India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైవీయూ తెలుగు శాఖ స్కాలర్ తమ్మిశెట్టి వెంకట నారాయణకు డాక్టరేట్ లభించింది. ఆచార్య ఎం.ఎం.వినోదిని పర్యవేక్షణలో “తెలుగులో శ్రామిక కథలు – స్త్రీ చైతన్యం (1980 నుంచి 2015 వరకు)” అనే శీర్షికపై పరిశోధన చేశారు. లక్కిరెడ్డిపల్లి మండలం బూడిదగుంటపల్లెకు చెందిన వెంకట నారాయణ చేసిన పరిశోధనలో మూడున్నర దశాబ్ద కాలంలో గ్రామీణ, పట్టణ మహిళల స్థితిగతులు, ఆనాటి పరిస్థితులను వెలుగులోకి తెచ్చారు.
కడప-కృష్ణాపురం రైలు మార్గంలోని ఎగువ రైలు పట్టాలపై షేక్ అన్వర్ బాషా (62) ఆత్మహత్య చేసుకున్నట్లు కడప రైల్వే హెడ్ కానిస్టేబుల్ గోపాల్ తెలిపారు. రామాపురం మండలం హసనాపురం గ్రామానికి చెందిన అన్వర్ బాషా అప్పుల బాధతో మంగళవారం మధ్యాహ్నం ముంబయి-చెన్నై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ వివరించారు.
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కసాయిలా మారి కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దముడియం మండల పరిధిలోని నెమళ్లదిన్నెకి చెందిన మతిస్తిమితం లేని కూతురిపై మద్యం మత్తులో తండ్రి అత్యాచారం చేసినట్లు సమాచారం. అయితే బాలిక 2 రోజులుగా నీరసంగా ఉండటంతో తల్లి కూతురిని ప్రశ్నించింది. దీంతో బాలిక తల్లి భర్తపై పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది.
సిద్ధవటం పెన్నా నదిలో ఎగువ పేట దళిత వాడకు చెందిన సునీత (19) గల్లంతైనట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. మంగళవారం నదిలోకి దిగిన యువతి ప్రవాహ వేగంలో కొట్టుకుపోయిందన్నారు. దీంతో పోలీసులు పెన్నా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. తమ బిడ్డను ఎలాగైనా కాపాడాలని యువతి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కసాయిలా మారి కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన మంగళవారం పెద్దముడియంలో జరిగింది. నెమళ్లదిన్నె గ్రామానికి చెందిన మతిస్తిమితం లేని ఓ బాలికపై మద్యానికి బానిసైన తండ్రి అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ఎస్ఐ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పెళ్లి వేడుకకు పచ్చి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన కడప జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపురం మండలం నల్లింగాయపల్లెకి ఓ వ్యక్తి మల్లుపెల్లికి వచ్చాడు. సోమవారం రాత్రి భారతి సిమెంట్ కంపెపీ సమీపంలో నడిచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. అతన్ని ఢీకొన్న ద్విచక్ర వాహనదారుడు ఆసుపత్రిలో మృతి చెందాడు.
కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లె వద్ద బాంబు స్క్వాడ్ వాహనానికి ప్రమాదం తప్పింది. జగన్ పర్యటన నేపథ్యంలో పులివెందులకు వెళ్తున్న బాంబు స్క్వాడ్ వాహనాన్ని మంగళవారం ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. దీంతో వాహనం పొలాల్లోకి దూసుకెళ్లింది. వాహనంలో 10 మంది బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.
YS జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా 10:45 ప్రాంతంలో ఇడుపులపాయకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో పులివెందుల చేరుకుని ఆయన నివాసంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. జగన్ పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టిదిట్టం చేశారు. మూడు రోజులపాటు జగన్ జిల్లాల పర్యటిస్తారని పార్టీ నాయకులు తెలిపారు.
వైవీయూ పీజీ కళాశాలలో కామర్స్, కాంపిట్యూషనల్ డేటా సైన్సెస్ సబ్జెక్టులలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం నవంబర్ 4వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు క్యాంపస్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎస్. రఘునాథ్ రెడ్డి తెలిపారు. కామర్స్ సబ్జెక్టు గెస్ట్ ఫ్యాకల్టీకి ఎంకాం, కాంపిట్యూషనల్ డేటా సైన్సెస్ సబ్జెక్టులకు ఎమ్మెస్సీ, పీహెచ్డీ/ నెట్/ సెట్ అర్హత ఉండాలన్నారు. అన్ని రకాల ఒరిజినల్ అర్హత పత్రాలతో రావాలని సూచించారు.
రాజుపాలెం గ్రామానికి చెందిన ఆదిల్(11) అనే బాలుడు చాపాడు కాలువలో పడి మృతి చెందాడు. సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయిన బాలుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఆదిల్ మృతదేహం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటరమణ తెలిపారు.
Sorry, no posts matched your criteria.