Y.S.R. Cuddapah

News August 12, 2024

గండికోట జలాశయానికి రాకపోకలు బంద్

image

గండికోట జలాశయానికి భారీగా కృష్ణా జలాలు చేరుతున్న నేపథ్యంలో సందర్శకులు ప్రాజెక్టు లోపలికి రాకుండా బారికేడ్లను ఆదివారం మూసివేశారు. అవుకు జలాశయం నుంచి 11,300 క్యూసెక్కుల నీటిని GNSS ప్రధాన కాలువ ద్వారా గండికోటకు విడుదల చేశారు. నీటిని చూసేందుకు ఆసక్తితో చిన్నా, పెద్దా అని లేకుండా వస్తున్నారు. కాగా నీటి ప్రవాహం కొనసాగుతున్నందున ప్రమాదమని టన్నెల్ సమీపం వద్దకు ఎవరినీ అనుమతించడంలేదు.

News August 12, 2024

ఓబులవారిపల్లి: స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థిని మృతి

image

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ పాఠశాల బస్సు ఆయలరాజుపల్లె పరిధి పాములేరు వంక వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News August 12, 2024

కడప: కుమార్తెను చూసేందుకు వెళ్తూ ప్రమాదంలో మృతి

image

పెనగలూరు మండలం ఇండ్లూరుకు చెందిన నరసింహులు తన కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈయన ఖతర్ వెళ్లి వారం క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. అవ్వగారి ఇంటివద్ద ఉన్న కుమార్తెను చూసేందుకు చిన్న కుమారుడు రిషీతో కలిసి నెల్లూరుకుబైక్‌పై నరసింహులు బయలుదేరారు. ఓబులాయపల్లె వద్దకు రాగానే మరో బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందగా రిషీకి గాయాలయ్యాయి.

News August 12, 2024

తమిళనాడులో ఘోర ప్రమాదం.. ప్రోద్దుటూరు విద్యార్థి మృతి

image

తమిళనాడులోని తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో APలోని పలు జిల్లాలకు చెందిన ఐదుగురు ఉండగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతి చెందినవారిలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గిద్దలూరు నితిశ్(21) తిరుపతికి చెందిన యుగేశ్(23), చేతన్(22), కర్నూలుకు చెందిన రామ్మోహన్(21), విజయవాడకు చెందిన బన్ను నితిశ్(22) ఉండగా.. విష్ణు, చైతన్యలకు గాయాలయ్యాయి.

News August 12, 2024

కడప: 109 రకాల నూతన వంగడాలు విడుదల

image

వాతావరణ మార్పులను తట్టుకొని పోషకాలు జోడించిన అత్యధిక దిగుబడులు ఇచ్చే 109 రకాల నూతన వంగడాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం విడుదల చేశారని కేవీకే సమన్వయకర్త వీరయ్య తెలిపారు. ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నూతన వంగడాల విడుదలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నూతన వంగడాలను రైతులు సాగు చేసి మంచి దిగుబడులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

News August 12, 2024

కడప: చేనేత కళాకారులను ప్రోత్సహించండి

image

చేనేత కళాకారులను ప్రోత్సహించాలని, చేనేత వస్త్రాలను ధరించి, చేనేత పరిశ్రమను ప్రోత్సాహించాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, ఎమ్మెల్యే మాధవి రెడ్డి సంయుక్తంగా పిలుపునిచ్చారు. శిల్పారామంలో చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాల స్టాల్‌లను వీరు ప్రారంభించారు. వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించి వారి ఆర్థిక అభివృద్ధికి చేయూతనివ్వాలని అన్నారు. చేనేత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

News August 11, 2024

కడప: నోటిఫికేషన్ విడుదల

image

రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి బీఆర్ ప్రవేశాలకు కన్వీనర్ కడప డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ ఉపకులపతి విశ్వనాథరెడ్డి తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు ఇంటర్ లేదా డిప్లొమా పూర్తి చేసి అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 19లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News August 11, 2024

నందలూరు: మధ్యలో ఆగిపోయిన పెళ్లి

image

నందలూరు మండలంలోని అరవ పల్లి గ్రౌండ్ వద్ద ఉన్న షాదీ ఖానాలో ఆదివారం పెళ్లి కుమారుడిపై జరిగిన దాడి మండలంలో కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. అరవపల్లి షాది ఖానాలో ఆదివారం ఓ ముస్లిం జంట వివాహం జరుగుతుండగా తిరుపతికి చెందిన జయ అనే వివాహిత పెళ్లి కుమారుడిపై కత్తి, యాసిడ్తో దాడికి యత్నించిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 11, 2024

ప్రతి రోజు వస్తుంది.. కానీ కోడూరు స్టాపింగ్ తొలగించారు

image

పాండిచ్చేరి- కాచిగూడ రైలుకు రైల్వే కోడూరులో స్టాపింగ్ తొలగించడం అన్యాయమని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాండిచ్చేరి – కాచిగూడ రైలును రెండుగా మార్చి ఒక రోజు పాండిచ్చేరి వరకు మరొక రోజు చెంగల్‌పట్టు వరకు నడపడం వల్ల రాజంపేట, కడప నుంచి వెళ్లే ప్రయాణీకులకు మాత్రం ఈ రెండు రైళ్లు కలిపి వారం అంతా అందుబాటులో ఉంటాయి. వీరు ఆనందపడుతుండగా.. స్టాపింగ్ కావాలని కోడూరు ప్రయాణీకులు కోరుతున్నారు.

News August 11, 2024

బ్రహ్మంగారిని దర్శించుకున్న అఖిలప్రియ

image

కాలజ్ఞాని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బ్రహ్మంగారి మఠం మేనేజర్, పీఠాధిపతులు ఆధ్వర్యంలో భూమా అఖిలప్రియ కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. బ్రహ్మంగారి కాలజ్ఞాన విశిష్టత గురించి ఆలయం అర్చకులు ఆమెకు వివరించారు.