Y.S.R. Cuddapah

News May 10, 2024

కడప జిల్లాలో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

image

ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు కడప జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. జిల్లా మొత్తంలో ఉద్యోగులు 98.16 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉద్యోగులు అత్యధికంగా కడప, జమ్మలమడుగులో 100 శాతం మంది ఓటేశారు. నియోజకవర్గాల వారీగా చూస్తే బద్వేలు 99.59, పులివెందుల 94.67, కమలాపురం 94.54, ప్రొద్దుటూరులో 96.89, మైదుకూరులో 99.00 శాతం మంది ఉద్యోగులు ఓటు వేశారు.

News May 10, 2024

కడప ఎస్పీ హెచ్చరికలు జారీ

image

ఈ నెల 13న జరగబోయే ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎక్కడైనా అల్లర్లకు పాల్పడినా, ఈవిఎం మిషన్లను తాకినా తాట తీస్తామని కడప ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కు మూడంచెల భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పారా మిలటరీ సిబ్బంది, కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

News May 10, 2024

రాజంపేటలో ఉద్యోగి మృతి

image

రాజంపేట పట్టణంలోని ఎంజీ ఆర్ షాపింగ్ మాల్ వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్‌పై పొరుగుసేవల ఉద్యోగి ఏనుగుల హరీష్ కుమార్ పనిచేస్తుండగా షాక్ కొట్టడంతో ట్రాన్స్ ఫార్మర్ పైనే వాలిపోయారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, అతనిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందారు. జగన్ సిద్ధం సభ కారణంగా ఆ ప్రాంతంలో విద్యుత్ వైర్లు తొలగించారు. పునరుద్ధరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

News May 10, 2024

జమ్మలమడుగు: షాపులో యువకుడు ఆత్మహత్య

image

జమ్మలమడుగులో మహబూబ్ బాష (20) అనే వ్యక్తి షాపులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. దేవగుడి గ్రామానికి చెందిన మహబూబ్ బాష కాపు వీధిలోని ఓ షాపులో కుట్టు మిషన్‌ మెకానిజంలో శిక్షణ పొందుతున్న షాపులో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి షబ్బీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.

News May 10, 2024

రాజంపేట: ఓటేసిన 2211 మంది ఉద్యోగులు

image

రాజంపేట అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రంలో ఇప్పటి వరకు 2211 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారని రాజంపేట రిటర్నింగ్ అధికారి మోహన్ రావు తెలిపారు. ఉద్యోగులు 2398 మంది ఓటు కోసం నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇంటివద్ద ఓటు కోసం 165 మంది నమోదు చేసుకోగా 151మంది ఓట్లు పోలైనాయని వివరించారు.

News May 9, 2024

జగన్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆది

image

జమ్మలమడుగు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆర్టీపీపీ కాలనీలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వంపైన నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేసి అభివృద్ధిని అంతం చేసిందని విమర్శించారు. ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు ఇవ్వని ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

News May 9, 2024

కోడూరు: ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి

image

ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడు భద్రావతి నగర్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి మడి తొట్టి సుబ్బ నరసయ్య (27) ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం సాయంత్రం జడ్పీ హై స్కూల్ మిద్దె పైన పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకోవడంతో మంటలు అంటుకొని తట్టుకోలేక కిందకు దూకడంతో మృతి చెందారు. పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 9, 2024

10న కడపలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సెలెక్షన్స్

image

కడప నగరంలోని రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానంలో 10వ తేదీ ఉదయం, సాయంత్రం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-3కి క్రికెట్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఏసీఏ సౌత్ జోన్ కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ACA//APL player registration సైట్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.

News May 9, 2024

పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కడప కలెక్టర్

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాల్లో బుధవారం సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రవర్తన నియమావళిపై జిల్లా ఎలక్షన్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ ఆధ్వర్యంలో పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

News May 9, 2024

నేడు రాజంపేటకు సీఎం జగన్

image

ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నేటితో కలిపి మూడు రోజులు మాత్రమే ప్రచారానికి అనుమతి ఉండటంతో సీఎం జగన్ సుడిగాలి ప్రదర్శన చేపట్టారు. దానిలో భాగంగానే నేడు మధ్యాహ్నం 3 గంటలకు జగన్ రాజంపేటకు రానున్నారు. రైల్వేకోడూరు రోడ్డులో ఎన్నికల ప్రచార సభ ఉంటుందని పార్టీ నాయకులు తెలిపారు. దీంతో జగన్ సభకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.