India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజంపేట రైల్వే స్టేషన్ సమీపంలో డెడ్‌బాడీ కలకలం రేపింది. 2వ ప్లాట్ ఫాం పక్కన ఉన్న మద్యం షాప్ సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఎవరనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
వేముల మండలం మబ్బుచింతలపల్లి గ్రామ సమీపంలోని తోటలో మంగళవారం తెల్లవారుజామున విశ్వజిత్ సాహు అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. అయితే మృతుని తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకు ఉరి వేసుకుని చనిపోయే వ్యక్తి కాదని, మృతిపై అనుమానాలు ఉన్నాయంటున్నారు. మృతుడి తండ్రి విక్రమ్ కుమార్ ఫిర్యాదు మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
రైతుల ఆలోచన విధానంలో మార్పు వస్తే వ్యవసాయంలో అత్యధిక లాభాలు గడించవచ్చని కలెక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు. మంగళవారం కడప కలెక్టర్‌లోని తన ఛాంబర్‌లో వ్యవసాయ శాఖపై ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని కూడా ఒక పరిశ్రమగా గుర్తించాలని రైతులు ఉపయోగించే పనిముట్లు ఇతర వస్తువులను ఆధునికీకరించే దిశగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, రైతులకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. దీనికి సంబంధించి తిరుపతిలో జనవరి 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి టోకెన్లు ఇవ్వనున్నారు. ఆ ఏరియాలు ఇవే..
➤ రామచంద్ర పుష్కరిణి ➤ జీవకోన ZP స్కూల్
➤ ఇందిరా మైదానం ➤ శ్రీనివాసం రెస్ట్ హౌస్
➤ విష్ణునివాసం ➤ 2వ చౌల్ట్రీ
➤ రామానాయుడు హైస్కూల్ బైరాగిపట్టెడ
➤ ఎమ్మార్ పల్లి జడ్పీ స్కూల్
జమ్మలమడుగు నగర పంచాయతీ వార్డు మహిళా సంరక్షణ సచివాలయ ఉద్యోగిని యం. భారతి భాయినిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ కె.వెంకట్రామి రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పింఛన్ పంపిణీలో ఒక్కొక్క లబ్దిదారుడు నుంచి రూ.300 నుంచి రూ.500లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో విచారించిన అధికారులు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
YCP నేత వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసుల దూకుడు పెంచారు. గుంటూరుకు చెందిన పలువురిని పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన వివరాల మేరకు.. కళ్ళం హరికృష్ణ రెడ్డి, ప్రేమ్ సాగర్, వెంకటరామిరెడ్డి లను అదుపులోకి తీసుకొని పులివెందుల తరలించారు. ఇప్పటికే ఈ కేసులో వర్రా రవీంద్రారెడ్డిని అరెస్టు చేయగా.. మొత్తం ఈ కేసుకు సంబంధించి 100 మందికి పైగా ఉన్నట్లు సమాచారం.
నూతన సంవత్సర వేడుకలలో యువకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే తాటతీస్తామని జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత సామరస్యంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. బైకులకు సైలెన్సర్ తీసి పెద్దగా శబ్దం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే బైక్ సిస్టంతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసులకు దయచేసి సహకరించాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
కమలాపురంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గుర్తుతెలియని ఓ మహిళ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కమలాపురం రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళుతుంది. ఈ క్రమంలో రైలు వచ్చి ఢీకొట్టడంతో కిందపడింది. స్థానికులు అక్కడికి చేరుకొని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి నిర్మాణ పనుల పురోగతిపై ఆయా శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా మినరల్ ఫండ్ ద్వారా నిర్మిస్తున్న వివిధ రకాల పెండింగ్ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలన్నారు.
కడప జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గురునాథ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్‌గా వున్న గురునాథ్ ఎస్ఐ అని చెప్పుకొంటూ ప్రజలను బెదిరించడం, సక్రమంగా విధులు నిర్వర్తించకుండా ఉండటంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వారు అందించిన నివేదిక ప్రకారం అతనిపై ఎస్పీ వేటు వేశారు
Sorry, no posts matched your criteria.