తే చెల్లలేదు. దీంతో శ్రీవంశీ కోర్టును ఆశ్రయించారు. ఏలూరు మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టు కిరణ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది.
ఇటీవల ఒలింపిక్స్‌లో పాల్గొన్న తణుకు పట్టణానికి చెందిన క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అభినందించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతికశ్రీకి శాలువా కప్పి అభినందించి జ్ఞాపిక అందజేశారు. రాబోయే రోజుల్లో క్రీడల్లో మరింత రాణించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
Sorry, no posts matched your criteria.