India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భీమవరం కలెక్టరేట్, జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

భీమవరం కలెక్టరేట్, జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

సంక్రాంతి సమీపిస్తుండటంతో జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో కోడిపందాల బరుల ఏర్పాటు వేగవంతమైంది. పొలాలు, లేఅవుట్లను చదును చేసి, ప్రేక్షకుల కోసం భారీ గ్యాలరీలు, అతిథుల కోసం ప్రత్యేక విడిది సౌకర్యాలను నిర్మిస్తున్నారు. పందేల వద్ద గొడవలు జరగకుండా ముందస్తుగా ప్రైవేట్ బౌన్సర్లను సైతం నియమిస్తున్నారు. పండుగకు ముందే పందెం రాయుళ్ల హడావుడితో ఊళ్లన్నీ కళకళలాడుతున్నాయి.

భీమవరం రైతు బజార్ సమీపంలోని వైన్ షాప్ వద్ద మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఒకరిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదుతో వన్ టౌన్ ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు హెచ్చరించారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ శాశ్వత భవన నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుందని స్పష్టం చేసినా, అటు భీమవరం.. ఇటు ఉండి నియోజకవర్గాల మధ్య ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో భవనం ఎక్కడ నిర్మిస్తారనే అంశంపై జిల్లాలోని జూదరలు రూ.కోట్లలో పందాలు కాస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు సరి చూసుకుని కొత్త పాసు పుస్తకాలకు దరఖాస్తు చేసుకోవాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. శనివారం మొగల్తూరు మండలం శేరేపాలెం రెవెన్యూ విలేజ్ కొత్తపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతులను కలిసి జేసీ మాట్లాడారు. పాసు పుస్తకాలలో ఉన్న ఫొటో, పేరు, సర్వే నంబరు, విస్తీర్ణం, ఆధార్ నంబరు, వంటివి ఏమైనా తప్పిదాలు ఉంటే పరిశీలించుకుని సరి చేయించుకోవాలన్నారు.

పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం మంత్రి నిమ్మల రామానాయుడు ఆయుర్వేద ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. రూ.12.50 కోట్లతో ఆసుపత్రిని 100 బెడ్లుగా అభివృద్ధి చేశామని, రూ.కోటితో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. బ్యూటిఫికేషన్ కోసం మరో రూ.1.20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

నరసాపురం రోడ్డులో శుక్రవారం దారుణ ఘటన జరిగింది. థామస్ బ్రిడ్జి సమీపంలో ఓ వృద్ధురాలు నడిచి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు రైల్వేస్టేషన్ దారి అడిగారు. ఆమె వివరిస్తుండగా మెడలోని బంగారు ఆభరణాలు లాక్కొనే ప్రయత్నం చేశారు. బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో గొలుసు తెగి కొంతభాగం వారి చేతికి చిక్కింది. దుండగులు అక్కడి నుంచి పరారయ్యాడు.

నరసాపురంలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు భారీ జరిమానా విధించింది. చలవపేటకు చెందిన ఎన్. శ్రీను మంగళవారం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు దొరికాడు. నిందితుడిని గురువారం అడిషనల్ సివిల్ జడ్జి ఎస్. రాజ్యలక్ష్మి ఎదుట హాజరుపరచగా, ఆమె రూ.10 వేల అపరాధ రుసుము విధించినట్లు టౌన్ ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామని ఆమె హెచ్చరించారు.

రైతులకు పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వీఆర్వోలు క్షేత్రస్థాయిలో రైతుల ఇళ్లకు వెళ్లి నేరుగా పాసుపుస్తకాలు అందజేయాలన్నారు. అదే సమయంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.