India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సత్యకుమార్ శనివారం ప్రకటించారు. కడప జిల్లాలో మైదుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ కేంద్రం ఏర్పాటుకు టెండర్లు నిర్వహించామన్నారు. డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుతో కిడ్నీ రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

వైవీయు క్యాంపస్ కళాశాల ఇంగ్లిశ్ విభాగంలో అతిథి అధ్యాపకుల నియామకం కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 29న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆచార్య టి.శ్రీనివాస్ తెలిపారు. ఎం.ఎ. ఇంగ్లిష్ లిటరేచర్, నెట్/సెట్/పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. వివరాలకు www.yvu.edu.in ని సందర్శించాలని సూచించారు.

కడపలో గురువారం నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్రలో <<18946125>>మృతి చెందిన హరి<<>> భార్యకు ఉద్యోగంతో పాటు ఆర్థికంగా ఆదుకుంటామని MLA మాధవి రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ కడప రిమ్స్లో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న అయోధ్య ఐక్యవేదిక సభ్యులు, మేయర్ సురేశ్, టీడీపీ నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కుమారుడి చదువు కోసం సహాయం అందిస్తామని ఐక్యవేదిక సభ్యులు హామీ ఇచ్చారు.

వల్లూరు మండలం పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలోని ‘పాద కంటక’ (ముళ్లు తీసే) శిల్పం అద్భుతమని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్ తెలిపారు. సాధారణ గిరిజన వేషధారణకు భిన్నంగా, ఇందులో కిరాత దంపతులకు పట్టు వస్త్రాలు, నగలు చెక్కడం శిల్పి నైపుణ్యానికి, చిత్రభాషకు నిదర్శనమన్నారు. ఇది గిరిజన సాంప్రదాయాన్ని దైవత్వంతో ముడిపెట్టే అపురూప దృశ్యమని శనివారం ఆయన పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.16,210
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,913
* వెండి 10 గ్రాములు ధర రూ.3,430.

మార్కాపురం జిల్లా పెద్దారికట్ల జంక్షన్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ప్రొద్దుటూరు వాసి మృతి చెందాడు. పొద్దుటూరు నుంచి విజయవాడ వెళ్తున్న వాసవి ట్రావెల్స్ బస్సు, విజయవాడ నుంచి కనిగిరి వస్తున్న RTC బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మైదుకూరు- చిన్నయ్యగారిపల్లెకు చెందిన అన్నపురెడ్డి జనార్దన్రెడ్డి (55) మృతి చెందాడు. సుమారు 10 మంది గాయపడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

బ్రహ్మంగారిమఠంలో శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రసాదం పథకం ద్వారా రూ.139కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆధునిక హంగులతో దేవస్థానం అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు జగన్ గతంలో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. సంబంధిత ఫొటోలతో రూపొందించిన ‘జగన్నాథుని జనయాత్ర’ పుస్తకాన్ని తాడేపల్లిలోని తన కార్యాలయంలో జగన్ శుక్రవారం ఆవిష్కరించారు. పుస్తక రచయిత రాచమల్లు రవిశంకర్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. రచయితను జగన్ అభినందించారు.

బ్రహ్మంగారిమఠంలో శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రసాదం పథకం ద్వారా రూ.139కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆధునిక హంగులతో దేవస్థానం అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

దేవుని గడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగించారు. ఉదయం నుంచి స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
Sorry, no posts matched your criteria.