Y.S.R. Cuddapah

News August 2, 2024

రెండు నెలలపాటు ఒంటిమిట్ట రామయ్య గర్భాలయం మూసివేత

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి గర్భాలయాన్ని రెండు నెలలపాటు మూసివేస్తున్నట్లు టీటీడీ ఆగమ అర్చకులు రాజేశ్ బట్టార్ తెలిపారు. గురువారం ఒంటిమిట్ట టీటీడీ పాలక భవనంలో పురావస్తు శాఖ వారితో టీటీడీ అధికారులు, అర్చకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయం మరమ్మతుల్లో భాగంగా సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 2నెలలపాటు బాలాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహాలతో దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయించారు.

News August 2, 2024

తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరం: కలెక్టర్ శివశంకర్

image

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బిడ్డకు తొలి ఆహారం తల్లి పాలేనని, టీకా కూడా తల్లిపాలతో సమానమేనన్నారు. శిశువు ఆరోగ్యంగా ఎదగాలంటే 100% తల్లిపాలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు.

News August 1, 2024

పుల్లంపేట: గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

పుల్లంపేట మండలం అనంతయ్యగారి పల్లి గ్రామం వద్ద గల సెల్ టవర్ వద్ద, సుమారు 35 సంవత్సరాలు వయసు గల వ్యక్తి మృతి చెందాడని పుల్లంపేట పొలీసులు తెలిపారు. సదరు వ్యక్తి నలుపు, తెలుపు చెక్స్ కలిగిన ఫుల్ చొక్కా, బ్లూ కలర్ నైట్ ప్యాంటు ధరించి ఉన్నాడని, ఫోటోలోని వ్యక్తిని గుర్తించిన ఎడల పుల్లంపేట పోలీస్ వారికి తెలపాలని కోరారు.

News August 1, 2024

పెన్షన్ పంపిణీలో YSR జిల్లాకు 4వ స్థానం

image

కడప జిల్లాలో గురువారం నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లాకు నాలుగవ స్థానం లభించింది. మొత్తం 2,64,013 మంది లబ్ధిదారులకు గాను.. అందుబాటులో ఉన్న 2,58,100 మందికి, పెన్షన్ మొత్తాన్ని సచివాలయ సిబ్బందిచేత 97.76% పంపిణీ చేసి రాష్ట్రంలో నాలుగవ స్థానంలో నిలవడం జరిగింది. అందుకుగాను పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటీ తెలిపారు.

News August 1, 2024

కడప: పోలీస్ సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

image

కడప జిల్లాలో పనిచేస్తున్న పోలీసులు, సిబ్బంది సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విభాగాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. కల్పతరు పోలీస్ వెల్ఫేర్ స్టోర్స్ సందర్శించి, అందులో లభించే కిరాణా ఎలక్ట్రికల్ వస్తువులు గురించి ఆరా తీశారు. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

News August 1, 2024

గండి ఆలయ ఏసీపై కలెక్టర్‌కు ఫిర్యాదు

image

గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సుబ్బయ్యపై, ఆలయ ఛైర్మన్ కావలి కృష్ణతేజ జిల్లా కలెక్టర్ శివశంకర్‌కి ఫిర్యాదు చేశారు. శ్రావణమాస ఉత్సవాలలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల విషయంలో ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారని ఆరోపించారు. గోడ పత్రాలు, ప్రచార పత్రాల్లో ఛైర్మన్, పాలకమండలి సభ్యుల వివరాలు లేకుండా అసిస్టెంట్ కమిషనర్ నిర్వహణ పేరుతో అవమానపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News August 1, 2024

తల్లిపాలు బిడ్డకు అమృతాహారం.. కలెక్టర్

image

తల్లిపాలు బిడ్డకు అమృతాహారం.. ప్రపంచంలో నేటి వరకు తల్లి పాలకు ప్రత్యామ్నాయం ఏదీ లేదని, శిశువు ఆరోగ్యంగా ఎదగడంలో తల్లిపాలు కీలకపాత్ర పోషిస్తాయని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. అమ్మపాలే నూటికి నూరు శాతం పోషక విలువలు కలిగి ఉంటాయని అన్నారు.

News August 1, 2024

హంగామా అంతా ఉత్తిదేనా: విజయ్ కుమార్

image

ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ కుమార్ యూట్యూబ్ వీడియోల్లో చేసిందంతా హంగామానేనా అని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. బుధవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘రెండేళ్లపాటు వీడియో రికార్డింగ్ బృందాన్ని వెంటేసుకొని అంగన్వాడీ టీచర్లపై కేసులు పెట్టేస్తా, సస్పెండ్ చేస్తా అని చెప్పిన మాటలన్నీ ఉత్తివే.. ఎవరిమీద ఒక్క కేసు కూడా పెట్టలేదు’ అని దుయ్యబట్టారు.

News August 1, 2024

కడప జిల్లాలో పెన్షన్ పంపిణీ @9AM

image

జిల్లాలో ఆగస్టు నెలకి సంబంధించిన సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఇందులో భాగంగా 2,64,014 పెన్షన్లకు గాను 2,07,306 పెన్షన్లను పంపిణీ చేసి 78.52% పూర్తి అయింది. ఉదయాన్నే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ దారుల ఇంటి దగ్గరకి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కడప జిల్లా నాల్గవ స్థానంలో కొనసాగుతోంది.

News August 1, 2024

పెన్షన్ల పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు: కడప కలెక్టర్

image

కడప జిల్లా వ్యాప్తంగా నేడు జరిగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పని కలెక్టర్ శివశంకర్ హెచ్చరించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ కోసం బయోమెట్రిక్ యాప్‌ను ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. ఎక్కడ చిన్న పొరపాటు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు.