India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లాలో YSR విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది. జంగారెడ్డిగూడెం మండలం కృష్ణంపాలెం గ్రామంలో YSR విగ్రహాన్ని శనివారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఇవాళ ఉదయాన్నే ఈ ఘటనను గుర్తించారు. ఎంపీటీసీ బిరుదుగట్ల రత్నకుమారి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు గ్రామంలో ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ప.గో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు 17.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నరసాపురం మండలంలో 62 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మండలాల వారీగా తణుకు- 20. ఆకివీడు- 14.2, ఉండి- 17.2, పాలకోడేరు- 30.2, పెనుమంట్ర- 20.6, ఆచంట- 20.2, పోడూరు- 10.4, వీరవాసరం- 13.4, కాళ్ల- 13.2, మొగల్తూరు- 24.4, పాలకొల్లు- 30.3, యలమంచిలి- 50.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఏలూరు జిల్లాలో శనివారం మూడు బుకింగ్ సెంటర్ల ద్వారా 1,526 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసినట్టు మైనింగ్ డీడీ సునీల్ తెలిపారు. జిల్లాలో ఇంతవరకు మొత్తం 7,613 మెట్రిక్ టన్నుల ఇసుక వినియోగదారులకు సరఫరా చేశామని తెలిపారు. ఇబ్రహీంపేట స్టాక్ పాయింట్ వద్ద మెట్రిక్ టన్ను రూ.210, చేబ్రోలు స్టాక్ పాయింట్ వద్ద రూ.538, వింజరం స్టాక్ పాయింట్ వద్ద పాయింట్ వద్ద టన్ను రూ.362కు ఇసుకను సరఫరా చేశామని వివరించారు.
విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నేటినుంచి ఏలూరులో అదనపు హాల్ట్ కల్పించనున్నారు. ఈరోజు సాయంత్రం వందే భారత్ రైలు విశాఖ నుంచి బయలుదేరి ఏలూరుకు 5:54కి రానుంది. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ వేడుకకు రైల్వే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌తోపాటు రైల్వే అధికారులు, ప్రజలు పాల్గొననున్నారు.
భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వారితో పూజలు చేయించి, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, తదితరులు ఉన్నారు.
కొవ్వూరు మండలం దేచెర్ల చెరువు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళను లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దేవరపల్లి నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు మహిళ రాజమండ్రికి చెందిన రాజ్యలక్ష్మి (హిందీ టీచర్)గా తెలుస్తుంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలనుంది.
సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై అభ్యంతరకర పోస్టులు పెట్టి ఉద్యోగ నిబంధనలు ఉల్లంఘించిన సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు సహకార శాఖ రిజిస్ట్రార్, కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవ్వూరుకు చెందిన చౌదరి ఇతనిపై కమిషనర్, మంత్రికి ఈ నెల 21న ఫిర్యాదు చేయగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కొవ్వూరు నుంచి బదిలీపై విజయవాడకు వెళ్లారు.
నరసాపురం నుంచి సికింద్రాబాద్ కు ఈ నెల 28న ప్రత్యేక రైలు నడపనున్నామని స్టేషన్ మేనేజరు గణపతి మధుబాబు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని మధుబాబు చెప్పారు. రైల్వే ప్రయాణికులు గమనించాలని కోరారు.
ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను శుక్రవారం తణుకు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. పాలకొల్లు వివాహ కార్యక్రమానికి వెళుతూ మార్గమధ్యంలో ఆగిన బొత్స సత్యనారాయణను కలిసిన నాయకులు అభినందనలు తెలిపారు. ఆయన వెంట మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఒక వరమని వానపల్లి సభా వేదికగా సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటి పోలవరంను దుర్మార్గుడైన జగన్ గోదావరిలో కలిపేశారని, డయాఫ్రం వాల్ నాశనమైందని, కాపర్ డ్యాంలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. మళ్లీ కొత్త డయాఫ్రం వాల్ కట్టాల్సి వస్తుందన్నారు. లేదంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఉభయ గోదావరి జిల్లాలు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందని తెలిపారు. తొందర్లోనే పోలవరంను పూర్తి చేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.