India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రక్షిత నీరు అందించే ‘అమరజీవి జలధార’ పథకానికి రూ.1,400 కోట్లు మంజూరైనట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం పాలకొల్లులో ఆర్డబ్ల్యూఎస్, ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డెల్టా ప్రజల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ పథకాన్ని రూపొందించామని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రక్షిత నీరు అందించే ‘అమరజీవి జలధార’ పథకానికి రూ.1,400 కోట్లు మంజూరైనట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం పాలకొల్లులో ఆర్డబ్ల్యూఎస్, ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డెల్టా ప్రజల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ పథకాన్ని రూపొందించామని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని భీమవరం సివిల్ జడ్జి సుధారాణి అన్నారు. బుధవారం ఉండి ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ, ఎక్కడైనా ఇలాంటివి జరిగితే తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ఈ సామాజిక రుగ్మత నిర్మూలనకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్.సుధీర్ పాల్గొన్నారు.

భీమవరంలో కొలువైన శ్రీమావుళ్లమ్మ అమ్మవారికి పట్టణానికి చెందిన భరత్ కుమార్, వరలక్ష్మీ నాగప్రసన్న 8 గ్రాముల అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి విరాళంగా అందజేశారు. ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ నాగభూషణం, ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగర్ పాల్గొన్నారు.

నరసాపురం స్టీమర్ రోడ్డులోని మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాల అరుదైన మైలురాయిని అందుకుంది. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (SHVRM) మూల్యాంకనంలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జాతీయ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా హెచ్ఎం సుధీర్ బాబు, ఉపాధ్యాయులను ఎంఈవోలు పుష్పరాజ్యం, జాన్ ప్రభాకర్ అభినందించారు. పాఠశాల పారిశుద్ధ్యం, హరిత వనరుల నిర్వహణపై అధికారులు ప్రశంసలు కురిపించారు.

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి 2025 సంవత్సరానికి ‘ఉత్తమ ఎన్నికల విధానాల’ అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాలకు వివిధ విభాగాల్లో పురస్కారాలు దక్కగా.. పగో కలెక్టర్‌కు ఈ గౌరవం లభించింది. జనవరి 25న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు.

ఈ నెల 21 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని, ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. విద్యుత్, రవాణా, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఉండిలో జంట మృతదేహాల లభ్యం కావడం కలకలం రేపుతోంది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న కొబ్బరి తోటలో సుబ్బారావు అనే వ్యక్తి మృతదేహం లభ్యం కాగా, మంగళవారం నిమ్మలపేటలో విజయ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వరుసగా రెండు మృతదేహాలు బయటపడటంతో ఇవి హత్యలా లేక ఆత్మహత్యలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.

<<18903335>>ఎలుకల మందు కలిపిన కూల్ డ్రింక్<<>> తాగిన భీమవరం బలుసుమూడి ఉండే మాన్యం మహారుద్ర కాంత్ అనే బాలుడు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు భీమవరం వన్ టౌన్ SI రామారావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి నుంచి వలస వచ్చిన సుబ్బారావు కుటుంబం భీమవరంలో అద్దెకు ఉంటోంది.

ఉమ్మడి ప.గో. జిల్లా ఏలూరులో ఆదివారం ‘అనగనగా ఒక రాజు’ మూవీ టీమ్ సందడి చేసింది. చిత్రం విజయోత్సవ సంబరాల్లో భాగంగా హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షీ చౌదరి ఏలూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా పడమర వీధి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సినిమా ప్రదర్శన అవుతున్న థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులతో కాసేపు సరదాగా గడిపారు.
Sorry, no posts matched your criteria.