Y.S.R. Cuddapah

News August 13, 2024

కడప: రామలక్ష్మణ నాణెం పేరిట మోసం

image

కడపకు చెందిన వ్యాపారి గంజికుంట రాజేంద్రని రూ.2 కోట్ల విలువైన రామక్ష్మణ కెమికల్ నాణేలు తమ వద్ద ఉన్నాయని వాటిని రూ.3 లక్షలకే ఇస్తామని విజయవాడకు పిలిపించి కిడ్నాప్ చేశారు. తన భార్యకు ఫోన్ చేసి రూ.30 లక్షలు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని బెదిరించారు. రాజేంద్ర బాత్ రూమ్‌కని చెప్పి ఫోన్‌లో తన బావకు జరగిందంతా మెసేజ్ చేశాడు. ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గవర్నర్ పేట పోలీసులు అతడిని కాపాడారు.

News August 13, 2024

కడప జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం

image

ఈనెల 21న ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. మండలంలోని మైసూరుపరిపల్లెలో నిర్వహించే రెవెన్యూ సదస్సులో ఆయన పాల్లొననున్నారు. గత YCP ప్రభుత్వంలో జరిగిన అక్రమ భూదందాలపై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం ఈనెల 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ రానున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు.

News August 13, 2024

వైవీయూ డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షలు ప్రారంభం

image

కడప వైవీయూ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఇన్‌స్టంట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు డిగ్రీ ఐదో సెమిస్టర్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాల విద్యార్థులు విశ్వవిద్యాలయ కేంద్రంలో హాజరయ్యారు. పరీక్షలను వైవీయూ వీసీ ఆచార్య కె.కృష్ణారెడ్డి, కులసచివులు ఆచార్య ఎస్.రఘునాథరెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య ఎన్.ఈశ్వర రెడ్డి తనిఖీ చేశారు.

News August 13, 2024

కడపలో రిహార్సల్స్ పరిశీలిన

image

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కవాతు రిహార్సల్స్ పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కృష్ణారావు, ఆర్ఐలు ఆనంద్, వీరేశ్ పాల్గొన్నారు.

News August 12, 2024

వైవీయూకు మెరుగైన ర్యాంకు

image

కడప వైవీయూ అనతి కాలంలోనే అత్యున్నత ప్రమాణాలు, పరిశోధనలతో ప్రముఖ విశ్వవిద్యాలయంగా కీర్తిని అందుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్-2024లో వైవీయూకు 50 నుంచి 100 లోపు ర్యాంకులో నిలిచింది. పరిశోధన అభివృద్ధి, ప్లేస్‌మెంట్, ఔట్ రీచ్ అండ్ ఇన్ క్లూసివిటి, పీర్ పర్సెప్షన్ అంశాలను ప్రామాణికంగా తీసుకుని ర్యాంకు ఇచ్చారు.

News August 12, 2024

పులివెందులలో దొంగల భయం

image

పులివెందుల పట్టణంలోని పార్నపల్లి బస్టాండ్‌లో వరుస దొంగతనాలతో ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో దాదాపు 10కి పైగా దొంగతనాలు జరిగాయని సమాచారం. లింగాలకు చెందిన ఓ వ్యక్తి నుంచి వరుసగా 3 సెల్ ఫోన్లు, రూ.లక్ష నగదు వేర్వేరు సమయాల్లో దొంగలు దోచుకెళ్లారు. ఈ విషయమై అర్బన్ సీఐ మోహన్ కుమార్‌ మాట్లాడుతూ.. పార్నపల్లి బస్టాండ్‌లో దొంగతనాలు జరగకుండా పోలీసులతో గస్తీ నిర్వహిస్తామని చెప్పారు.

News August 12, 2024

సాగునీటిని విడుదల చేయండి: కడప ఎంపీ

image

పులివెందుల నియోజకవర్గ రైతులకు సాగునీటిని విడుదల చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నీటిపారుదల శాఖ CE మల్లికార్జున రెడ్డికి సూచించారు. సోమవారం సాయంత్రం ఆయన CE మల్లికార్జున రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. నియోజకవర్గంలో త్రీవ వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు పూర్తిగా అడుగంటి పోయాయన్నారు. దీంతో రైతన్నలు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

News August 12, 2024

21న పవన్ కళ్యాణ్ రాక

image

ఉమ్మడి కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రెవెన్యూ సదస్సులు చేపట్టనుంది. ఈక్రమంలో ఈనెల 21న రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లెలో నిర్వహించే సదస్సుకు డిప్యూటీ సీఎం హాజరవుతారని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన పవన్ పర్యటనపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

News August 12, 2024

రాజంపేటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

రాజంపేటలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సర చదువుతున్న విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వైయస్సార్ జిల్లా పోరుమామిళ్లకు చెందిన పవన్ కళ్యాణ్ రాజంపేటలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే రాజంపేట మండలం హస్తవరం గ్రామ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News August 12, 2024

జమ్మలమడుగు ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

image

జమ్మలమడుగు-ముద్దనూరు రహదారిలో చిరుత కనిపించినట్లు స్థానిక యువకులు తెలిపారు. ఈ విషయాన్ని ఆ కొండ ప్రాంతంలో ఉన్న గొర్రెల కాపరులకు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే.. ముద్దనూరు పట్టణంలోని వ్యర్థాలను ముద్దనూరు-జమ్మలమడుగు ప్రధాన రహదారిలో వేస్తున్నారు. ఈ వ్యర్థాల వద్దకు పందులు, కుక్కలు ఎక్కువ సంచరిస్తూ ఉండేవి. ఇందులో భాగంగా ఆ కుక్కలు, పందుల కోసం చిరుత సంచరించినట్లు స్థానికులు తెలిపారు.