WestGodavari

News January 14, 2026

ఖాకీపై ఖద్దరు విజయం.. జిల్లాలో పందెం హోరు!

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో కోడిపందేలకు లైన్ క్లియర్ అయింది. పోలీసుల ఆంక్షలు అమలు కాకపోవడంతో ‘ఖాకీపై ఖద్దరు’ విజయం సాధించినట్లయ్యింది. బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రధాన బరుల వద్ద పందేలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పందెం రాయుళ్లు భారీగా తరలిరావడంతో బరుల వద్ద కోలాహలం నెలకొంది. వచ్చే మూడు రోజుల పాటు ఈ పందెం జాతర కొనసాగనుండగా.. సంప్రదాయం పేరిట జూదం జోరందుకోవడంతో పల్లెలన్నీ పందెం సెగతో ఊగిపోతున్నాయి.

News January 14, 2026

‘గూడెం’ బరిలో రూ.2 కోట్లు పైమాటే?

image

తాడేపల్లిగూడెం(M)లో కోడిపందేల నిర్వహణ ఉత్కంఠ రేపుతోంది. గతేడాది ఒకే బరిలో రూ.కోటికిపైగా పందెం జరగగా, ఈసారి అది రూ.2కోట్లు దాటుతుందని సమాచారం. దీంతో పందెం రాయుళ్లంతా ఈ బరిపై ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరిగే అవకాశం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోలీసులు బరులను ధ్వంసం చేస్తున్నా, లక్షలాది రూపాయల చేతులు మారే ఈ భారీ పందెంపైనే సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

News January 14, 2026

ప.గో: ‘బరి’లో సస్పెన్స్.. పైచేయి ఖాకీదా? ఖద్దరుదా?

image

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఏటా కోడిపందాలు నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. అయితే, ఈ ఏడాది భోగి రోజున ఉదయం 10:40 గంటలు కాస్తున్నా, పందాలకు అనుమతులు లభించలేదు. దీంతో పందెం రాయుళ్లు అనుమతుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది పైచేయి ఖాకీదా ? ఖద్దరుదా ? తేలాల్సి ఉంది. మంగళవారం రాత్రి తాడేపల్లిగూడెం(M) కడియద్ద, కొమ్ముగూడెం, పట్టెంపాలెం, తాడేపల్లిగూడెంలోని బరులను ధ్వంసం చేశారు.

News January 14, 2026

ప.గో జిల్లా ఎస్పీ హెచ్చరిక

image

సంక్రాంతి పండుగ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నయీమ్ అస్మి హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలతో కోడిపందేలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలను నిషేధించినట్లు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ప్రజలు చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉండి, కుటుంబాలతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.

News January 12, 2026

ప.గో: నేటి పీజీఆర్ఎస్‌కు 211 అర్జీలు

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 211 అర్జీలు స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఒకేరోజు 7 చిత్రాల ట్రైలర్స్ విడుదల చేస్తా: నిర్మాత తుమ్మలపల్లి

image

ఈ ఏడాది ఆగస్టు 15 లోపు 15 చిత్రాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. సోమవారం భీమవరంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఒకేసారి ప్రారంభించిన 15 చిత్రాలలో ఇప్పటికే 7 చిత్రాల షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. భీమవరం టాకీస్ పతాకంపై రూపొందిన ఈ 7చిత్రాల ట్రైలర్లను కూడా ఒకేరోజు ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు.

News January 12, 2026

ప.గో: అర్జీదారులకు గమనిక.. గ్రీవెన్స్‌ వేదిక మార్పు

image

ప్రతి సోమవారం గొల్లలకోడేరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. అర్జీల స్వీకరణ కార్యక్రమం గొల్లలకోడేరు కార్యాలయానికి బదులుగా భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరగనుంది. గొల్లలకోడేరు కార్యాలయానికి రావాల్సిన అర్జీదారులు నేరుగా వన్‌టౌన్ స్టేషన్‌కు వచ్చి తమ వినతులు అందజేయాలని ఎస్పీ ఒక ప్రకటనలో కోరారు.

News January 12, 2026

ప.గో జిల్లాలో సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్

image

భీమవరం కలెక్టరేట్‌, జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.