India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైదరాబాద్‌లో ‘హైడ్రా’ నేలమట్టం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అలాంటి ‘హైడ్రా’ అవసరం మన ఉమ్మడి. ప.గో జిల్లాకు కూడా అవసరం ఉందని ఊర్లలో చర్చలు నడుస్తున్నాయి. ఇరగవరం, ఆచంట, ఆకివీడు, భీమవరం ఇలా చాలా మండలాల్లో ఆక్రమణలు చాలా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తు్న్నాయి. ఉమ్మడి జిల్లాలో 11 పంట కాలువలు, వందల బోదెలుండగా, వాటిలో చాలా వరకు ఆక్రమించేశారని ఆరోపణలు వస్తున్నాయి.
ప.గో జిల్లాలో సెప్టెంబరు నెల పెన్షన్లు ఆగస్టు 31వ తేదీనే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబరు 1న ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 2,31,075 మందికి రూ.96.95 కోట్ల నగదు పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఆగస్టు 31 నాడే 100 శాతం పింఛన్ల పంపిణీని టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని జీడి పిక్కల ఫ్యాక్టరీ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఓ వాహనం ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని దగ్గుమళ్ల రామారావుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బొర్రంపాలెం గ్రామానికి చెందిన రామారావు ఓ శుభకార్యానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం ముండూరు గ్రామంలో గురువారం ఘోరం జరిగింది. కట్టుకున్న వాడే భార్యపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో మహిళ కాళ్లు, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ మహిళపై దాడి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ద్వారకాతిరుమల చిన వెంకన్న ప్రసాదంలో పురుగు కనిపించడంపై ఏలూరుకు చెందిన ఆహార విభాగం అధికారులు ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈవో వేండ్ర త్రినాథరావు సైతం స్పందించారు. సంబంధిత గుత్తేదారు రవికి నోటీసులు జారీ చేశారు. అలాగే ఆ విభాగం ఏఈవో, సూపరింటెండెంట్, ఇతర సిబ్బందికి సంజాయిషి నోటీసులు ఇచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజలు తమ రోజువారీ జీవితంలో శారీరక వ్యాయామం, క్రీడలను అభ్యాసం చేసి ఆరోగ్యంగా, ధృడంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పేర్కొన్నారు. రేపు ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా వారం రోజుల పాటు నిర్వహిస్తున్న క్రీడోత్సవాల్లో భాగంగా బుధవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రారంభించారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ 90 సంవత్సరాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆన్ లైన్‌లో క్విజ్ పోటీలకు సంబంధించిన పోస్టర్లను బుధవారం ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆవిష్కరించారు. మన జిల్లాలో కూడా డిగ్రీ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. https://www.rbi90quiz.in/ వెబ్ సైట్ లో ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. బుధవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లాస్ధాయి క్రైసెస్ గ్రూప్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పరిశ్రమలు పూర్తి భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. ఏవైనా ఘటనలు, ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై అవగాహన కలిగించాలన్నారు.
భీమడోలు మండలం అర్జవారిగూడెంలో బుధవారం దారుణ హత్య జరిగింది. కృష్ణను ఓ వ్యక్తి మెడపై కత్తితో దాడి చేసి చంపినట్లు స్థానికులు తెలిపారు. ఇదే దాడిలో ఓ వివాహితకు తీవ్ర గాయాలు కాగా, ఆమెను ఏలూరు ఆసుపత్రికి తరలించామన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థల వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను(17)గర్భవతిని చేయడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వాసు తెలిపారు. బాలిక ఇటీవల అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎనిమిదో నెల గర్భిణీ అని వైద్యులు చెప్పారు. దీంతో అసలు విషయాన్ని బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.