India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కడప జిల్లా ఇంఛార్జి మంత్రి సావిత్రమ్మ నేడు కడపకు వస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో జరిగే జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశానికి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.
తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని గజవాహనంపై అలంకరించి నాలుగు మాడవీధుల్లో విహారం చేశారు. నేడు స్వామివారి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేపు రథంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
వైవీయూ, అనుబంధ కళాశాలల ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం మూడో సెమిస్టర్ పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తమ చాంబరులో రిజిస్ట్రార్ ప్రొ పి.పద్మ, సీఈ ప్రొ కెఎస్వీ కృష్ణారావుతో కలిసి పీజీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం https:www.yvuexams.in/results.aspx అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. ఏసీఈలు డా.మమత, డా.శ్రీనివాసులు పాల్గొన్నారు.
ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను సత్వరమే విచారించి పరిష్కరించాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ తగిన సమయంలో విచారించి న్యాయం చేయాలన్నారు.
పులివెందుల పట్టణం స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి అరటికాయల మోహన్‌పై కొంతమంది దాడి చేయడంతో మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. అరటికాయల వ్యాపారి రూ.2 వేలు అప్పు చెల్లించలేదనే నెపంతో కొంతమంది దాడి చేసినట్లు తెలుస్తోంది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ వ్యాపారి మృతి చెందినట్లు తెలిసింది.
కొండాపురం రైల్వే స్టేషన్ – చిత్రావతి బ్రిడ్జి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. ఈ ఘటనలో తల, మొండెం వేర్వేరు అయ్యాయి. రైల్వే పోలీసులు అందించిన సమాచారం మేరకు.. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే సమాచారం అందించాలని ఎర్రగుంట రైల్వే పోలీసులు తెలిపారు.
కడప ఫాతిమా వైద్య కళాశాలలోని హాస్టల్లో వంట పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మన్సూరాఖాన్ (43) అనే వ్యక్తి అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో తాను ఉంటున్న గదిలోనే చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే కళాశాలలో అతని భార్య ఫరియా వార్డెన్‌గా పనిచేస్తున్నారు. వీరికి కుమారుడు ఉన్నారు. వీరు రెండేళ్ల క్రితం కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. భార్య ఫరియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ కుమార్ గుప్తాను కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కలిశారు. మంగళగిరి రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. డీజీపీకి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని పలు అంశాలను డీజీపీ దృష్టికి తీసుకుని వచ్చారు.
వీరపునాయునిపల్లి మండలం నేలతిమ్మయ్యపల్లి సమీపంలో శనివారం ఉదయం కూలీల ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఏడుగురికి గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఓ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి వేంపల్లికి వస్తుండగా ఘటన జరిగింది. క్షతగాత్రులను 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
టీడీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి కడపలో నిర్వహిస్తున్నట్లు పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మే నెలలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక కడపలో నిర్వహిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.