India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వాహనదారులు అతివేగంగా ప్రయాణించి ప్రాణాలకు మీదకు తెచ్చుకోరాదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రామాపురం మండలం చిట్లూరు గ్రామ సమీపంలో కారు, ట్యాంకర్ ఢీకొని జరిగిన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కడప-చిత్తూరు జాతీయ రహదారిలో వాహనదారులు అతివేగంగా ప్రయాణించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడని రైల్వే సీఐ నాగార్జున తెలిపారు. ఈ ఘటన కడర రైల్వే స్టేషన్‌లో జరిగింది. సీఐ కథనం మేరకు.. మృతుడి వయసు 65-70 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. మృతుడి ఆచూకీ తెలియరాలేదని, గుర్తు పట్టినవారు కడప రైల్వే పోలీసు స్టేషన్లో సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించామని సీఐ వివరించారు.
వేడి నీళ్లు మీదపడి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన శుక్రవారం అన్నమయ్య జిల్లా పెద్దమండెం మండలంలో జరిగింది. వివరాలు వెళ్తే.. పాపేపల్లె పంచాయతీ, బండమీద తురకపల్లెకి చెందిన రెడ్డి బాషా కొడుకు ఖాసీంఖాన్ తన తల్లి వంట చేస్తుండగా పొయ్యి వద్దకు వెళ్లాడు. అదే సమయంలో పొయ్యిపైన ఉన్న వేడి నీళ్లు బాలుడిపై మీదపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని కుటుంబీకులు చికిత్సకోసం వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అధిక ప్రాధాన్యతతో వాటిని విచారించి అదృశ్యమైన వారి జాడ తెలుసుకుని వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చాలని కడప ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. కడప పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. అదృశ్యమైన వారి ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక టీమ్‌లుగా విడిపోయి ప్రత్యేక దర్యాప్తు చేయాలన్నారు.
కడప జిల్లా నూతన కలెక్టర్‌గా లోతేటి శివశంకర్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10.45 గంటలకు జిల్లా ఛాంబర్‌లో ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు నూతన కలెక్టర్‌కు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.
ఢిల్లీలో కనిపించకుండా పోయిన బాలిక ముద్దనూరులో ప్రత్యక్షమైంది. సీఐ దస్తగిరి తెలిపిన వివరాల ప్రకారం.. 15 ఏళ్ల మొహంతి కాంతు ఢిల్లీ నుంచి పారిపోయి ముద్దనూరులో ఉన్నట్లు సమాచారం రావడంతో ఢిల్లీ పోలీసులు సీఐ సహాయం కోరారు. దాదాపు 2 గంటల సర్చ్ ఆపరేషన్ తర్వాత ఆ అమ్మాయితో పాటు వచ్చిన మహమ్మద్ రెహ్మాన్‌ల జాడ కనుక్కొని ఢిల్లీ పోలీసులకు అప్పచెప్పినట్లు ఆయన చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కడప – రాయచోటి మార్గమధ్యలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న వాహనదారుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. ప్రమాదకరంగా ఉండే ఈ ఘాట్‌కు ప్రత్యామ్నాయంగా.. ఆ కొండకు సొరంగం తవ్వి, నాలుగు వరుసల రహదారి నిర్మించేందుకు కేంద్రం రూ.1,000 కోట్లు నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం 14 జాతీయ రహదారులకు రూ.4,744 కోట్లతో 2024-25 వార్షిక ప్రణాళికకు రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లా పర్యటనకు రానున్నారు. అనంతరం 8వ తేదీన తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు ఆయన రేపు సాయంత్రం కడప రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానం ద్వారా కడపకు చేరుకొని రోడ్డు మార్గాన ఇడుపులపాయ వెళ్తారని కడప మేయర్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేశ్ బాబు తెలిపారు.
రాజంపేట సబ్ జైలు నుంచి బాషా అనే ఖైదీ గురువారం పరార్ అయ్యారని పట్టణ సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. ఉదయం 8-9 గంటల సమయంలో వంట చేయడానికి ఖైదీలను జైలు గది నుంచి బయటకు వదిలిన సమయంలో దుప్పట్లను తాడుగా చేసుకుని గోడ దూకి పరారయ్యాడని జైలర్ మల్లారెడ్డి తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. హత్య కేసులో ముద్దాయి బాషా గత ఏడాది నవంబర్ నుంచి జైలులో ఉన్నారు. ఇతనిది రైల్వే కోడూరు అని తెలిపారు.
కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సూర్యరావు తెలిపారు. వాణిజ్యశాస్త్రం, భౌతికశాస్త్రం, ఆధునిక ఉర్దూ సబ్జెక్టులలో బోధించుటకు అర్హులైన అధ్యాపకులు కావాలన్నారు. మాస్టర్ డిగ్రీలో 50% మార్కులు కలిగిన వారు అర్హులని తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 9వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 12వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.