Y.S.R. Cuddapah

News April 11, 2024

కడప: షర్మిల బస్సు యాత్ర షెడ్యూల్ విడుదల

image

12, 13వ తేదీ కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి బస్సు యాత్ర షెడ్యూల్ విడుదలైంది.
12వ తేదీ వేంపల్లి, వేముల, పులివెందుల, లింగాల, సింహాద్రిపురం మండలాల్లో బస్సు యాత్ర సాగనుంది. అనంతరం పులివెందుల పూలంగళ్ళో మీటింగ్ నిర్వహించనున్నారు.
13వ తేదీ ఎర్రగుంట్ల, ముద్దనూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో బస్సు యాత్రను షర్మిల చేపట్టనున్నారు.

News April 11, 2024

సిద్దవటం: రైలు కిందపడి యువకుడి సూసైడ్

image

సిద్దవటం గాంధీ వీధిలో నివాసమున్న రెడ్డి మోహన్(18) భాకరాపేట-కనుములోపల్లి మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ పై రైలు కింద మృతి చెందాడు. బుధవారం రాత్రి 2:30 గంటలకు గుర్తించామని, మృతికి గల కారణాలు విచారిస్తున్నామని రైల్వే పోలీసులు తెలియజేశారు. మృత్యువాత పడ్డ వ్యక్తి రెడ్డి మోహన్ ద్విచక్రవాహనంలో వచ్చాడని తెలిపాడు. స్వాధీనం చేసుకుని, పంచనామా నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించామని రైల్వే పోలీసులు అన్నారు.

News April 11, 2024

కలసపాడు: మెట్ల పైనుంచి పడి వ్యక్తి మృతి

image

కలసపాడు మండలం శంఖవరంలో బుధవారం రమణారెడ్డి అనే వ్యక్తి మెట్లపై నుంచి జారిపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శంకవరంలో చిన్న కృష్ణారెడ్డి ఇంట్లో అతని కుమారుడు చరణ్ రెడ్డితో మాట్లాడేందుకు వెళుతుండగా జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.

News April 11, 2024

నేడు కడపకు కొండా రాఘవరెడ్డి.. షర్మిలపై కీలక ప్రెస్ మీట్

image

వైఎస్ షర్మిల ముఖ్య అనుచరుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకుడు కొండా రాఘవరెడ్డి నేడు కడపకు రానున్నారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి షర్మిల చేసిన అన్యాయంపై కడపలో ఆయన కీలక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ పేరిట వైఎస్ షర్మిల చేసిన మోసం అక్రమాలపై ఈరోజు నుంచి ఆయన రాష్ట్రంలో పర్యటించి ప్రజలకు తెలుపనున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు. 

News April 11, 2024

ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలి: అన్నమయ్య కలెక్టర్

image

కోడూరు నియోజకవర్గంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ ప్రక్రియలను నిర్వహించాలని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కోడూరు మండలం అనంతరాజుపేటలోని ఉద్యానవన యూనివర్సిటీలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూములను ఎస్పీతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

News April 10, 2024

REWIND: కమలాపురంలో అత్యధికం 38,727: అత్యల్పం 86

image

కమలాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1989లో కాంగ్రెస్ నుంచి మైసూరారెడ్డి 38,727 ఓట్ల మోజార్టీతో విజయం సాధించారు. ఇదే ఇప్పటి వరకు అత్యధికం. ఇక అత్యల్పంగా 1967లో స్వంతంత్ర అభ్యర్థి ఎన్.పుల్లారెడ్డి కేవలం 86 ఓట్లతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి, కూటమి నుంచి పుత్తా కృష్ణ చైతన్య బరిలో ఉన్నారు. వీరిలో మీరు ఎవ్వరు గెలుస్తారనుకుంటున్నారు.

News April 10, 2024

ఆ సిబ్బందిని వెంటనే బదిలీ చేయండి: భూమిరెడ్డి

image

జిల్లాలో 2019 తర్వాత నియమించిన హోం గార్డులును వేరే జిల్లాలకు బదిలీ చేయాలని శాసనమండలి సభ్యుడు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఈసీని కోరారు. సీఎం జగన్.. ఆయనకు అనుకూలంగా ఉన్న వారికి ఈ పదవులు ఇచ్చారని రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. వారు ఎన్నికల పమయంలో అధికారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందన్నారు.ఈ నేపథ్యంలో బదిలీ చేయాలని, లేకుంటే ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీకి లేఖ రాశారు.

News April 10, 2024

కడప: ‘జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం’

image

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలోని విద్యాశాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుబ్బారెడ్డిలు తెలిపారు. కడపలో వారు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడు లేనివిధంగా, దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మన రాష్ట్రంలో నాడు నేడు మనబడి కింద ప్రతి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేశారన్నారు. ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు.

News April 10, 2024

రాజంపేట: ‘ఇప్పటికైనా గుర్తించి, సీటు ఇస్తే గెలుచుకొస్తా’

image

టీడీపీ అధిష్ఠానం ఇప్పటికైనా గుర్తించి, తనకు టీడీపీ టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తానని రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ బత్యాల చెంగల్రాయుడు ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట రాంనగర్‌లో బుధవారం తెలుగుదేశం పార్టీ తరఫున బత్యాల ప్రచారం ప్రారంభించారు. రాజంపేట టీడీపీ అభ్యర్థి సుగవాసి ఈరోజు ప్రచారం ప్రారంభించగా, అదే సమయానికి బత్యాల మరో చోటు నుంచి ప్రచారం ప్రారంభించడం అందరినీ అయోమయ పర్చింది.

News April 10, 2024

కువైట్‌లో ఓబులవారిపల్లె వాసి మృతి

image

బతుకుతెరువు కోసం కువైట్‌కి వెళ్లి ప్రమాదశాత్తు ఓబులవారిపల్లెకు చెందిన ఓబిలి సుబ్బ నరసింహారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఈయన కొన్నేళ్లుగా కువైట్‌లో క్రేన్ దగ్గర ఉద్యోగరీత్యా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు. డ్యూటీకి వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఇసుక లారీ వ్యాన్‌ను ఢీకొనడంతో వెనుక భాగంలో ఉన్న ఇతను అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.